breaking news
bank notice
-
టీడీపీ నేత వంగలపూడి అనితకు బ్యాంకు నోటీసులు
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): రూ.82 లక్షలు రుణం తీసుకుని చెల్లించని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కర్ణాటక బ్యాంకు నోటీసులు జారీ చేసింది. రూ.82 లక్షలను 60 రోజుల్లో చెల్లించాలని లేదా తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించింది. ఈ మేరకు బ్యాంకు ఇచ్చిన పత్రికా ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: మూడు రాజధానులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా ఉన్న వంగలపూడి అనిత 2015లో విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో లోక్రిష్ గోకుల్ లేఔట్లో తన పేరుతో ఉన్న స్థలాలను విశాఖపట్నంలో ఉన్న కర్ణాటక బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.82 లక్షలు రుణం తీసుకున్నారు. అయితే, సకాలంలో చెల్లించకపోవడంతో కర్ణాటక బ్యాంకు ఈ నెల ఒకటో తేదీన పత్రికా ప్రకటనతోపాటు వంగలపూడి అనితకు నోటీసులు జారీ చేసింది. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా 60 రోజుల్లో చెల్లించాలని, లేని పక్షంలో తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. -
డ్వాక్రా మహిళలకూ బ్యాంకు నోటీసు
మొగల్తూరు : ఎన్నికలకు ముందు వ్యవసాయ, రుణాలను రద్దు చేస్తామని హోరెత్తించిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రుణాల రద్దు గురించి మాట్లాకపోవడం దారుణమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు వరకు ఎప్పటికప్పుడు వాయిదాలు కట్టేసేవాళ్లమని, చంద్రబాబు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాననడంతో వాయిదాలు కట్టడం మానేయడంతో అధికారులు తమపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని మహిళలు వాపోతున్నారు. మండలంలోని మోడి గ్రామానికి చెందిన జయలక్ష్మి గ్రూపు అధ్యుక్షురాలు దాసరిజయ, సభ్యులు వెంకాయమ్మ, ధనలక్ష్మి వివరాలు ఇవి.. ఏడాది క్రితం మొగల్తూరులోని ఆంధ్రాబ్యాంకు నుంచి ఈ గ్రూపు రూ.4.50 లక్షలు రుణం తీసుకున్నారు. ప్రతి నెలా రూ.18వేలు వాయిదా, పొదుపు రూ.1,300 బ్యాంకుకు జమచేసేవారు. చంద్రబాబు మాటలు నమ్మి మూడు నెలల నుంచి వాయిదాలు కట్టడం మానేశారు. ఈనెల 19లోపు రుణ వాయిదాలు కట్టకపోతే పొదుపు ఖాతా నుంచి రికవరీ చేస్తామని బ్యాంక్ మేనేజర్ కాగితంపై రాసి పంపించారని వాపోయారు. పైసాపైసా పోగుచేసుకుని వాయిదాలు కట్టుకుంటూ సుమారు రూ. 2లక్షలు పొదుపు చేసుకున్నామని వాటిని తీసుకుంటామని చెప్పడం ఎంతవరకు సభ్యులు దాసరి సత్యవతి, అనసూయ, సావిత్రి ,యాళ్ళ లక్ష్మి వాపోయారు. చంద్రబాబు మాటలు నమ్మడం వల్లే ఈపరిస్థితి ఏర్పడిందని, రుణాలు రద్దు చేస్తాననో, చేయననో ఏదో మాట చెపితే మాపాట్లు మేం పడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.