breaking news
bcycle
-
ఈ- వాహనాలకు మేలు చేసిన కరోనా!
లండన్: ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు పెరిగిపోతోన్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ వాహనాలు క్రమంగా మాయం అవుతున్నాయి. ఆ స్థానంలో ఈ–కార్లతోపాటు ఈ–బైకులు, ఈ–సైకిళ్లు వస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు, అలవాట్లకు అనుగుణంగా వీటిలో వేల మోడల్స్ వస్తున్నాయి. 2020, ఏప్రిల్ నెల నాటికి ఇంగ్లండ్ రోడ్లపైకి దాదాపు మూడు లక్షల ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతోన్న ఎలక్ట్రానిక్ వాహనాలకు మాత్రం కరోనా కారణంగా మేలే జరిగింది. ఈ రంగానికి కొత్త ఊపునిచ్చింది. కరోనా వైరస్‌కు వాతావరణ కాలుష్యం కూడా తోడై ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నం అవుతుండడంతో ఎలక్ట్రానిక్ వాహనాల రంగానికి పలు దేశాల ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తుండడంతో టార్గెట్లు ముందుకు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బ్రిటన్‌లోని అతిపెద్ద సైక్లింగ్ కంపెనీ ‘హాల్‌ఫోర్డ్స్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎలక్ట్రిక్, హైబ్రీడ్ వాహనాల సర్వీసు రంగంలో అనూహ్యంగా దూసుకుపోయింది. ‘హాల్‌ఫోర్డ్స్’కు దేశంలో 300లకు పైగా ఆటోసెంటర్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఏ కంపెనీకి లేనివిధంగా ఈ కంపెనీ 30 ఈ బైకుల మోడల్స్‌ను తీసుకొచ్చింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుబోతున్న ‘గ్జివోమి ఎం 365’ ఈ స్కూటర్ ఈ కంపెనీకి చెందినదే కావడం విశేషం. ఈ సైకిళ్లకు, సాధారణ సైకిళ్లకు పెద్ద తేడాలేదు, ఓ చిన్న బ్యాటరీ, దాంతో తిరిగే చిన్న మోటారు తప్ప. పైగా ఇన్సురెన్స్ అవసరం లేదు. రోడ్డు పన్ను అసలే లేదు. చదవండి: కరోనాకు వ్యాక్సిన్లు రావడం ఓ భ్రమేనా!? -
నాని మొత్తానికి ఓ సూపర్ సైకిల్ కొట్టేశాడు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి , యంగ్ హీరో నానీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నానీకి ఓ మంచి సైకిల్ కొని పెట్టారు. అలా మాస్టర్ సినిమా సందర్భంగా కోల్పోయిన సైకిల్ ను సరికొత్తగా నానీ సొంతం చేసుకున్నారు. మరి ఈ సంతోషాన్ని నాని అభిమానులతో పంచుకోకుండా ఉంటాడా.. వెంటనే ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. చిరంజీవి గారు పంపిన సూపర్ కూల్ సైకిల్ అంటూ ఫోటోలను షేర్ చేశారు. చిరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ పాపులర్ టెలివిజన్ షోకి ముఖ్య అతిధిగా విచ్చేసిన నాని తన చిన్న నాటి సంగతులను పంచుకున్నారు. తన చిన్నప్పుడు చిరంజీవి ‘మాస్టర్’ సినిమాకు సైకిల్ వేసుకెళ్తే దానిని ఎవరో దొంగిలించారని, అయితే చిరు సినిమాకు టికెట్ దొరికిన ఆనందంలో సైకిల్ పోయిందన్న బాధే తనకు కలగలేదని చెప్పారు. షోలో గెలుచుకున్న దానిలో కొంత సొమ్ముతో ఆ సైకిల్ కొనుక్కుంటానంటూ నానీ చెప్పుకొచ్చాడు. అయితే అందుకు చిరంజీవి నో చెప్పారు. ..తన సినిమాకు వచ్చినందుకు సైకిల్ పోయింది కాబట్టి, తానే కొత్త సైకిల్ కొనిపెడతానని హామీ ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని చిరు తొందరగానే దాన్ని నెరవేర్చారు. And the boy got his cycle back :) As promised on the show, Chiranjeevi Garu sent me this super cool cycle!#MegastarForAReason pic.twitter.com/zMrbDLMwGj — Nani (@NameisNani) April 14, 2017