breaking news
Ayurvedic Company
-
ఆయుర్వేదిక్ కంపెనీ పేరుతో మోసం
హైదరాబాద్: కూకట్పల్లి ప్రశాంతి నగర్లో ఆయుర్జన్ అనే మోసం చేస్తున్న ఒక ఆయుర్వేద కంపెనీలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీ చేశారు. ఆయుర్వేద కంపెనీ పేరుతో ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి ఫిర్యాదు అందాయి. దాంతో అధికారులు ఈ కంపెనీపై దాడి చేసి, తనిఖీలు నిర్వహించారు. లక్షన్నర విలువ చేసే మందులను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
మందుల పేరిట మోసం
వేములవాడ అర్బన్ : అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసరా చేసుకుంటున్న కొన్ని మందుల కంపెనీలు బురిడీ కొట్టిస్తున్నాయి. అందినకాడికి దండుకుంటున్నాయి. ఓ ఆయుర్వేద మందుల కంపెనీవారు చందుర్తి మండలం రుద్రంగి, నిజామాబాద్ జిల్లా మానాల గ్రామాలకు చెందిన 15 మందిని బురిడీ కొట్టించిన వైనం శనివారం వెలుగు చూసింది. బీహార్‌లోని నలందా ప్రాంతానికి చెందిన రాజేశ్ వీపీ డెలివరీ పేరుతో నడుస్తున్న ఆయుర్వేద కంపెనీకి రూ. 500 డీడీ చెల్లిస్తే కావాల్సిన మందులు పోస్టుద్వారా పంపిస్తామని ప్రకటనల ద్వారా నమ్మబలికాడు. పార్శిల్ అందిన తర్వాత మరో రూ. 500 చెల్లించాలని సూచించాడు. దీంతో చందుర్తి మండలం రుద్రంగికి చెందిన దయ్యాల హన్మండ్లు, కాదాసు నారాయణ రూ. 500 డీడీ తీసి పంపారు. మరో 500 రూపాలు చెల్లించి పార్శిలు తీసుకున్నారు. పార్శిల్లో ఒకదానిని తెరిచి చూడగా అందులో చిత్తుకాగితాలు దర్శనమిచ్చాయి. అవాక్కైన వారు మరో పార్శిల్ తీసుకునేందుకు నిరాకరించారు. తమ వద్దనున్న సెల్‌ఫోన్ నంబర్‌కు ఫోన్‌చేస్తే సరైన స్పందన రాకపోవడంతో మోసపోయామని నాలుక్కర్చుకున్నారు. హన్మండ్లు, నారాయణలతోపాటు మరో 13 మంది సైతం రూ. 500 చొప్పున డీడీలు పంపించినట్లు చెప్పారు. విచ్ఛలవిడిగా వెలుస్తున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకొని సామాన్యులను రక్షించాలని వారు కోరారు.