breaking news
Comes Back
-
ఆమెకు 40 ఏళ్లకు గతం గుర్తుకొచ్చిందట!
కాన్పూర్: ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన అచ్చం సినిమా కథను తలపిస్తోంది. చనిపోయిందని భావించిన ఓ మహిళ దాదాపు 40సం.రాల తరువాత తిరిగి వచ్చింది. తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాన్పూర్లో ఇన్యత్ పూర్ గ్రామంలో ఈ అద్భుత సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ గతం మర్చి పోయిన విలాసకు (82) 40 ఏళ్ల తర్వాత గతం గుర్తుకు రావడం, కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఓ వింతగా మారింది. వివరాల్లోకి వెళితే..1976లో పాముకాటుతో విలాస మహిళ మరణించింది. అంటే సుమారు 40 ఏళ్ల క్రితం పశుగ్రాసం కోసం అడవికి వెళ్లినపుడు పాము కాటుకు గురైంది. ఆమెకు నాటు వైద్యం చేయించినా ఫలించలేదు. దీంతో ఆమె మరణించిందని భావించిన బంధువులు ఆమెను గంగా నదిలో పడేసి,అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించారు. నదిలో కొట్టుకుపోతున్న ఆమెను కన్నోజ్ సరిహద్దు గ్రామం సరోజ్ టేకూ కు చెందిన రామసరన్ కాపాడి వైద్యం అందించారు. అయితే, ఆమె స్పృహ లోకి వచ్చి కోలుకున్నప్పటికీ, గతం మర్చిపోయింది. దాంతో వారి దగ్గరే ఉండిపోయింది. ఇటీవలే ఆశ్చర్యకరంగా ఆమెకు తన గతం పూర్తిగా గుర్తుకొచ్చింది. దీంతో విషయం తెలుసుకున్న పలువురు ఆమె చెప్పిన వివరాలను విశ్వసించి, వివరాలు సేకరించారు. అనంతరం సొంత గ్రామానికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో కలిపారు. పుట్టుమచ్చలు ఆధారంగా తల్లిని గుర్తించారు విలాస కుమార్తెలు రామ కుమారి, మున్ని సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల తరువాత తమ తల్లిని తిరిగి కలుసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. -
పోస్టుమార్టంకు తీసుకెళితే లేచి కూర్చున్నాడు!
ముంబయి: ఒకసారి వ్యక్తి చనిపోయాక తిరిగి లేవడం అంటూ జరగదు. అలా జరిగితే సంతోషపడటమేమోగానీ అవాక్కయ్యి భయంలోకి కూరుకుపోవడం ఖాయం. ముంబయిలో ఇలాంటి విచిత్ర ఘటనే చోటు చేసుకుంది. చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించిన ఓ వ్యక్తికి మరికాసేపట్లో పోస్టుమార్టం నిర్వహిస్తారనగా అతడు లేచి కూర్చున్నాడు. దీంతో పోస్టుమార్టం నిర్వహించేవారు, వైద్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. సులోచన శెట్టి మార్గ్ లో ఉన్న సెయింట్ బస్టాప్ వద్ద ఓ వ్యక్తి(42) అపస్మారక స్థితిలోకి పడిపోయి ఉన్నాడని కొందరు వ్యక్తులు పోలీసులకు చెప్పడంతో వారు అతడిని ప్రభుత్వ సియోన్ ఆస్పత్రి(లోకమాన్య తిలక్ ఆస్పత్రి)కి తరలించారు. ఆ వ్యక్తిని పరీక్షించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహన్ రోహెకర్ అతడు చనిపోయినట్లు నిర్ధారించాడు. పోస్టుమార్టానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేశారు. రికార్డుల్లో కూడా అతడు చనిపోయినట్లు చేర్చారు. అనంతరం పోస్టు మార్టానికి తరలించగా అందులో ఆ వ్యక్తి తిరిగి స్పృహలోకి వచ్చి లేచి కూర్చున్నాడు. దీంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. తాను చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం ఆ వైద్యుడు చేశారు. ప్రభుత్వ వైద్యులు ఎంతటి నిర్లక్ష్యంతో ఉంటారో ఈ సంఘటనే ఉదాహరణ అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.