breaking news
battery problem
-
భవిష్యత్తులో కొదవలేని బిజినెస్ ఇదే..
భారతదేశం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచుతోంది. ఈవీలో ప్రధానపాత్ర పోషించేది బ్యాటరీలే. వీటిలో లిథియం బ్యాటరీలను ఎక్కువగా వాడుతున్నారు. భవిష్యత్తులో వీటి సామర్థ్యం తగ్గాక తిరిగి రీసైక్లింగ్ చేసే వ్యవస్థను రూపొందించాలి. ప్రస్తుత రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలు భవిష్యత్ డిమాండ్లను తీర్చలేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా స్థిరమైన వ్యవస్థను ఏర్పరచాలని సూచిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం మరిన్ని స్టార్టప్‌లను ప్రోత్సహించాలని చెబుతున్నారు.కార్లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు సగటున 7-8 సంవత్సరాలు పనిచేస్తాయి. కస్టమర్ల వినియోగాన్ని బట్టి ఒక దశాబ్దం వరకు మన్నిక రావొచ్చు. అన్ని రకాల లిథియం అయాన్ బ్యాటరీల్లో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్, నికెల్ మాంగనీస్ కోబాల్ట్ ఆక్సైడ్ (ఎన్ఎంసీ), లిథియం నికెల్ కోబాల్ట్ అల్యూమినియం ఆక్సైడ్(ఎన్సీఏ)లను విరివిగా వాడుతారు. భారత్‌లో ఈవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో ఈ దాతువుల వినియోగం సైతం పెరుగుతోంది.ప్రధాన సమస్యలివే..ఈ బ్యాటరీల తయారీలో రెండు ప్రధాన సమస్యలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకటి.. బ్యాటరీల్లో వాడే రసాయన దాతువులను సంగ్రహించడం. రెండు.. ఈ బ్యాటరీలను వాడిన తర్వాత ఆయా దాతువులను భూమిలో వేస్తే కలిగే ప్రమాదాలను నివారించడం. ఈ సమస్యలకు ‘రిసైక్లింగ్’ పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రీసైక్లింగ్ పద్ధతుల్లో హైడ్రోమెటలర్జీ, పైరోమెటలర్జీ, డైరెక్ట్ రీసైక్లింగ్, ఇంటిగ్రేటెడ్ కార్బోథర్మల్ రిడక్షన్ వంటి మెకానికల్ ప్రక్రియలు అనుసరిస్తున్నారు. ఈ పద్ధతుల్లో బ్యాటరీలను కంప్రెస్ చేయడం, ముక్కలు చేయడం, ప్రత్యేక ద్రావకాలు లేదా వేడితో కరిగించి విలువైన పదార్థాలను వెలికితీస్తారు. ఈ ప్రక్రియనంతటిని ‘బ్లాక్ మాస్’ అని పిలుస్తారు. భారత్‌లో పైరోమెటలర్జీ(అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్యాటరీలను కరిగించడం)తో పోలిస్తే తక్కువ ఉద్గారాలతో కూడిన హైడ్రోమెటలర్జికల్(ప్రత్యేక ద్రావణాలతో కరిగించడం) ప్రక్రియను ఎక్కువగా వాడుతున్నారు. ఇందులో దాదాపు 95 శాతం యానోడ్, కేథోడ్లను సంగ్రహిస్తున్నారు. దేశీయంగా 80% హైడ్రోమెటలర్జీ ప్రక్రియనే వాడుతున్నారు.