breaking news
church school
-
హిజాబ్ వివాదం.. వేరే పాఠశాలకు విద్యార్థిని
కొచ్చి: ఇక్కడి చర్చి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలో హిజాబ్ ధారణకు యాజమాన్యం అభ్యంతరం తెలపడంతో, ఆ విద్యార్థినిని మరో పాఠశాలలో చేర్చాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. కాగా, పాఠశాల నిబంధనలకు కట్టుబడితే విద్యార్థిని తిరిగి చదువు కొనసాగించడానికి స్వాగతిస్తామని పాఠశాల యాజమాన్యం స్పష్టం చేసింది. పల్లూరుత్తిలోని సెయింట్ రీటాస్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని తండ్రి.. తన కుమార్తెను తిరిగి అదే పాఠశాలకు పంపబోమని స్పష్టం చేశారు. ఈ వివాదం తర్వాత తన కుమార్తె తీవ్ర ఒత్తిడికి లోనైందని, తిరిగి అదే పాఠశాలకు వెళ్లడం తనకిష్టం లేదని చెప్పిందన్నారు. వివాదం మొదలైనప్పటి నుండి పాఠశాల ఉపాధ్యాయులు లేదా యాజమాన్యం తమను సంప్రదించలేదని తెలిపారు. ‘నా కూతురు గత రెండు రోజులుగా తరగతులకు హాజరు కావడం లేదు, మాకు స్కూల్ నుండి ఎలాంటి సమాచారం అందలేదు’అన్నారు. ఈ వివాదంపై విద్యార్థినికి మద్దతు పలికిన కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్కుట్టి మాట్లాడుతూ.. హెడ్‌స్కార్ఫ్ ధరించే ఉపాధ్యాయిని (నన్) ఒక విద్యార్థినిని హిజాబ్ ధరించనివ్వకపోవడం ఆశ్చర్యకరం, విడ్డూరమని వ్యాఖ్యానించారు. మరోవైపు, పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ హీలీనా ఆల్బీ మాట్లాడుతూ.. విద్యార్థిని పాఠశాల నియమాలను పాటిస్తే.. ఆమె యధాప్రకారం చదువుకోవచ్చని తెలిపారు. ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. తమ పాఠశాలలో భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ విలువలను సమ్మిళితం చేస్తూ విద్యను అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. స్కూల్ డ్రెస్ కోడ్‌కు విరుద్ధంగా.. బాలిక హిజాబ్ ధరించడంపై యాజమాన్యం అభ్యంతరం చెప్పడంతో ఈ వివాదం మొదలవడం తెలిసిందే. దీనిపై అక్టోబర్ 10న, విద్యార్థిని తల్లిదండ్రులు ఇతరులతో కలిసి పాఠశాలను సందర్శించి యాజమాన్యాని నిలదీశారు, దీంతో పాఠశాల రెండు రోజుల సెలవు ప్రకటించింది. తర్వాత కేరళ హైకోర్టు పాఠశాలకు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించింది. -
సృజనకు వేళాయె!
– నేడు జిల్లాస్థాయి ‘ఇన్స్పైర్’ ప్రారంభం – చర్చి స్కూల్లో ఏర్పాట్లు సిద్ధం అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాస్థాయి ఇన్స్పైర్–16 బుధవారం ప్రారంభం కానుంది. ఇందుకోసం విద్యాశాఖ స్థానిక రెవిన్యూ కాలనీలోని చర్చి పాఠశాలలో అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేసింది. అవార్డు మొత్తం రూ.5 వేలు జమ అయిన 170 మంది విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం నుంచే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో అనంతపురం విద్యా డివిజన్ నుంచి 26 మంది, గుత్తి నుంచి 52, ధర్మవరం నుంచి 62, పెనుకొండ నుంచి 30 మంది విద్యార్థులు ఉన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కోన శశిధర్, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ లక్ష్మీవాట్స్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 170 ప్రదర్శనలతోనే సరిపుచ్చుకోవాల్సిన దుస్థితి ఈ విద్యా సంవత్సరం (2016–17) ఇన్స్పైర్ అవార్డులకు జిల్లాలోని వివిధ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి మొత్తం 2,256 మంది విద్యార్థులు ఆన్లైన్లో రిజిష్టర్ చేసుకున్నారు. అయితే వీరిలో 833 మందిని జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపిక చేశారు. వీరందరూ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వివరాలను అధికారులకు పంపారు. ఒక్కొక్కరికి రూ.5 వేలు ప్రకారం రూ.41.65 లక్షలు నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం కేవలం 170 మంది విద్యార్థుల అకౌంట్లలో ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున రూ.8.5 లక్షలు జమ చేసింది. తక్కిన విద్యార్థులకు మొండి చేయి చూపింది.