breaking news
bendapudi neeli
-
ఫస్ట్ ఉమన్: అమెరికా యూనివర్శిటీకి మన మహిళే ప్రెసిడెంట్
ఎల్లలు దాటి ఏ దేశమేగినా మన సాధనే తొలి అడుగు గా ఉంటే విజయం దానంతట అది మనల్ని వరించక తప్పదనే విషయాన్ని తన విజయం ద్వారా రుజువు చేసి చూపుతున్నారు నీలి బెండపూడి. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ చరిత్రలో తొలి మహిళా ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన ఒక మహిళ ఎన్నిక కావడం గర్వించదగినదిగా సర్వత్రా అభినందనలు అందుకుంటున్నారు నీలి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన నీలి బెండపూడి ఉన్నత చదువుల కోసం ముప్పై ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. ఆమె విజయ సోపానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం అమెరికాలోని లూయిస్విల్లేలో ఉంటున్న నీలి బెండపూడి విశాఖపట్నం వాసి. ఆంధ్రాయూనివర్శిటీలో ఎంబీఎ చేసిన ఆమె. పీహెచ్‌డి కోసం అమెరికాలో కాన్సస్ యూనివర్శిటీకి వెళ్లారు. అలా 1986లో పై చదువుల రీత్యా విశాఖపట్నం నుంచి వెళ్లిన నీలి బెండపూడి 30 ఏళ్లుగా అంచెలంచెలుగా ఎదిగారు. నాలుగేళ్లుగా యూనివర్శిటీ ఆఫ్ లూయిస్విల్లేకు 18వ ప్రెసిడెంట్‌గా విధులను నిర్వరిస్తున్నారు. దీనిలో భాగంగా యూనివర్శిటీ పరిధిలోని పన్నెండు విద్యా కళాశాలలు, విద్యా ఆరోగ్య వ్యవస్థలో భాగంగా ఐదు ఆసుపత్రులు, ఒక అథ్లెటిక్ ప్రోగ్రామ్, 200 మంది వైద్యులు, నాలుగు వైద్య కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఆమె తన విధుల్లో కొనసాగుతారు. గత అనుభవాలే గురువులు విధి నిర్వహణలో సమర్థత, కార్యదక్షతలో భాగంగా ఆమె ప్రతియేటా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూనే ఉన్నారు. కాన్సాస్ విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ వైస్‌ఛాన్సలర్‌గా, స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ వంటి అడ్మినిస్ట్రేటివ్ పదవులను నిర్వహించడంలో ఆమెకు అపార అనుభవం ఉంది. ఓహియో స్టేట్ యూనివర్శిటీలో ఇనిషియేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గానూ పనిచేశారు. ‘గతం గతః అనుకునే నైజం కాదు నాది. గత అనుభవాలు నాకు పాఠాలు. అవే నా గురువులు. నా ప్రతి అడుగులో తోడుగా ఉండి విజయావకాశాలు అందుకునేలా చేశాయి. అందుకే, నాకు అలసట అన్నదే రాదు’ అంటూ నడిచొచ్చిన మెట్ల గురించి సవినయంగా వివరిస్తారు నీలి బెండపూడి. ప్రతిష్ఠాత్మక ప్రెసిడెంట్ రాబోయే నూతన సంవత్సర ప్రారంభంలో ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ (పీఎస్‌యు) కి 19వ ప్రెసిడెంట్‌గా నీలి బెండపూడి బాధ్యతలు స్వీకరించనున్నారు. యూనివర్శిటీ అధ్యాపకులు, సిబ్బంది, సభ్యులు, విద్యార్థులు, ట్రస్టీ ప్రతినిధులతో కూడిన 18 మంది సభ్యుల బృందం నీలి బెండపూడిని ప్రెసిడెంట్‌గా ఎంపిక చేసింది. యూనివర్శిటీకి ప్రెసిడెంట్‌గా ఎంపికైన తర్వాత పీఎస్యూలోని ట్రæస్టీకి ధన్యవాదాలు తెలిపిన బెండపూడి ఈ అవకాశాన్ని అందుకోవడానికి తాను పనిచేసిన ప్రతి చోటూ తన ఉన్నతికి సహాయపడిందని గుర్తు చేసుకుంటున్నారు. అమెరికన్ అడకమిక్ అడ్మినిస్ట్రేటర్ గా, పీఎస్‌యు అధ్యక్షుడిగా పనిచేసిన ప్రెసిడెంట్ ఎరిక్ జె బారన్ తర్వాత ఆమె ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. ‘గతం గతః అనుకునే నైజం కాదు నాది. గత అనుభవాలు నాకు పాఠాలు. అవే నా గురువులు. నా ప్రతి అడుగులో తోడుగా ఉండి విజయావకాశాలు అందుకునేలా చేశాయి. అందుకే, నాకు అలసట అన్నదే రాదు. నీలి బెండపూడి -
ఏయూ పూర్వ విద్యార్థికి విశిష్ట గౌరవం
ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంబీఏ విభాగ పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ బెండపూడి నీలి అమెరికాలోని కెన్సాస్ లారెన్స్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చాన్సలర్‌గా నియమితులయ్యారు. నీలి తల్లిదండ్రులు ఆచార్య రమేష్ దత్తా, ఆచార్య పద్మ దత్తాలు ఏయూ ఆంగ్ల విభాగంలో ఆచార్యులుగా పనిచేశారు. నీలి భర్త కెన్సాస్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆచార్యునిగా సేవలందిస్తున్నారు. నీలి ఈ నెల ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆమె రిచర్డ్ డి ఇర్విన్ డాక్టరల్ డిసర్టేషన్ ఫెలోషిప్, ద ఫోర్డ్ మోటార్ కంపెనీ కాంపిటీటివ్ రీసెర్చ్ గ్రాంటులను, ఎంబీఏ అవుట్‌స్టాండింగ్ ఎలక్టివ్ ప్రొఫెసర్ తదితర ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఆమెకు ఈ పదవి దక్కడంపై ఏయూ ఆచార్యులు హర్షం వ్యక్తం చేశారు.