breaking news
Awara
-
సూపర్ హిట్ మూవీ.. 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్
హీరో కార్తీ సూపర్ హిట్ చిత్రాల్లో పైయ్యా ఒకటి. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి లింగుసామి దర్శకత్వం వహించారు. తిరుపతి బ్రదర్స్ ఫిలిం మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుభాష్‌చంద్రబోస్ నిర్మించారు. మది ఛాయాగ్రహణం, యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు. రోడ్ ట్రావెల్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఇందులోని పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ఇది తెలుగులో ఆవారాగా రిలీజై ఇక్కడ కూడా హిట్ అందుకుంది. 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్ తాజాగా పైయ్యా చిత్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయడానికి తిరుపతి బ్రదర్స్ సంస్థ అధినేత సుభాష్ చంద్రబోస్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ చేయనున్నట్లు దర్శకుడు లింగుసామి ఇంతకు ముందే చెప్పారన్నది గమనార్హం. తాజాగా పైయ్యా చిత్రం రీ రిలీజ్ గురించి ఆయన మాట్లాడుతూ.. కార్తీకి ఒక హోటల్లో కథ చెప్పడం మొదలు పెట్టిన కొద్ది సేపటికే చాలా బాగుంది.. మనం చిత్రం చేస్తున్నాం అని చెప్పారన్నారు. ఆయనకు కథలపై చాలా నాలెడ్జ్ ఉందన్నారు. కెమిస్ట్రీ వర్కౌట్ అయింది సినిమాలో లవ్, యాక్షన్, చేజింగ్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు బాగా కుదిరాయన్నారు. కార్తీ, తమన్నాల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందన్నారు. ఇకపోతే పైయ్యా చిత్రానికి సీక్వెల్ చేస్తానని, కథ కూడా సిద్ధం చేశానన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. అయితే దీనికంటే ముందు ఒక పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నట్లు చెప్పారు. ఇది మహాభారతంలోని శ్రీకృష్ణుడు, అర్జునుడు పాత్రల నేపథ్యంలో ఉంటుందని చెప్పారు. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని లింగుసామి పేర్కొన్నారు. చదవండి: హీరోయిన్ అరుంధతి ప్రస్తుతం ఎలా ఉందో చెప్పిన సోదరి -
ఆవారాకు సీక్వెల్ రెడీ...! ఫాన్స్ కు గుడ్ న్యూస్
-
ఆవారా సీక్వెల్.. తెరపైకి కార్తీ పేరు
మళ్లీ ఆవారాగా కనిపించనున్నారట కార్తీ. లింగుసామి దర్శకత్వంలో కార్తీ, తమన్నా హీరో హీరోయిన్లుగా వచ్చిన తమిళ చిత్రం ‘పయ్యా’ (తెలుగులో ‘ఆవారా’). 2010లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చెప్పుకోదగ్గ ఆదరణ లభించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని కొంత కాలంగా లింగుసామి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రెండో భాగంలో ఆర్య హీరోగా చేస్తారనే వార్తలు వచ్చాయి. తాజాగా మళ్లీ కార్తీ పేరే తెరపైకి వచ్చింది. కార్తీ నటించే చాన్స్ ఎక్కువగా ఉందని కోలీవుడ్ అంటోంది. -
‘ఆవారా’ రీమేక్ చేయుడమా..?
బాలీవుడ్ షోవ్యూన్ రాజ్‌కపూర్ సూపర్‌హిట్ చిత్రం ‘ఆవారా’ను రీమేక్ చేయడమా..? అలాంటి ఆలోచనే తమ కుటుంబ సభ్యులెవరికీ లేదని చెబుతున్నాడు రణధీర్ కపూర్. రిషికపూర్, రణబీర్ కపూర్లతో ‘ఆవారా’ రీమేక్ చేయల్సిందిగా చాలామంది అడుగుతున్నారని, అయితే, పృథ్వీరాజ్ కపూర్, రాజ్కపూర్ల పాత్రలకు న్యాయం చేసే నటులెవరూ లేరని అంటున్నాడు. ‘ఆవారా’ ఘన విజయనికి పాటలు కూడా కారణమేనని, శంకర్-జైకిషన్ల వంటి సంగీత దర్శకులు, శైలేంద్ర వంటి గీత రచయితలు దొరకడం నేటి రోజుల్లో అసాధ్యమని చెబుతున్నాడు.