breaking news
Australian parliament
-
ఆగ్రహా‘వేషం’ !
సిడ్నీ: అది ఆ్రస్టేలియా పార్లమెంటు.. గంభీరంగా సాగుతున్న సభలోకి హఠాత్తుగా.. ఒక వ్యక్తి బురఖా ధరించి ప్రవేశించడంతో అంతా అవాక్కయ్యారు. అదెవరో కాదు.. ఆ్రస్టేలియాకు చెందిన ఫార్–రైట్ సెనేటర్ పాలిన్ హన్సన్. బహిరంగ ప్రదేశాల్లో ముస్లింల బురఖా ధారణపై నిషేధం విధించాలన్న డిమాండ్‌ను వినిపించడానికి.. ఆమె ఏకంగా బురఖానే ఒక రాజకీయ ప్రచార అస్త్రంగా వాడుకోవడం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సోమవారం జరిగిన ఈ సంఘటన ఆస్ట్రేలియా రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపింది. ముమ్మాటికీ జాత్యహంకారమే.. హన్సన్ చర్యపై సభలోని ఇతర సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన గ్రీన్స్ సెనేటర్, ముస్లిం మహిళ మెహ్రీన్ ఫరూకీ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ‘ఇది పచ్చి జాత్యహంకారం. ఒక సెనేటర్ స్థాయి వ్యక్తి ఇలా ప్రవర్తించడం దారుణం’.. అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వెస్ట్రన్ ఆ్రస్టేలియాకు చెందిన స్వతంత్ర సెనేటర్ ఫాతిమా పేమాన్ కూడా హన్సన్ తీరును అవమానకర చర్యగా అభివరి్ణంచారు. ముక్తకంఠంతో ఖండన హన్సన్ చర్యను అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం ముక్తకంఠంతో ఖండించాయి. సెనేట్‌లో లేబర్ ప్రభుత్వ నాయకురాలు పెన్నీ వాంగ్ స్పందిస్తూ.. ‘ఇది ఆ్రస్టేలియా సెనేట్ సభ్యురాలికి తగని పని’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బురఖా తీయడానికి నిరాకరించిన హన్సన్ను సస్పెండ్ చేయాలని ఆమె తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష కూటమి డిప్యూటీ లీడర్ అన్నే రస్టన్ కూడా హన్సన్ చర్యలను తప్పుబట్టారు. గతంలోనూ ఇదే రచ్చ.. ఆసియా నుంచి వలసలు, శరణార్థుల రాకను తీవ్రంగా వ్యతిరేకించే హన్సన్, 1990ల నుంచే తనదైన వివాదాస్పద శైలితో వార్తల్లో నిలుస్తున్నారు. ఇస్లామిక్ దుస్తులపై ఆమె పోరాటం కొత్తేమీ కాదు. 2017లో కూడా ఆమె ఇలాగే బురఖా ధరించి పార్లమెంటుకు వచి్చ, జాతీయ స్థాయి నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మరోసారి అదే పంథాను ఎంచుకున్నారు. బ్యాన్ చేస్తారా?.. నన్ను భరిస్తారా? ఈ హైడ్రామా అనంతరం హన్సన్ ఫేస్బుక్లో ఒక ప్రకటన విడుదల చేశారు. తన బిల్లును సెనేట్ తిరస్కరించినందుకే ఈ నిరసన చేపట్టానని ఆమె స్పష్టం చేశారు. ‘పార్లమెంటు ఈ వ్రస్తాన్ని నిషేధించకపోతే, మహిళలపై అణచివేతకు, జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే ఈ రాడికల్ వ్రస్తాన్ని నేను సభలోనే ప్రదర్శిస్తాను. అప్పుడే ప్రతి ఆ్రస్టేలియన్కు దీని తీవ్రత అర్థమవుతుంది’.. అని స్పష్టం చేశారు. ‘నేను దీన్ని ధరించడం మీకు ఇష్టం లేకపోతే.. బురఖాను బ్యాన్ చేయండి’.. అని ఆమె సవాల్ విసిరారు. -
కింగ్ చార్లెస్3కి షాక్.. ‘నువ్వు మా రాజువి కావంటూ’ నినాదాలు
