breaking news
Chavan
-
అల్లు అర్జున్ 'పుష్ప 2', విక్కీ కౌశల్ 'ఛావా'.. రెండు సినిమాల వెనక ఓ మహిళ!
ఇటీవల బాక్సాఫీస్ వద్ద బ్లాక్బాస్టర్ హిట్ అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించిన మూవీలుగా నిలిచినవి టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ పుష్ఫ2, బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ఛావా మూవీలు. ఈ రెండు మూవీల్లో హీరోలిద్దరివి ఓ డిఫరెంట్ లుక్. అదికూడా సహజసిద్ధంగా ఆయా పాత్రలో హీరోలు ఒదిగిపోయూలా చూపించాలి. అలా తెరపై కనిపించేలా చేసే మహిళా మేకప్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?. అది అలాంటి ఇలాంటి మేకప్ కాదు. అత్యంత విలక్షణమైన మేకప్‌ని వేస్తుందామె. అసలు ఆమెలాంటి మేకప్ ఆర్టిస్టులు దొరకడం కూడా అరుదు.. ఆమెనే ప్రఖ్యాత మహిళా మేకప్ అండ్ ప్రోస్థటిక్ ఆర్టిస్ట్ ప్రీతిషీల్ సింగ్ డిసౌజా. పుష్ప, చావా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, పుష్ప: ది రైజ్, మామ్, బాలా, ముల్క్, అంధాధున్, హైదర్, రంగూన్, రోమియో అక్బర్ వాల్టర్, బచ్చన్ పాండే, బంటీ ఔర్ బాబ్లి 2, చుప్ వంటి మూవీలలోని హీరోలందరికి మంచి లుక్ ఇచ్చింది ఆమెనే. ఆ మూవీలలో హీరోల పాత్ర చాలా విలక్షణమైనది అందుకు తగ్గట్టుగా ఆ రోల్లో వాళ్లు ఒదిగిపోయినట్లుగా సహజసిద్ధంగా కనిపించడం వెనుక ఆమె ప్రొస్థటిక్ మేకప్ నైపుణ్యం ఎంతో ఉంది. అంతేగాదు ఆమె ఉత్తమ మేకప్ విభాగంలో జాతీయ అవార్డుని అందుకుంది కూడా. ఆమె అందిరిలా మేకప్ వేయడం కాకుండా విలక్షణమైన ప్రొస్థటిక్ మేకప్‌లో ప్రావీణ్యం సంపాదించింది. ఇదేంటంటే సహజసిద్ధమైన బట్టతల, గాయాలు, అలాగే ఏజ్‌ని తక్కువ చేసి చూపించే మేకప్ నైపుణ్యం ఇది. ఈ నైపుణ్యం పదిమందికి నేర్పేలా తన భర్త డిసౌజాతో కలిసి తొలి మేకప్ అండ్ ప్రోస్థటిక్ స్టూడియో స్కూల్‌ని ప్రారంభించి వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ఈ మేకప్‌లో ప్రోస్థటిక్ ముక్కలతో సహజత్వం ఉట్టిపడేలా చేస్తారు. ఇది విగ్ మేకింగ్ నుంచి బట్టతల క్యాప్స్, వృద్ధాప్యం, క్యారెక్టర్ మేకప్, కాలిన గాయలు, మచ్చలతో కూడిన ముఖం వరకు తదితరాలన్ని నిజంగానే వచ్చాయనే ఒరిజినాలిటిని ఉట్టిపడేలా చేస్తుంది ఈ మేకప్. ఈ నైపుణ్యాన్ని తస స్టూడియో ద్వారా ఔత్సాహిక విద్యార్థులకు నేర్పిస్తోంది. ఆచరణాత్మక శిక్షణను ఇస్తోంది ప్రీతిషీల్. నిజానికి ఆమె స్టార్ చేసిన ఈ వర్క్ షాప్ విజయవంతమైంది. ఈ కళను నేర్చుకునేందుకు దేశంలోని వివిధప్రాంతాల నుంచి భారీగా విద్యార్థులు తరలివచ్చారు. అంతేగాదు ఆమె తన వర్క్‌షాప్‌కి ఇంతలా అనూహ్య స్పందన వస్తుందని ఊహించలేదని సంతోషంగా చెబుతోంది. తన కళ వాస్తవికతను తలపించే నైపుణ్యం అని, ఈ అపారమయైన జ్ఞానం, స్కిల్స్‌ని నలుగురికి అందించడమే తన లక్ష్యం అని అంటోంది. ఈ కళను ప్రపంచస్థాయికి తీసుకురావాలనేది తన ఆకాంక్ష అని చెబుతోంది. తన మేకప్ స్కూల్లో అత్యాధునిక సౌకర్యాల తోపాటు అనుభవజ్ఞులైన మేకప్ నిపుణలతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించింది.(చదవండి: వర్క్ షేరింగ్‌తో ఆమె ముఖంలో చిరునవ్వులు తెప్పిద్దామిలా..!) -
శంబాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్.. ఆ లుక్ కోసం ఏం చేశాడంటే?
