breaking news
china smuggler
-
బెంగళూరులో మరో చైనా స్మగ్లర్ అరెస్టు
-
బెంగళూరులో మరో చైనా స్మగ్లర్ అరెస్టు
కడప: ఎర్రచందనం డొంక లాగుతున్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల సంకెళ్లకు మరో చైనా చేప చిక్కింది. ఎర్రచందనం అక్రమ రవాణాలో మధ్య వర్తిత్వం నడుపుతున్న చైనా దేశీయుడు ఊకిన్ ఫాన్‌ను కపడ ఓఎస్డీ రాహుల్‌దేవ్ శర్మ ఆధ్వర్యంలో పోలీసులు బెంగళూరులోని కోరమండల్ సర్కిల్లో శనివారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 25 కిలోల ఎర్రచందనం, రూ.2.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బెంగళూరులోనే చైనాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ప్రేమ్తార్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో అతడు వెల్లడించిన వివరాల ద్వారా పోలీసులు శనివారం ఊకిన్ ఫాన్‌ను అరెస్టు చేసినట్టు సమాచారం. -
'ఎర్ర' కేసులో చైనా దేశీయుడి అరెస్ట్
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు చైనా దేశానికి చెందిన యంగ్‌పెంగ్ (36)ను గురువారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో హైదరాబాదు-వరంగల్ హైవేపై అరెస్టు చేశారు. అతని నుంచి రెండు ఎర్రచందనం దుంగలు, పాస్‌పోర్టు, చైనా దేశానికి చెందిన కరెన్సీని, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇతనితో పాటు వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి సిబ్బియాలకు చెందిన కె. శ్రీనివాసరాజు (40)ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరినీ చిత్తూరులోని మూడో అదనపు జిల్లా కోర్టులో శుక్రవారం హాజరుపరచగా న్యాయమూర్తి రాఘవేంద్ర ఈనెల 21వ తేదీ వరకు రిమాండు విధించారు. వీరిని చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. గతనెల 24న టూరిస్ట్ వీసాపై యంగ్‌పెంగ్ చైనా నుంచి హైదరబాదుకు చేరుకున్నారు. ఇతనికి ఎర్రచందనం దుంగలను విక్రయించడానికి మన రాష్ట్రానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాదు సమీపంలోని ఘట్కేసర్ టోల్‌ప్లాజా వద్ద గురువారం అర్ధరాత్రి స్మగ్లర్లంతా డీల్ కుదుర్చుకుంటుండగా చిత్తూరు జిల్లాకు చెందిన ఆపరేషన్ రెడ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడిచేసి పట్టుకున్నారు.