breaking news
chennakesavapuram
-
కల్యాణం.. కమనీయం
కొత్తచెరువు : ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆదివారం చెన్నకేశవపురం వేలాదిమంది భక్తులతో కిటకిలలాడంది. జయ జయ ధ్వానాలు.. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ ధర్మకర్తలు ఉషారాణి, చన్నారెడ్డి ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ చెన్నకేశవస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. మండలంలోని చెన్నకేశవపురంలో మూడురోజులుగా బ్రహ్మోత్సవాలు వేదపండితులచే నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున ధర్మకర్తలు వైకుంఠ ముఖద్వారంలో ప్రవేశించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించిన నూతన కల్యాణ మండపం ప్రారంభించారు. అనంతరం ధర్మకర్తల ఇంటి నుంచి మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి పట్టు వస్త్రాలు, మంగళసూత్రం, ముత్యాల తలంబ్రాలు కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. 11 గంటల వరకు వేదపండితుడు గురురాజప్రసాద్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంఽగా కల్యాణోత్సవం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి వేడుకలను తిలకించారు. సాయంత్రం స్వామివారికి చక్రస్నానం ధ్వజారోహణ చేశారు. అనంతరం శ్రీవారిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు లక్ష్మీచెన్నకేశవ ఆలయంలో ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖుల హాజరు వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నేత డాక్టర్ హరికృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులు డీఎస్ కేశవరెడ్డి, లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, స్నేహలత నర్సింగ్‌హోం అధినేత మల్లికార్జునరెడ్డి, డాక్టర్ గోపాల్‌రెడ్డి, కొండసాని సురేష్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, మండల కన్వీనర్ జగన్మోహన్రెడ్డి, అవుటాల రçమణరెడ్డి, సర్పంచ్‌లు అలివేలమ్మ, శ్యాంసుందర్‌రెడ్డి, పుట్టపర్తి టౌన్ కన్వీనర్ మాధవరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు రఘునాథ్‌రెడ్డి, రెడ్డప్పరెడ్డి, ప్రశాంతి గ్యాస్ అధినేత పీవీ సూర్యనారయణ, డీఎస్పీ వేణుగోపాల్, సీఐ శ్రీధర్ పాల్గొన్నారు. అన్నమయ్య కీర్తనలతో అలరించిన శోభారాజు కొత్తచెరువు : అన్నమయ్య కీర్తనలతో భక్తులు పులంకించారు. తన గాత్రంతో భక్తులను మైమరంపజేసే ప్రఖ్యాత గాయని అన్నమయ్య పదకోకిల, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజు కీర్తనల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శోభారాజును ధర్మకర్తలు సన్మానించారు. -
వైభవంగా బ్రహ్మోత్సవాలు
బుక్కపట్నం : కొత్తచెరువు మండలం చెన్నకేశవపురంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ధర్మకర్తలు ఉషారాణి, చెన్నారెడ్డి.. స్వామికి పూజలు చేసి ఉత్సవాలు ప్రారంభించారు. అంతకుముందు గణపతి, లక్ష్మీదేవి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం గంగపూజలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆలయం వేద పండితుల మంత్రోచ్చారణలతో మార్మోగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. ఆలయంలో ఉదయం 8 గంటలకు ధ్వజారోహణ, అంకురార్పణ, పూజ, సాయంత్రం 4 గంటలకు మహాభిషేకం నిర్వహించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు పూజా కార్యక్రమాలు, హోమాలు, సాయంత్రం 4 గంటలకు సుదర్శన హోమం, గరుడ వాహనసేవ, ఆదివారం ఉదయం 4 గంటలకు ద్వారక ప్రవేశం, 8 గంటలకు హోమాలు, పూర్ణాహుతి, నూతన కల్యాణ వేదిక ప్రారంభోత్సవం, కల్యాణ మహోత్సవం, సాయంత్ర 4 గంటలకు చక్రస్నానం, ధ్వజారోహణ, శ్రీవారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రేపు చెన్నకేశవపురం రానున్న డాక్టర్ శోభారాజు బుక్కపట్నం : అన్మమయ్య కీర్తనలను తన గాత్రంతో భక్తులను మైమరపింపజేసే ప్రఖ్యాత గాయని అన్నమయ్య పదకోకిల, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజు ఆదివారం చెన్నకేశవపురం విచ్చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు శ్రీమతి ఉషారాణి, చెన్నారెడ్డి దంపతులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో ఆమె కీర్తనలు ఆలపిస్తారన్నారు.