breaking news
commutes
-
TS: మెట్రో రైలెక్కిన హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లో మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ఎల్బీనరగ్ స్టేషన్ నుంచి లక్డీకపూల్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణిస్తూ సరదాగా ప్రయాణికులతో ముచ్చటించారు. నాగోల్ శిల్పారామంలో ఓ కార్యక్రమంలో పాల్గొని రవీంద్రభారతిలో మరో కార్యక్రమానికి వెళ్లేందుకు హరీశ్‌రావు మెట్రో రైలెక్కారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా మెట్రో రైలులో ప్రయాణించి ప్రయాణికులతో కాసేపు సరదాగా ముచ్చటించిన విషయం తెలిసిందే. ఇదీచదవండి..కొండా సురేఖ, పల్లా వాగ్వాదం ఎందుకంటే -
మరణశిక్ష పడిన ఖైదీకి రాష్ట్రపతి క్షమాభిక్ష
న్యూఢిల్లీ: భార్యా,పిల్లలను హత్య చేసిన కేసులో మరణశిక్ష పడిన ఖైదీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష ప్రసాదించారు. క్షమాభిక్ష ప్రసాదించమంటూ మన్ మహదూర్ అనే ఖైదీ పెట్టుకున్న అర్జీపై రాష్ట్రపతి మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తూ గురువారం సంతకం చేశారు. అసోంలోని దిబ్రూగర్ ప్రాంతానికి చెందిన మన్ బహదూర్ దివాన్, భార్య గౌరి, కుమారులు రాజీబ్, కాజీబ్లను 2002 సెప్టెంబర్‌లో కిరాతకంగా హత్య చేశాడు. అంతేకాకుండా మన్ మహదూర్.. గతంలో కూడా పొరుగింటి వ్యక్తిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన నేర చరిత్ర ఉంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతిపాదన మేరకు రాష్ట్రపతి ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివిధ కేసుల్లో కోర్టులు మరణశిక్ష విధించిన దోషులు, తమకు క్షమాభిక్ష ప్రసాదించమంటూ విన్నవించుకోవడం, వాటిని పరిశీలించిన మీదట రాష్ట్రపతి నిర్ణయం ప్రకటించడం ఆనవాయితీ. అయితే నిఠారీ వరుస హత్యల కేసులో మరణశిక్ష పడిన సురేందర్ కోలీ, 22 మందిని హత్యచేసిన యాకూబ్ మీనన్ పిటిషన్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల తిరస్కరించిన సంగతి తెలిసిందే.