ఈ ఆడి కారు రూ.1.3 కోట్లు
ముంబై: జర్మనీ లగ్జరీ కార్ కంపెనీ ఆడి భారత మార్కెట్లోకి ఆర్ఎస్ 7 స్పోర్ట్బ్యా క్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర రూ. 1.28 కోట్లు(ఎక్స్ షోరూమ్, ముంబై). తాము గతంలో అందించిన ఆడి ఆర్ఎస్ 5కు మంచి స్పందన లభించిందని, అందుకే ఆర్ఎస్7 స్పోర్ట్‌బ్యాక్‌ను భారత్‌లో ప్రవేశపెట్టామని ఆడి ఇండియా హెడ్ జో కింగ్ చెప్పారు. ఈ ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ తొలి కారును ప్రముఖ హిందీ నటుడు సల్మాన్ ఖాన్‌కు కంపెనీ విక్రయించింది.
త్వరలో ఆర్ఎస్ 6 కారు..: ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 3.9 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 305 కి.మీ. అని కంపెనీ పేర్కొంది. 8-స్పీడ్ టిప్ట్రానిక్ ట్రాన్స్మిషన్, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ రియర్ లైట్స్, ఎంఎంఐ నావిగేషన్, ఎంఎంఐ టచ్, బోస్ సౌండ్ సిస్టమ్, టైర్ ప్రెజర్, టెంపరేచర్ డిస్ప్లే వంటి ప్రత్యేకతలున్నాయి. బీఎండబ్ల్యూ ఎం5, మెర్సిడెస్ బెంజ్ ఈ 63 ఏఎంజీలకు ఈ 5 డోర్ల కారు పోటీనివ్వగలదని పరిశ్రమవర్గాలంటున్నాయి. కాగా కంపెనీ త్వరలోనే ఆర్ఎస్ 6 లగ్జరీ కారును కూడా భారత మార్కెట్లోకి తెచ్చే అవకాశాలున్నాయి.
ద్వితీయార్థంలో అమ్మకాల జోరు: గతేడాది 10,002 కార్లను విక్రయించామని, దీంతో భారత్‌లో ఒక ఏడాదిలో 10 వేల కార్లు విక్రయించిన తొలి కంపెనీగా ఘనత సాధించామని కింగ్ వివరించారు. ఎన్నికల అనంతరం అమ్మకాలు కొంచెం పుంజుకునే అవకాశాలున్నాయనేది ఆయన అంచనా. ప్రస్తుతం 34గా ఉన్న డీలర్‌షిప్‌లను ఈ ఏడాదిలో 40కు పెంచనున్నామని వివరించారు.