baby crying
-
Pahalgam: ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్ని పిండేసే వీడియోలు
జమ్మూకశ్మీరిలోని పహల్గామ్ ఉగ్ర దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. మినీ స్విట్జర్లాండ్ బైసరన్ లోయలో మంగళవారం జరిగిన మారణ హోమం పలువురి కంటతడి పెట్టిస్తోంది. ఈ సంఘటనకు భయానక వివరాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. హనీమూన్‌కి వచ్చి ఒకరు, సెలవులకోసం వచ్చి ఒకరు ఇలా 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న వైనాన్ని యావద్దేశం ఖండించింది. 8 ఏళ్ల శిశువు నుండి నావికాదళ అధికారి వరకు, 22 మంది పర్యాటకులు, ఇద్దరు విదేశీయులు ,ఇద్దరు స్థానికులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో తండ్రి కోల్పోయిన చిన్నారి హృదయ విదారకంగా రోదిస్తున్న వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉగ్రమూకలు రెచ్చిపోయి పర్యాటలకు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో ప్రాణ భయంతో అనేకమంది పరుగులు తీశారు. 26 మంది తూటాలకు నేలకొరిగారు. ఇలా తండ్రిభౌతిక దేహం మీద ఒక చిన్నారి రోదిస్తున్న వీడియో నెటిజనుల గుండె పిండేసింది. అతణ్ని రక్షించి తీసుకెళ్లుతుండగా, ఆ చిన్నారి రోదన ముఖ్యంగా అమ్మకావాలి అటూ ఏడుస్తున్న దృశ్యాలు హృదయ విదారకం ఉన్నాయి. ఈ ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాడి జరిగిన ప్రదేశానికి చేరుకుని, బాధితులకు నివాళులర్పించారు. దేశం ఉగ్రవాదానికి తలొగ్గదని, దోషులను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను కూడా ప్రకటించారు. आपका दिल फट्ट जाएगा इस छोटे बच्चे का रोना सुनकर! इसके पिता का जुर्म इतना सा था की वह एक हिंदू थे! इन आतंकियों को ऐसा सबक सीखना चाहिए की इनकी 100 पुश्ते भी याद करके काँप जाये! #PahalgamTerroristAttack #HindusUnderAttack pic.twitter.com/J6Q6xhSU8L— Priyanshi Bhargava (@PriyanshiBharg7) April 23, 2025మృతుల్లో నావికాదళ అధికారి వినయ్ నర్వాల్.భార్య హిమాన్షి నర్వాల్ భర్త శవపేటిక పక్కన తీవ్రంగా రోదించింది. తన భర్త ధైర్యసాహసాల గురించి మాట్లాడుతూ విలపించిన దృశ్యాలు కలచివేస్తున్నాయి. కోటి ఆశలతో కొత్తజీవితాన్ని ప్రారంభించిన ఆ జంట కలలు క్షణాల్లో తునాతునాలైపోయాయి. ఇక హిమాన్షి దుఃఖాన్ని నిలువరించడం ఎవ్వరి తరము? #WATCH | Delhi | Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the Pahalgam terror attackThe couple got married on April 16. pic.twitter.com/KJpLEeyxfJ— ANI (@ANI) April 23, 2025మరోవైపు ఆ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు. వీరిని జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేసే ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’లో సభ్యులుగా భావిస్తున్నారు. -
వింతగా అరుస్తున్న పక్షి.. ఆశ్చర్యంలో నెటిజన్లు
సిడ్నీ: ఆస్ట్రేలియా జూలోని ఓ పక్షి చేస్తున్న శబ్ధాలు వింతగా ఉన్నాయి. ఆ పక్షి అచ్చం పసిపిల్లల ఏడుపులా శబ్ధం చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఈ పక్షి ఇలా ఎందుకు అరుస్తుందంటే.. వీటిని లైర్ బర్డ్ అంటారు. ఇవి తమ చుట్టుపక్కల విన్న శబ్దాలను మిమిక్రీ చెయ్యగలవు. వీటి ప్రత్యేకత అదే. ఇక కోవిడ్ లాక్డౌన్ కారణంగా టారోంగా జంతు ప్రదర్శనశాల గత కొద్ది కాలంగా మూసివేయబడినప్పటికీ.. నిత్యం జూ-కీపర్లు పెద్దగా అరుస్తున్న శబ్దాన్ని వింటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: స్నేక్గారూ.. స్మైల్ ప్లీజ్.. Bet you weren't expecting this wake-up call! You're not hearing things, our resident lyrebird Echo has the AMAZING ability to replicate a variety of calls - including a baby's cry! 📽️ via keeper Sam #forthewild #tarongatv #animalantics pic.twitter.com/RyU4XpABos — Taronga Zoo (@tarongazoo) August 30, 2021 -
వైరల్ : కటౌట్లతో పిల్లాడిని ఏడవకుండా చేశారు..