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తౌబా తౌబా సాంగ్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఆ పాటలో ఆయన చేసిన డ్యాన్స్ మూమెంట్‌కి వేలాది మంది ఆయన అభిమానులుగా మారిపోయారు. ఇటీవల విడుదలైన 'ఛావా'మూవీతో తనలో ఉన్న అసాధారణమైన నటుడిని చూపించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. ఈ మూవీ బాక్స్‌ఫిస్ వద్ద కలెక్షన్ల వర్షంతో దూసుకుపోతోంది. ఆ మూవీలో చత్రపతి శంబాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఒదిగిపోయాడు. అచ్చం మహారాజు మాదిరి అతడి ఆహార్యం అందర్నీ కట్టిపడేసింది. మరాఠా రాజుల కాలంలోకి వెళ్లిపోయేలా అతడి ఆహార్యం నటన ఉన్నాయి. ఇందుకోసం 80 కిలోల మేర బరువున్న అతడు ఏకంగా 105 కిలోల బరువుకు చేరుకున్నాడని తెలుస్తోంది. విక్కీ ఇలా యోధుడిలా శరీరాన్ని మార్చుకునేందుకు ఎలాంటి ఫిట్నెస్ ట్రైనింగ్, డైట్ ప్లాన్లు అనుసరించాడంటే..హృతిక్ రోషన్, జాన్ అబ్రహంల ఫిట్నెస్ గురువు క్రిస్ గెథిన్.. విక్కీ కౌశల్‌కి తన శరీరాన్ని మెరుగుపరుచుకునేలా శిక్షణ ఇచ్చాడు. మహారాజు మాదిరిగా ఎగువ శరీరం బలోపేతంగా ఉండేలా కండలు తిరిగిన దేహం కోసం విక్కీ చేత కార్డియో వంటి వ్యాయామాలు చేయించాడు. భారీ బరువులు ఎత్తించి మంచి విశాలమైన ఛాతీతో రాజు మాదిరి ధీరుడిలా కనిపించేలా చేశాడు. ఆయను విక్కీకి ఇచ్చిన ఫిట్నెస్ శిక్షణలేంటంటే..ఫంక్షనల్ వ్యాయామాలు: యుద్ధ తాళ్లు, స్లెడ్ పుష్‌లు, టైర్ ఫ్లిప్‌లు.కార్డియో: స్టామినా కోసం హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT).ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ: గాయాలను నివారించడానికి స్ట్రెచింగ్ మొబిలిటీ డ్రిల్స్.ఈ ఫిట్నెస్ శిక్షణలన్నీ బాడీ నిర్మాణానికి సరిపోతుంది అంతే.. మంచి అందమైన లుక్ కోసం కీలంగా ఉండేది డైట్ ప్లాన్ మాత్రమే. View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) అవేంటంటే..ప్రోటీన్ పవర్: సోయా ముక్కలు, పనీర్, మొక్కల ఆధారిత ప్రోటీన్ వనరులు.శక్తిని పెంచేవి: బీట్రూట్ టిక్కీలు, చిలగడదుంపలు.క్లీన్ ఈటింగ్: కనిష్టంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, సమతుల్య మాక్రోలు. చీట్ మీల్స్ వంటివి దరిచేరనీయలేదు. ఇలాంటి కఠినతరమైన ఫిటెనెస్ శిక్షణతో మహారాజు మాదిరి లుక్‌తో ఆకట్టుకున్నాడు విక్కీ. ఇక ఒక ఇంటర్వ్యూలో విక్కీ మాట్లాడుతూ..అవిశ్రాంత శిక్షణ, క్రమ శిక్షణతో కూడిన ఆహారం తదితరాలే శంభాజీ మహారాజ్ మాదిరి బలాన్ని ప్రతిబింబించడానికి సహాయపడిందని చెప్పారు. ఇంతలా కష్టపడటం వల్లే చక్కటి శరీరాకృతితో తెరపై కనిపించే శంభాజీ మాహారాజు పాత్రకు ప్రాణం పోశాడు విక్కీ. గమనిక: ఇలా అకస్మాత్తుగా బరువు పెరగడం, స్లిమ్‌గా అవ్వడం వంటివి సెలబ్రిటీలు చేస్తుంటారు. వాటిని వాళ్లు ప్రత్యేక నిపుణుల సమక్షంలో శిక్షణ తీసుకుని ప్రయ్నత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఒక్కోసారి దుష్ఫ్రభావాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల అనుకరించే మందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులు సలహాలు సూచనలతో అనుసరించడం ఉత్తమం.(చదవండి: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ Vs ఎలోన్ మస్క్: ఒకరిది పోరాటం మరొకరిది..!) -
