breaking news
awarness campaign
-
నేను చనిపోలేదు: నటుడు
ఇంటర్నెట్ వినియోగం.. సోషల్ మీడియా వాడకం పెరిగాక చాలా మంది ప్రముఖులు ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య వారు బతికుండగానే.. చనిపోయారనే వార్తలు రావడం. నిజమే కదా బతికుండగానే.. చనిపోయారంటూ వార్తలు వస్తే.. పాపం వారికి ఎలా ఉంటుంది. ఇదేదో యూట్యూబ్ వెబ్సైట్ల పని అయితే జనాలు చాలా వరకు నమ్మరు. కానీ పాపం అప్పుడప్పుడు నటులు కూడా ఇలాంటి తప్పులే చేస్తారు. తాజాగా వీరి జాబితాలోకి హిందీ టీవీ నటుడు కర్ణవీర్ బోహ్రా చేరారు. ఆ వివరాలు.. కర్ణవీర్ స్నేహితుడు కుశాల్ పంజాబీ గత ఏడాది డిసెంబర్ 26న మరణించారు. డిప్రెషన్ కారణంగా తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన స్నేహితుడు, సహా నటుడు కర్ణవీర్ బోహ్రా మెంటల్ హెల్త్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ఈ విషయాన్ని ఇతరులకు షేర్ చేయాల్సిందిగా మరి కొందరిని ట్యాగ్ చేశాడు. Sorry sorry bro, it was a typo...I love you too and you know that 🤗🤗🤗 That @nikitindheer is the chingari, I'm sure he sent it to you 😤 https://t.co/490goYvabR — Karanvir Bohra (@KVBohra) September 10, 2020 అంతా బాగానే ఉంది కానీ చనిపోయింది కుశాల్ పంజాబీ అయితే.. కర్ణవీర్ తప్పుగా కుశాల్ టాండన్ అని టైప్ చేశాడు. ఇది కాస్త వైరల్ కావడంతో.. కుశాల్ తాను బతికే ఉన్నానంటూ ట్వీట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అప్పటికి గాని కర్ణవీర్కు తన తప్పేంటో అర్థం కాలేదు. వెంటనే క్షమాపణ కోరుతూ.. టైపింగ్ మిస్టెక్ అని తెలిపాడు. ప్రస్తుతం వీరిద్దరి ట్విట్టర్ సంభాషణ తెగ వైరలవుతోంది. -
నీరాపై అవగాహన: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య పానీయమైన నీరా పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆబ్కారీశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం యూత్ లీడర్స్ ఫౌండేషన్– ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో రూపొందించిన నీరా ప్రచార కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అన్ని ఔషధ గుణాలు కలిగిన, ప్రకృతి సహజంగా లభించే నీరాను ప్రజలకు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, టీఎస్‌ఈడబ్లూఐడీసీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీ యూత్ లీడర్స్ ఫౌండేషన్ నాయకులు పాల్గొన్నారు. -
స్వైన్‌ఫ్లూపై భారీ అవగాహన ర్యాలీ
విజయనగరం: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలంలో బుధవారం అవగాహన ర్యాలీ జరిగింది. ఇందులో సుమారు 10 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్నేహ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఇందులో భాగంగా 10 వేల మంది విద్యార్థులు సహా మొత్తం 15 వేల మందికి స్వైన్‌ఫ్లూ నివారణకు హోమియో మందులను పంపిణీ చేశారు.