టోక్యో : చిన్నపిల్లలు తాము ఆడుకునేటప్పుడో లేక పడుకొని లేచినప్పుడు తల్లిదండ్రులు కనిపించకపోతే ఏడ్వడం అనేది సాధారణమైన విషయం. అప్పుడు వారి ఏడ్పును ఆపడం ఎవరి తరం కాదు. కానీ ఇలాంటి ఘటన ఎదురైతే దానికి మా దగ్గర పరిష్కారం ఉందటున్నారు జపాన్‌కు చెందిన దంపతులు. వివరాలు .. జపాన్‌కు చెందిన ఒక పిల్లాడు తన తల్లి ఒక్క క్షణం కనిపించకపోయినా గుక్కపట్టి ఏడ్చేవాడు. దీంతో ఆ దంపతులు ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక కొత్త మెకానిజమ్‌ను కనుగొన్నారు. అదేంటంటే.. పిల్లాడి తల్లికి సంబంధించిన రెండు కటౌట్లను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి పిల్లాడి పక్కనే కూర్చునేలా, మరొకటి తల్లి నిలబడిన కటౌట్లను తయారు చేయించాడు. కాకపోతే అవి పిల్లాడికి అందకుండా ఏర్పాటు చేసుకున్నారు. ఎంతకైనా మంచిదని ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదనుకొని పిల్లాడు టీవీ చూస్తుండగా వెనుక ఒక కటౌట్‌ను ఏర్పాటు చేసి తల్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తర్వాత వెనక్కి తిరిగి చూసిన పిల్లాడికి తల్లి కటౌట్ కనిపించడంతో ఏడ్వకుండా మళ్లీ ఆడుకోవడం మొదలుపెట్టాడు. తాము కనుగొన్న ఈ టెక్నిక్ విజయవంతం కావడంతో ఆ తల్లిదండ్రులు తెగ సంతోషపడిపోయారు. అయితే తండ్రి ఇదంతా వీడియో తీసీ ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లాడి తల్లిదండ్రులను పొగడ్తలతో ముంచెత్తారు. పిల్లాడి ఏడ్పును కంట్రోల్ చేయడంతో పాటు వారి పనులు కూడా సజావుగా జరిగేందుకు కటౌట్ ఉపయోగపడుతుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలు కూడా ఏడ్వకుండా ఉండేందుకు ఇలాంటి కటౌట్లను ఏర్పాటు చేసుకోండి. 結果、20分くらい気づかれず。これはたまには役立つかも… このパネルは、ビッグダミー(スーパーとかにある巨大なパネル)など、販促物をつくってるリンクスさんにお願いして、「ビッグマミー」をつくってもらいました🙏https://t.co/zLfGDZpiPa pic.twitter.com/zp5qiyqoRq — 佐藤ねじ🌲ブルーパドル (@sato_nezi) December 8, 2019 -
ఏడుస్తూనే.. లెట్స్ డూ కుమ్ముడు!
-
వైరల్ వీడియో: ఏడుస్తూనే.. లెట్స్ డూ కుమ్ముడు!
అది ఎక్కడి దృశ్యమో తెలియదు. ఆ పాప ఎవరో కూడా ఎవరూ గుర్తుపట్టలేరు. కానీ, ఆ చిన్నారి వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అతి తక్కువ కాలంలోనే వాట్సప్, ఫేస్‌బుక్‌లతో పాటు యూట్యూబ్‌లో కూడా విపరీతంగా ఫేమస్ అవుతోంది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేసిందంటారా.. మంచం మీద ఎవరో ఒక వ్యక్తి పడుకుని, తన పొట్టమీద ఆ చిన్నారిని కూర్చోబెట్టుకున్నారు. ఆయన బహుశా ఆ చిన్నారికి అత్యంత సమీప బంధువు అయి ఉంటారు. ఆ పాప మాత్రం తన తల్లి కోసం ఏడుస్తోంది. ఆ పాప చేత ఏడుపు మాన్పించడానికి ఆయన 'అమ్మడూ' అనగానే... ఆ చిన్నారి కొంత ఏడుపు కలగలిసిన గొంతుతోనే 'లెట్స్ డూ కుమ్ముడూ' అంటోంది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. అలా ఎన్నిసార్లు అడిగినా ఆ చిన్నారి పాట పాడుతూనే ఉంటోంది. మధ్యలో అమ్మ గుర్తుకొచ్చినప్పుడు మాత్రం మళ్లీ అమ్మ కావాలని ఏడుస్తూ అడుగుతోంది. గ్రీన్ కలర్ గౌను వేసుకుని ఉన్న ఆ చిన్నారి పాటను చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. వాట్సప్ గ్రూపులలో ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది.