breaking news
bramhoshavas
-
శ్రీవారిని దర్శించుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
-
సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం వద్ద ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. శ్రీవారి దర్శనము ముగించుకుని ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనంకు ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు చేరుకున్నారు. లోక కళ్యాణర్ధం కరోనా నేపథ్యంలో టీటీడీ గత మార్చి నెలనుంచి ధన్వంతరి మహా యాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం నిర్వహిస్తోన్న కార్యక్రమంలో ఇరువురు సీఎం పాల్గొన్నారు. ఉదయం 8:10 గంటలకు కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి సీఎం జగన్ కర్ణాటక సత్రాల భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొననున్నారు. అనతంరం ఉదయం 10:20కి రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి సీఎం జగన్ గన్నవరం బయల్దేరనున్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వేడుకగా ధ్వజారోహణం
కాణిపాకం(ఐరాల) : స్వయంభూ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారంతో ధ్వజారోహణంతో వైభవంగా ముగిశాయి. వినాయక చవితి రోజున ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు నేత్రపర్వంగా జరిగాయి. భాగంగా బుధ వారం సాయంత్రం ఆలయంలోని బంగారు ధ్వజ స్తంభం వద్ద వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభంపై నుంచి మూషిక చిత్రపటాన్ని అవరోహణ చేశారు. ధ్వజ స్తంభానికి పవిత్రజలాలతో అభిషేకించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ ఈఓ పూర్ణచంద్రరావు,ఏసి వెంకటేషు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర బాబు, ఇన్స్పెక్టర్లు మల్లి కార్జున, చిట్టిబాబు,ఉత్సవ కమిటీ సభ్యలు పాల్గొన్నారు. నేత్రపర్వం.. త్రశూలస్నానం కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం ఉదయం ఆలయ పవిత్ర పుష్కరణిలో త్రిశూల స్నానం వైభవంగా జరిగింది. తొలుత సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను, త్రిశూలాన్ని పురవీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణì కి వద్దకు వేంచేపు చేశారు. పుష్కరిణి ఒడ్డున త్రిశూలాన్ని ఉంచి సంప్రదాయబద్ధంగా అభిషేక పూజలు నిర్వహించారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 108 కలశాలకు పూజలు చేసి, పుష్కరిణిలో ఆ కలశాలలోని తీర్థాలను కలిపారు. ఆతర్వాత త్రిశూలానికి అవభతస్నానం చేయించారు. ఈ సందర్భంగా అర్చకులు, సిబ్బంది, భక్తులు కోనేరులో పవిత్రస్నానాలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులకు వేదమంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత ఆలయంలోకి వేంచేపు చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పి.పూర్ణచంద్రరావు, ఏఈఓ కేశవరావు, అధికారులు రవీంద్ర బాబు, చిట్టిబాబు, మల్లికార్జున పాల్గొన్నారు.