స్టార్టప్‌లు అందిపుచ్చుకోవాల్సిందే..అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో రి మరిన్ని స్టార్టప్‌లకు అవకాశం ఉంది. ఈవీ తయారీ వైపే కాకుండా బ్యాటరీ రీసైక్లింగ్ విభాగంలోనూ కంపెనీలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో రాబోయే ఈ ట్రెండ్‌ను స్టార్టప్‌లు అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. ఈవీ రంగంలో పెట్టుబడి పెట్టే వెంచర్ కాపిటలిస్ట్‌లు ఈ విభాగాన్ని కూడా గమనించాలని సూచిస్తున్నారు. -
బ్యాటరీ సేవ్ చేసే డిస్ప్లే.. యాపిల్ కసరత్తు
యాపిల్ సంస్థ భవిష్యత్తులో విడుదల చేయబోయే ఐఫోన్లలో కొత్త పవర్ సేవింగ్ డిస్ప్లేను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఐఫోన్ 18 ఎయిర్‌లో దీన్ని అమలు చేసే వీలుందనే అంచనాలు వెలువడుతున్నాయి. స్లిమ్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉండడంతో పవర్ అధికంగా ఖర్చు అవుతుంది. దాంతో స్లిమ్ ఫోన్లకు ఇదో సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో బ్యాటరీ లైఫ్‌ను పెంచేలా, డిస్ప్లేకు ఖర్చు అయ్యే పవర్‌ను తగ్గించేలా కొత్త టెక్నాలజీలను కంపెనీలు ఆవిష్కరిస్తున్నాయి. ఇందులో భాగంగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 18 ఎయిర్‌లో ఈమేరకు టెక్నాలజీను వాడనుందని కొన్ని సంస్థలు తెలిపాయి.పరిమిత బ్యాటరీ లైఫ్ సమస్యలను పరిష్కరించడానికి, తక్కువ శక్తిని వినియోగించేలా నెక్ట్స్ జనరేషన్ ఓఎల్ఈడీ డిస్ప్లేను వాడాలని యాపిల్ పరిశీలిస్తోంది. ఇప్పటికే వీటి సరఫరాదారులతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. 2027లో ఐఫోన్ 18 ఎయిర్‌లో ఎల్టీపీఓ ఓఎల్ఈడీ అధునాతన వెర్షన్‌ను ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ మోడల్లో కొత్త డిస్ప్లే ప్యానెల్ టెక్నాలజీని ఉపయోగించాలని యాపిల్ అన్వేషిస్తోంది. ప్రస్తుతం యాపిల్ తన హైఎండ్ ఐఫోన్లలో ఎల్టీపీఓ ఓఎల్ఈడీ ప్యానెళ్లను ఉపయోగిస్తుంది. కాని డిస్ప్లే అంతర్గత భాగాల్లో కొంత భాగం మాత్రమే ఆక్సైడ్ పదార్థాలను వాడుతోంది.ఇదీ చదవండి: 9 లక్షలకు ఫ్లెక్సీ స్టాఫ్కొత్త డిప్ప్లేల్లో పూర్తి ఆక్సైడ్ ఆధారిత డిజైన్‌కు మారడం ద్వారా మరింత సమర్థవంతంగా సర్వీసు అందించాలని యోచిస్తోంది. అయితే ఈ అప్‌గ్రేడ్ అంత సులభం కాదనే వాదనలున్నాయి. ఇది తయారీ ప్రక్రియలో సంక్లిష్ట మార్పులను కలిగి ఉంటుంది. దాంతో ఈ ప్యానెళ్లు మరింత ఖరీదుగా మారుతాయనే అభిప్రాయాలున్నాయి. -
మొబైల్లో త్వరగా ఛార్జింగ్ అయిపోతుందా?