జాంఝాటానికి చెక్!
సాక్షి, ముంబై: మెట్రోసేవలు అదివారం నుంచి అందుబాటులోకి రావడంతో వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు దూరంకానున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించే లక్షలాదిమంది ఇకపై మెట్రోరైల్లోనే ప్రయాణించే అవకాశం ఉండడంతో రోడ్డుమార్గంలో ట్రాఫిక్ ‘జాం’ఝాటం ఇకపై ఉండదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఏసీ సదుపాయంతోపాటు అత్యాధునిక సుదుపాయాలన్నీ ఈ రైళ్లలో అందుబాటులో ఉండడంతో విలాసవంతమైన కార్లలో ప్రయాణించేవారు కూడా ఇకపై మెట్రో రైలులోనే ప్రయాణించే అవకాశముందని, దీంతో రోడ్లపై వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముందంటున్నారు. వర్సో వా నుంచి ఘాట్కోపర్ వరకు ఇదివరకు ప్రయాణించాలంటే కనీసం రెండున్నర గంటల సమయం పట్టేది. అయితే ఆదివారం వర్సోవా స్టేషన్ నుంచి బయలుదేరిన మెట్రోరైలు కేవలం 21 నిమిషాల్లో గమ్యం చేరింది. దీంతో రెండుగంటలకు పైగా సమ యం ఆదా కావడం ఖాయమని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమయంతోపాటు ఖర్చు కూడా భారీగా తగ్గనుంది. ప్రయాణ ఖర్చు కూడా తగ్గే అవకాశముంది. సాకారమైన కల... ముంబైకర్ల ఎనిమిది సంవత్సరాల కల ఎట్టకేలకు సాకారమైంది. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్‌ల మధ్య నడిచే మెట్రో రైలును ఆదివారం ఉదయం 10.20 గంటలకు ముఖ్య మంత్రి పృథ్వీరాజ్ చవాన్ వర్సోవా స్టేషన్లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనం గణపతి బోప్పా మోరియా.....మంగళమూర్తి మోరి యా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మార్మోగుతున్న నినాదాల మధ్య కూత పెట్టిన మెట్రో రైలు మెల్లగా ముందుకు కదిలింది. మెట్రో రైలు పైలట్ క్యాబిన్లో సీఎం చవాన్‌తోపాటు ఈ ప్రాజెక్టు అధినేత అనిల్ అంబానీ, భార్య టీనా అంబానీ ఉన్నారు. మహిళకే మొదటి అవకాశం... మొదటి మెట్రో రైలుకు సారథిగా వ్యవహరించే అవకాశం మహిళ పైలట్‌కు దక్కింది. వర్సోవా నుంచి ప్రారంభమైన తొలి రైలుకు ఓ మహిళా డ్రైవర్‌గా వ్యవహరించారు. ఆమె పక్కనే టీనా అంబానీ, అనిల్ అంబానీ, సీఎం చవాన్ తదితరులు నిల్చున్నారు. ఇక తొలి రైల్లో ప్రయాణించేందుకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి బంధువులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యు లు ఆసక్తి చూపారు. దీంతో వారితో రైలు కిక్కిరిసి పోయిం ది. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ 11.40 కి.