breaking news
Burmese coast
-
19 అడుగుల పైథాన్‌తో యువకుని పోరాటం.. ఎట్టకేలకు..
అమెరికాలో భారీ పైథాన్‌ను ఓ యువకుడు పట్టుకున్నాడు. ఇది దాదాపు 19 అడుగుల పొడవు ఉంది. 56.6 కేజీల బరువు ఉంది. ఫ్లోరిడాలో ఓహియో యూనివర్శిటీకి చెందిన ఓ యువకుడు(22) దీన్ని సాహసంతో పట్టుకున్నాడు. అనంతరం అటవీ అధికారులకు అప్పగించారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. తెగ వైరల్‌గా మారింది. యువకులు రోడ్డుపై వెళుతుండగా.. ఓ పెద్ద పైథాన్ వారిని అడ్డగించింది. భయపడిన యువకులు కాసేపు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇక లాభం లేకపోవడంతో ఓ యువకుడు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే అతని స్నేహితులు కూడా సహాయం చేయగా.. అందరూ కలిసి దాన్ని పట్టుకున్నారు. పైథాన్‌ను పట్టుకునే క్రమంలో ఆ యువకుడు పెద్ద యుద్దమే చేశాడు. కిందపడినప్పటికీ దాని తలను మాత్రం వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. View this post on Instagram A post shared by Glades Boys Python Adventures (@gladesboys) దక్షిణ ఫ్లోరిడాలో పైథాన్లు ఎక్కువగా ఉంటాయని అటవీ అధికారులు తెలిపారు. 2020 అక్టోబర్‌లో 18 అడుగులు ఉన్న అత్యంత పెద్దదైనా బర్మీస్ పైథాన్ వెలుగులోకి వచ్చిందని వెల్లడించారు. ఆ తర్వాత ఇదే అత్యంత పెద్ద పైథాన్‌గా గుర్తించారు. రాత్రి సమయాల్లో సాధారణంగా రోడ్డుపైకి వస్తుంటాయని పేర్కొన్నారు. ఇదీ చదవండి: లైకులు, కామెంట్ల కోసం చావు వార్తని సోషల్ మీడియాలో.. ఇప్పుడిది అవసరమా? -
రేపటి నుంచి రాష్ట్రంపై వైఫా తుపాను ప్రభావం
విశాఖపట్నం: పై-లీన్ తుపాన్ సృష్టించిన బీభత్సం నష్టాల అంచనాలు కూడా పూర్తీ కాకుండానే మరో తుపాను ప్రభావం రాష్ట్రంపై పడనుంది. బర్మా తీరంలో వైఫా తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. రేపటి నుంచి ఈ తుపాను ప్రభావం రాష్ట్రంపై పడనుంది. పై-లీన్ తుపాన్ వల్ల ఒడిశా రాష్ట్రం భారీగా నష్టపోగా, మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాకు తీవ్రం నష్టం జరిగింది. మన రాష్ట్రంలో తుపాను బాధితులు ఇంకా పునరావాసం పొందలేదు. సహాయం అందక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితులలో మళ్లీ తుపాను వస్తుందంటే జనం భయపడుతున్నారు.