కాన్ బెర్రా : బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్ట్రేలియా పార్లమెంట్లో అవమానం జరిగింది. పార్లమెంట్లో ఆయన ప్రసంగిస్తుండగా ఆస్ట్రేలియా మహిళా సేనేటర్ లిడియా థోర్ప్ ఆయనకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నువ్వు మా రాజు కాదు అంటూ వలసవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘నువ్వు మా రాజు కాదు. నువ్వు మారణ హోమానికి పాల్పడ్డావు. మా భూమిని, మా నుండి దోచుకున్న వాటిని మాకు ఇవ్వండి’ అని ఆరోపించారుఆస్ట్రేలియా రాజుగా ఈ ఏడాది తొలిసారి కింగ్ చార్లెస్ ఆస్ట్రేలియాలో ఐదురోజుల పాటు పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా పార్లమెంట్లో ప్రసంగించారు. కింగ్ చార్లెస్ ప్రసంగ సమయంలో పక్కనే ఉన్న థోర్ప్ విమర్శలు గుప్పించారు. థోర్ప్ తీరుపై ఆస్ట్రేలియా ప్రజాప్రతినిధులు ఖండించారు. మాజీ ప్రధాన మంత్రి టోనీ అబాట్ సైతం థోర్ప్ ఇలా వ్యవహరించడం దురదృష్టకరం అని అన్నారు. కాగా, రాచరికానికి వ్యతిరేకంగా సేనేటర్ లిడియా థోర్ప్ గతంలో పలు మార్లు ఇలాగే వ్యవహరించారు. -
‘స్వలింగ’ వివాహాలకు ఆస్ట్రేలియాలో చట్టబద్ధత
సిడ్నీ: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును ఇంతకుముందు పార్లమెంట్ ఎగువసభ సెనేట్ 43–12 మెజారిటీతో ఆమోదించగా.. గురువారం కాన్బెర్రాలో సమావేశమైన ప్రతినిధుల సభ (దిగువ సభ) 146–4 మెజారిటీతో ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం పొందగానే సభ్యులు ఆనందంతో చప్పట్లు కొడుతూ, పరస్పరం ఆలింగనాలతో హర్షం వ్యక్తం చేశారు. తొలి నుంచి స్వలింగ సంపర్కుల వివాహాలకు మద్దతు ఇస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ మాట్లాడుతూ..‘సమానత్వానికి, గౌరవానికి, ప్రేమకు ఇది అద్భుతమైన రోజు. ఆస్ట్రేలియా ఎట్టకేలకు సాధించింది’ అని ప్రకటించారు. తాజా చట్టం ప్రకారం ఇకపై స్వలింగ సంపర్కులు తమ వివాహానికి నోటీస్ దాఖలు చేయవచ్చు. నోటీస్ దాఖలు చేసిన 30 రోజుల తర్వాత వివాహం చేసుకోవచ్చు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత షార్టెన్ స్వాగతించారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశాల సరసన ఆస్ట్రేలియా చేరింది. -
ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించిన మోదీ
ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నాట్లు భారత్ ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ రోజు ఆయన ఆస్ట్రేలియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా జీ20 సదస్సును విజయవంతం చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాస్వామ్య భావనలో ఐక్యంగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. భారతీయ యువత మార్పు కోరుకుంటోందన్నారు.30 ఏళ్ల తర్వాత భారత్‌లో స్థిర ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడాలి అన్నారు. -
ఆస్ట్రేలియా పార్లమెంట్ ను తాకిన 'బుర్ఖా' వివాదం!
కాన్ బెరా: బుర్ఖాల ధరింపుపై ఆస్ట్రేలియా పార్లమెంట్ లో రచ్చ కొనసాగుతోంది. బుర్ఖాలపై ధరింపుపై నిరసన వ్యక్తం చేస్తూ ముగ్గురు వ్యక్తులు అభ్యంతరకరమైన మాస్క్ లు ధరించి సభలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కు క్లుక్స్ క్లాన్ మాస్క్, నీకాబ్, హెల్మెట్ ధరించి పాత పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారని, భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఓ కథనంలో వెల్లడించింది. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధరించడాన్ని నిషేధించాలని సెర్జి రెడెగల్లీ, నిక్ ఫోల్క్స్, విక్టర్ వాటర్ సన్ లు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలో బుర్ఖా ధరించడాన్ని నిషేధించాలని ఓ గ్రూప్ డిమాండ్ చేస్తోంది. బుర్ఖాపై నిరసన కార్యక్రమాలు ఆస్ట్రేలియాలో వివాదం రేపుతున్నాయి.