మీ. దూరాన్ని కేవలం 21 నిమిషాల్లో పూర్తిచేసింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ప్రయాణించేందుకు మిగతావారికి అనుమతించారు. దీంతో ముం బైకర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించేందుకు టికెట్ కౌంటర్ల వద్ద బారులు తీరారు. పిల్లలు, పెద్దలు అందులో ప్రయాణించి ఆనందంతో కేరింతలు కొట్టారు. ముస్తాబయిన వర్సోవా స్టేషన్... వర్సోవా స్టేషన్ నుంచి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మెట్రో రైలును ప్రారంభించనున్నట్లు సమాచారం అందగానే ఏర్పాట్లు పూర్తిచేశారు. స్టేషన్ ప్రముఖ ప్రవేశ ద్వారంతోపాటు ప్లాట్ఫారాలన్ని పూలతో అలంకరించారు. పచ్చ జెండా చూపే రైలును కూడా రంగురంగుల పూలతో ముస్తాబు చేశారు. ముందుగా ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం ముఖ్యమంత్రి ఉదయం 10 గంటలకే వర్సోవా స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. ఆ తరువాత 10.20 గంటలకు పచ్చ జెండా ఊపారు. సుదీర్ఘ నిరీక్షణ... 2006లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు ఎమ్మెమ్మార్డీయే, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్రాన్స్‌కు చెందిన ఓలియా ట్రాన్స్పోర్ట్ సంస్థలురూ.2,356 కోట్ల సంయుక్తంగా భాగస్వామ్యంతో ప్రారంభించాయి. జాప్యం కారణంగా అది రూ.4,321 కోట్లకు చేరుకుంది. ఈ రైలు సేవలు ప్రారంభించేందుకు ఇచ్చిన డెడ్లైన్లు దాదాపు 11 సార్లు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు ఆదివారం ప్రారంభం కావడంతో సుదీర్ఘ నిరీక్షణ ఫలించినట్లయింది. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న లోకల్ రైళ్లు, మార్చి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన మోనోతో పోలిస్తే మెట్రో ప్రయాణం భిన్నంగా ఉందని అందులో ప్రయాణించిన వారు అభిప్రాయపడ్డారు. మొత్తం బోగీలన్నింటిలో ఏసీ సౌకర్యం ఉండడంతో ఉక్కపోత, అలసట జాడే కనిపించలేదు. ఆటోమేటిక్ డోర్లు కావడంతో నడిచే రైల్లోనుంచి అదుపుతప్పి కిందపడే అవకాశాలు లేవు. అత్యాధునిక సదుపాయాలు.. రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా అత్యవసరమైన పరిస్థితి ఏర్పడితే ప్రయాణికులు నేరుగా పైలట్‌తో సంప్రదించే సదుపాయం ఉంది. ఒకవేళ పైలట్ ఆరోగ్యం క్షీణించినా...? లేదా సాంకేతిక లోపంతో రైలు మధ్యలో ఆగిపోయినా...? ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కార్ డి పోలోని కంట్రోల్ రూమ్ ద్వారా ఆగిపోయిన రైలును సమీపంలో ఉన్న స్టేషన్ వరకు తీసుకెళ్లే సౌకర్యం ఉంది. బోగీలలో అమర్చిన సీసీ కెమరాలపై పైలట్ నిఘా ఉంటుంది. ప్రతి నాలుగు నిమిషాలకో రైలు.. ముంబైకర్ల రాకపోకలపై అధ్యయనం చేసి మెట్రోలో రైళ్ల ప్రిక్వెన్సీ నిర్ణయించనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 11 వరకు, సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు.. ఇలా రద్దీ సమయంలో నాలుగు నిమిషాలకు ఒక రైలు, సాధారణ సమయంలో 10 నుంచి 15 నిమిషాలకు ఒక రైలుచొప్పున నడపనున్నారు.