breaking news
burkini
-
బురఖా స్విమ్‌సూట్లపై నిషేధం ఎందుకు?
బురఖా తరహాలో ఉండే స్విమ్సూట్లను నిషేధించడంతో ఫ్రెంచి మేయర్లపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముస్లిం మహిళలు ఈత పోటీలలో పాల్గొనేందుకు వీలుగా బురఖా తరహాలో ఉండే స్విమ్ సూట్లను రూపొందించారు. వీటిని బుర్కినీలు అంటున్నారు. దాదాపు దశాబ్దం క్రితమే లెబనీస్ జాతికి చెందిన ఆస్ట్రేలియన్ మహిళ ఒకరు ముస్లింలు ధరించేందుకు వీలుగా స్విమ్సూట్లను రూపొందించారు. దాన్నే బుర్కినీ లేదా బుర్ఖినీ అంటున్నారు. ఇవి తల నుంచి పాదాల వరకు మొత్తం ఉంటాయి. ఫ్రాన్స్‌లో ఇవి అంతగా కనిపించేవి కావు. సాధారణంగా అక్కడ సన్‌బాత్ కోసం మహిళలు అర్ధనగ్నంగా బీచ్‌లలో విశ్రాంతి తీసుకుంటారు. ఇప్పుడు బుర్ఖినీలు ధరించినంత మాత్రాన తాము హింసను ప్రోత్సహిస్తున్నట్లు ఏమీ కాదని బుర్కినీని సమర్థించేవాళ్లు చెబుతున్నారు. కానీ వీళ్లు ఇలాంటి దుస్తులు ధరించి బీచ్‌లకు వెళ్లడం వల్ల ఇతరులు కోపానికి లేదా భయానికి గురవుతారని మేయర్లు వాదిస్తున్నారు. పురుషులు బ్యాగీలు ధరించి స్విమ్మింగ్ పూల్స్‌లోకి వెళ్లకూడదని గతంలో చెప్పిన ఫ్రాన్సు.. ఇప్పుడు మహిళలు ధరించే ఈత దుస్తుల వల్ల కూడా ప్రజారోగ్యానికి భంగం వాటిల్లకుండా ఉండాలని చెబుతోంది. బహిరంగ ప్రదేశాల్లో లౌకిక వాదానికి కట్టుబడి ఉండాలన్నది ఎన్నో శతాబ్దాల నుంచి ఫ్రాన్సులో అమలులో ఉందని, ఫ్రెంచి రాజ్యాంగంలోని మొదటి అధికరణంలోనే ఈ సూత్రం ఉందని అంటున్నారు. ప్రపంచంలోనే మత విశ్వాసాలు తక్కువగా ఉన్న దేశాల్లో ఫ్రాన్సు ఒకటని సర్వేలు చెబుతున్నాయి. -
'ఆ దుస్తులతోనే రండి.. లేదంటే పోండి'
ఫ్రాన్స్: బీచ్‌ల్లోకి నిండైన ఈత వస్త్రాలతో(బుర్కినీలతో) స్విమ్మింగ్‌కు రాకుండా కేన్స్ మేయర్ నిషేధం విధించారు. దీంతోపాటు ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో బీచ్‌లో పూర్తి దుస్తులతో బీచ్‌లకు రావొద్దని గట్టిగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఈ నిబంధనను అతిక్రమిస్తే భారీ మొత్తంలో ఫైన్ చెల్లించాలని హెచ్చరించారు. సాధారణంగా స్మిమ్మింగ్‌కు వెళ్లే సమయంలో కొన్ని మతాలకు చెందిన మహిళలు నిండైన వస్త్రాలతో బీచ్‌లకు వెళుతుంటారు. అయితే గత నెలలో ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఓ ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉగ్రవాది ట్రక్కుతో ఫ్రాన్స్‌లో నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా ఉగ్రవాదులు ముసుగులు ధరించి దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హై అలర్ట్ అమలవుతున్న ఫ్రాన్స్‌లోని పలు బీచ్‌లలో ఫుల్ స్మిమ్మింగ్ సూట్ లతో వస్తే రావొద్దని వస్తే బికినీ వస్త్రాల్లో రావాలని లేదంటే బీచ్ రావొద్దని హెచ్చరిస్తున్నారు. ర్యాడికల్ ఇస్లామిస్టులు ఇలాగే ముసుగులతో వచ్చి దాడులకు పాల్పడుతుంటారని అధికారులు భావిస్తుండటం వల్లే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.