మీ మొబైల్లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ యాప్ ఉందా? అయితే దానిపై ఓ లుక్కేయాల్సిందే. ఫోన్లో త్వరగా బ్యాటరీ అయిపోతుందంటే దానికి మొబైల్లో ఇన్స్టాల్ చేసిన ఇన్‌స్ట్రాగ్రామ్ యాప్ కారణం కావొచ్చని గూగుల్ పోస్ట్‌లో తెలిపింది. ఈ సమస్య పిక్సెల్ ఫోన్ వినియోగదారులకు అధికంగా ఉందని పేర్కొంది.గత కొన్ని వారాలుగా పిక్సెల్ వినియోగదారులు తమ పరికరాల్లో బ్యాటరీ సమస్యలను నివేదించినట్లు గూగుల్ తెలిపింది. అందుకుగల కారణాన్ని ధ్రువీకరించింది. మొబైల్ బ్యాక్‌గ్రాండ్‌లో ఇన్స్టాగ్రామ్ యాప్ అధిక బ్యాటరీ వినియోగానికి కారణమవుతుందని గూగుల్ సపోర్ట్ పోస్ట్‌లో వెల్లడించింది. పిక్సెల్ పరికరాలకు మే నెలలో సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చినట్లు పేర్కొంది. అప్పటి నుంచి ఈ సమస్య మరింత ఎక్కువైందని చెప్పింది.ఇదీ చదవండి: నోట్ల ముద్రణకు రూ.6,373 కోట్లు ఖర్చు!ప్రపంచవ్యాప్తంగా మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను ఆండ్రాయిడ్ ఓఎస్‌లో దాదాపు 100 కోట్లకు పైగా యూజర్లు వినియోగిస్తున్నారు. అయితే ఈ యాప్ బ్యాటరీ లైఫ్‌ను ఎలా తగ్గిస్తోందో తెలియజేయడానికి యూజర్లు రెడిట్ వేదికగా తమ సమస్యలు నివేదించారు. ఇన్స్టాగ్రామ్ పాత వెర్షన్‌కు తిరిగి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు కొందరు తెలిపారు. ఇంకొందరు ఓవర్ హీటింగ్ వంటి మరిన్ని సమస్యలను చెప్పారు.ఈ సమస్యకు పరిష్కారం..?బ్యాటరీ డ్రెయిన్ సమస్యను పరిష్కరించడానికి ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనిపై మెటా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఇన్స్టాగ్రామ్ సమస్యకు పరిష్కారాన్ని ప్రారంభించినట్లు గూగుల్ ధ్రువీకరించింది. ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో బ్యాటరీ డ్రైన్ సమస్యను పరిష్కరించడానికి ఇన్స్టాగ్రామ్ అప్డేటెడ్ యాప్‌ను విడుదల చేస్తుందని, బ్యాటరీ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. -
టీవీ రిమోట్ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..
టీవీ రిమోట్..గోడగడియారం..పిల్లల ఆటబొమ్మలు..వంటి బ్యాటరీ ఉన్న వస్తువులు కొన్నిరోజుల తర్వాత పనిచేయకపోవడం గమనిస్తుంటాం. వాటిలో ఏదైనా సాంకేతిక సమస్యా..? లేదా బ్యాటరీ పాడైందా..అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. సాంకేతిక సమస్య తలెత్తితే రిపేర్ సెంటర్‌కు తీసుకెళ్తాం. కానీ బ్యాటరీ సమస్య వల్ల పనిచేయకపోతే ఎలా నిర్ధారించుకోవాలనే అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.బ్యాటరీని పరీక్షించండిలా..కొత్త బ్యాటరీని సుమారు 20 సెంటీమీటర్ల(8 ఇంచులు) ఎత్తు నుంచి గట్టి ఉపరితలంపై నిటారుగా జారవిడిచినపుడు అది బౌన్స్ అవ్వదు. ఉపరితలాన్ని తాకినచోటే కిందపడడం గమనిస్తాం. కొత్త ఆల్కలీన్ బ్యాటరీల్లో రసాయన శక్తిని విద్యుత్‌శక్తిగా మార్చే జెల్ వంటి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. అది పైనుంచి విసిరిన బలాన్ని నిరోదిస్తుంది. దాంతో బౌన్స్ అవ్వదు. అదే అప్పటికే వాడిన బ్యాటరీలో ఆ జెల్ పదార్థం అంతా అయిపోతుంది. కాబట్టి ఆ జెల్ ఉన్న ప్రాంతమంతా గట్టిగా మారుతుంది. దాంతో పాత బ్యాటరీను పైనుంచి విసిరినపుడు కొంత బౌన్స్ అవుతుంది. అలాజరిగితే అందులో సమస్య ఉన్నట్లు నిర్ధారణకు రావచ్చు. ఈ సాధారణ పరీక్షతో పనిచేయని ఎలక్ట్రానిక్ పరికరంలో బ్యాటరీను మారిస్తే సరిపోతుంది.