ఒకవేళ ప్రయాణికుల సంఖ్య పెరిగితే రెండు రైళ్ల మధ్య ఉన్న సమయాన్ని మరింత తగ్గించనున్నారు. ఉదయం 5.30 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 16 మెట్రో రైళ్లు ఉండగా అవి ప్రతీరోజూ 270 నుంచి 287 వరకు ట్రిప్పులు తిరుగుతాయి. రద్దీ పెరిగితే ట్రిప్పుల సంఖ్య మరింత పెంచుతామని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతీ రైలుకు నాలుగు ఏసీ బోగీలు, బోగీకీ నాలుగు డోర్లు, ఒక్కో బోగీలో 50 మంది కూర్చుండే సదుపాయం ఉంది. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మార్గంలో 12 స్టేషన్లు ఉండగా మొత్తం 95 ఎస్కలేటర్లు, 45 ఎలివేటెడ్, 137 మెట్ల మార్గాలున్నాయి. అన్ని రైళ్లలో మొత్తం 100కుపైగా ఎల్సీడీ టీవీలు ఉన్నాయి. వీటిలో టికెట్ లేకుండా ప్రయాణించే అవకాశం లేదు. టికెట్ లేకుండా రైలు సమీపంలోకి కూడా వెళ్లలేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు స్టేషన్లలో ఏర్పాటు చేశారు. ఆదిలోనే హంసపాదు..! సాంకేతిక లోపంతో ఆగిపోయిన రైలు సాక్షి, ముంబై: ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన మెట్రోరైలు మొదటి ట్రిప్పులోనే సాంకేతిక లోపంతో దాదాపు అరగంట పాటు ఆగిపోయింది. దీంతో మెట్రో ప్రయాణాన్ని ఎంజాయ్ చేద్దామని ఎంతో సంతోషంతో రెలైక్కిన ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రైలును ప్రారంభించిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, పదాధికారులు, వారి బంధువులు వర్సోవా నుంచి అంధేరీ వరకు ప్రయాణించారు. ఆ తరువాత అందరు దిగిపోయారు. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత నగరవాసులు ప్రయాణించేందుకు అనుమతినిచ్చా రు. దీంతో సేవలందించేందుకు ముందుకు వచ్చిన మెట్రో రైలులో ఎంతో సంతోషంతో అందరు ఎక్కారు. వర్సోవా నుంచి బాగానే ముందుకు కదిలిన రైలు జాగృతినగర్ స్టేషన్లో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. సుమారు అరగంట సేపు అక్కడే నిలి చిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మొదటి ట్రిప్పులోనే ఇలా జరగడం ఏంటని ప్రశ్నించారు. అప్పటికే కొందరు ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ ఘటన రిలయన్స్ ఇన్ఫ్రా అధికారులను ఆందోళనకు గురిచేసింది. ఇదిలాఉండగా తరుచూ ఏదో ఒక సాంకేతిక లోపంతో లోకల్ రైళ్లు నిలిచిపోవడం ముంైబె కర్లకు పరిపాటుగా మారింది. కాని మెట్రో రైళ్ల రాక వల్ల ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని భావించారు. కాని ప్రారంభోత్సవం నాడే ఇలా రైలు ఆగిపోవడంతో వాటి పనితీరుపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
టోల్ వసూళ్ల పై ఆగ్రహించిన ఆందోళనకారులు
-
ముంబైలో 26/11 మృతులకు నివాళి
-
శ్రీశాంత్, అంకిత్ చవాన్లకు చిరకాల నిషేధం