breaking news
chaitanya saratchandra
-
ప్రేమ లేదని..బతకలేనని..
-
ప్రేమ వ్యవహారంతో డాక్టర్ ఆత్మహత్య
-
ప్రేమ వ్యవహారంతో డాక్టర్ ఆత్మహత్య
గుంటూరు : ప్రేమ వ్యవహారం ఓ వైద్యుడి ప్రాణం తీసింది. మోతాదుకు మించి మత్తు ఎక్కించుకోవడం ద్వారా ఓ యువ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక పీపుల్స్ ట్రామా ఎమర్జెన్సీ ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్న బండి చైతన్య శరత్చంద్ర(28) ఆదివారం నైట్ డ్యూటీ చేసి ఆస్పత్రిలోని తన చాంబర్లోనే ఉండిపోయాడు. సోమవారం మధ్యాహ్నం అయినా అతడు గదిలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచర వైద్యులు తలుపులు బద్దలు కొట్టి చూడగా చైతన్య అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో అతనికి అదే ఆస్పత్రిలో చికిత్స అందించడానికి యత్నించగా అప్పటికే మృతి చెందాడు. మరోవైపు కొడుకు మృతి వార్త విన్న చైతన్య తల్లి ఆస్పత్రిలో గుండెపోటుకు గురై కుప్పకూలిపోయింది. దీంతో ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కాగా.. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. వైద్యుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.