ఇదీ చదవండి: వినియోగంలోకి రానున్న క్వాంటమ్ కంప్యూటింగ్ఎక్కువకాలం రావాలంటే..చిన్నపిల్లల ఆటవస్తువులు వంటి పరికరాలు ఉపయోగించనపుడు వెంటనే వాటిని స్విచ్ ఆఫ్ చేయాలి. స్టాండ్‌బై మోడ్‌లో కూడా కొన్ని పరికరాలకు ఎనర్జీ అవసరమవుతుంది. దాంతో బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. కాబట్టి వాడిన తర్వాత వెంటనే స్విచ్ఆఫ్ చేయాలి.పరికరాలను ఎక్కువకాలం ఉపయోగించకుంటే అందులోనుంచి బ్యాటరీలను పూర్తిగా తొలగించాలి. అందువల్ల ఎనర్జీ నష్టాన్ని నివారించవచ్చు.అధిక లేదా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో బ్యాటరీలను నిల్వ చేయరాదు. ఉష్ణోగ్రతల్లోని వ్యత్యాసం వల్ల బ్యాటరీ రసాయన ప్రక్రియలో తేడాలేర్పడుతాయి. వాతావరణంలోని భారీ ఉష్ణోగ్రతల వల్ల జెల్ సామర్థ్యం దెబ్బతింటుంది.పాత బ్యాటరీలను, కొత్తవాటిని కలిపి ఒకేచోట నిల్వచేయకూడదు. ఏదైనా పరికరంలో రెండు బ్యాటరీలు వేయాల్సివస్తే పాత బ్యాటరీ, కొత్త బ్యాటరీను కలిపి వాడకూడదు. దాంతో పాత దానివల్ల కొత్తది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీలనుబట్టి కూడా సామర్థ్యాల్లో తేడాలుంటాయి. వోల్టేజ్స్థాయుల్లోనూ వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఒకే రకమైన బ్యాటరీలను ఉపయోగించడం మేలు. -
బ్యాటరీ కనిపించకుండా ఫోన్ల తయారీ.. ఎందుకో తెలుసా..
నిత్యం మార్పు చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ జీవితంలో భాగమైంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లేకుండా ఉండలేకపోతున్నారు. కీప్యాడ్ ఫీచర్‌తో ప్రారంభమైన ఫోన్ల తయారీలో రోజూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టచ్మొబైల్, మడతపెట్టే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలా వస్తున్న మార్పులో భాగంగా మొబైల్ బ్యాటరీలు కనిపించడంలేదు. మొబైళ్లు వచ్చిన చాలాకాలంపాటు రిమువెబుల్ బ్యాటరీలు చూసి ఉంటారు. కొన్నిసార్లు ఫోన్ ఉన్నట్టుండి హ్యాంగ్ అయితే బ్యాటరీ తీసి, మళ్లీ పెట్టి ఫోన్ స్విచ్ఆన్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు మార్కెట్లో వస్తున్న మొబైళ్లలో రిమువెబుల్ బ్యాటరీలు రావడం లేదు. కంపెనీలు అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ 2007లో తన మొదటి ఐఫోన్‌ను లాంచ్ చేసింది. అందులో మొట్టమొదటగా నాన్ రిమువెబుల్ బ్యాటరీ టెక్నాలజీని వినియోగించారు. అప్పటి వరకు చాలా కంపెనీలు రిమువెబుల్ బ్యాటరీలతో మొబైళ్లను తయారుచేయడం, జనాలు దానికి బాగా అలవాటుపడడంతో ఐఫోన్‌పై కొంతమందిలో విముఖత వచ్చింది. కానీ ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు అదే ధోరణి పాటిస్తున్నాయి. అలా క్లోజ్డ్ బ్యాటరీలతో మొబైళ్లను తయారు చేయడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రీమియం డిజైన్ స్మార్ట్‌ఫోన్‌లో చాలా కీలకపాత్ర పోషించేది దాని డిజైన్. రిమువెబుల్ బ్యాటరీలతో ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పటికీ వాటి డిజైన్ మీద చాల ప్రభావం చూపిస్తాయి. ఫోన్‌ను మరింత స్లిమ్‌గా తయారుచేయాడానికి, మొబైల్ కవర్‌ను గ్లాస్ / మెటల్‌తో తయారు చేయడానికి ఈ క్లోజ్డ్ బ్యాటరీ విధానాన్ని ఎంచుకున్నారు. వాటర్, డస్ట్ ప్రూఫ్ ఫోన్ పొరపాటున నీటిలో పడిపోవడం లేదా వర్షంలో తడవడం వంటివి నిత్యం జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఫోన్ వెనకాల కవర్ ఓపెన్ చేసుకునేలా ఉంటే దానిలోకి నీరు, దుమ్ము వంటివి చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫోన్లో ఎలాంటి గ్యాప్‌లు లేకుండా అంతర్గత సీలింగ్ బలంగా ఉంటే నీరు లోపలికి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే ఫోన్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవకుండా ఉంటాయి. ఇదీ చదవండి: మండుతున్న ఎండలు.. ఏసీ కొంటున్నారా..? జాగ్రత్తలివే.. అదనపు ఫీచర్లు ఫోన్ల తయారీ కంపెనీలు నిత్యం ఏదో కొత్త ఫీచర్లను వినియోగదారులకు పరిచయం చేస్తూంటారు. అందులో భాగంగా నాన్ రిమువెబుల్ బ్యాటరీ ఉన్న ఫోన్లు డ్యుయెల్కెమెరాలు, స్టీరియో స్పీకర్లు, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్లు ఇంప్లిమెంట్ చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. -
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీపై యాపిల్ షాకింగ్ న్యూస్!
ప్రముఖ మొబైల్ కంపెనీలను బ్యాటరీ కష్టాలువెన్నాడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పేలుళ్లతో శాంసంగ్ భారీగా నష్టాలను మూటగట్టుకుంది. ఆపిల్ కూడా దాదాపు ఇదే బాటలో పయినిస్తోంది. తాజాగా ఐఫోన్ 6s బ్యాటరీ సమస్య సీరియస్ గానే ఉన్నట్టు యాపిల్ అంగీకరించింది. తాము మొదట ఊహించిన దానికంటే చాలా విస్తృతంగా ఉన్నట్టు భావిస్తున్నట్టు ధృవీకరించింది. మొదట్లో కొన్ని లిమిటెడ్ ఐ ఫోన్లలోనే సమస్య ఉందని చెప్పిన యాపిల్ స్థానిక ఏజెన్సీ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో చివరికి చైనీస్ వెబ్ సైట్ లో తప్పును ఒప్పుకుంది. దీనికి సంబంధించి మంగళవారం ఒక నోటీసును వెబ్ సైట్ లో పోస్ల్ చేసింది. ఈ సమస్యకు ప్రధాన కారణం సాఫ్ట్వేర్ లోసమస్య అయి వుండవచ్చని భావిస్తోంది. దీన్ని పరిష్కరించడానికి డేటా అదనపు విశ్లేషణ అవసరమవుతుందని తెలిపింది. మరోవైపుకొద్ది రోజుల కిందట చైనీస్ వాచ్ డాగ్ యాపిల్ 6 ఎస్ తో పాటు 5ఎస్ లో కూడా సమస్యలు ఉత్పన్నమైనట్టు రిపోర్ట్ చేసింది. అయితే దీనిపై యాపిల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఐ ఫోన్ 6ఎస్ అకస్మాత్తుగా షట్ డౌన్ కావడం, పేలుడు సంభవిస్తున్నట్టుగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీంతో సమస్య ఉందని ఒప్పుకన్న సంస్థ సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2015 లో విక్రయించిన ఐఫోన్ 6ఎస్ బ్యాటరీ ఉచితంగా రిపేర్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.