breaking news
attacks on pastor
-
రెచ్చిపోయిన జేసీ వర్గీయులు..
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. తాడిపత్రిలో జేసీ వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు గయాజ్ బాషా ఆలియాస్ మున్నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జేసీ వర్గీయుల నుంచి మున్నా తృటిలో తప్పించుకున్నారు. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తిని పరామర్శించి వస్తున్న సమయంలో జేసీ వర్గీయులు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో వారి నుంచి మున్నా ప్రాణాలతో బయటపడ్డారు. అతనికి సంబంధించిన రెండు వాహానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మున్నాను హతమార్చేందుకు జేసీ వర్గీయులు కుట్రపన్నారని తెలుస్తోంది. అంతేకాక వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం, నిధుల గోల్మాల్ వెనుక టీడీపీ నేతల పాత్రపై మున్నా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో దాడికి ప్లాన్ చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. జేసీ ప్రభాకర్ దౌర్జన్యాలు పెరిగిపోయ్యాయి.. వైఎస్ఆర్సీపీ నేత మున్నాపై జరిగిన హత్యాయత్నాన్ని తాడిపత్రి టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, ఫయాజ్ భాషా, జగదీశ్వర్ రెడ్డి ఖండించారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని వారు పేర్కొన్నారు. పబ్లిక్‌గా దాడులు జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. జేసీ అరాచకాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ నేతలు అన్నారు. -
పాపం.. పాస్టర్
చాదర్‌ఘాట్, న్యూస్‌లైన్: గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన పాస్టర్ సంజీవులు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఆయన్ను కుటుంబసభ్యులు శనివారం మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కిడ్నీగ్లాడర్, లివర్, పెద్దపేగు, అవయవాలు పూర్తిగా పనిచేయడం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో పాస్టర్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలుసుకున్న పలు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఇండియన్ దళిత క్రిస్టియన్ అధ్యక్షుడు వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్లపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. దాడులు అమానుషమని, క్రిస్టియన్లకు రక్షణ కల్పిం చలేని సీఎం డౌన్‌డౌన్ అని నినదించారు.జాతీయ రహదారిపై ఆందోళన నేపథ్యంలో కోఠి, దిల్సుఖ్నగర్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయిం ది. అన్నివిధాలా ఆదుకుంటాం: కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన పాస్టర్ సంజీవులును,ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, ఖర్చులు కూడా భరిస్తుందని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి హామీఇచ్చారు. సంజీవులును పరామర్శించి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని హామీఇచ్చారు. దాడులు అమానుషం: బ్రదర్ అనిల్‌కుమార్ పాస్టర్ సంజీవులుపై దాడిని మత ప్రబోధకులు బ్రదర్ అనిల్‌కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తూ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంజీవులు ఆరోగ్యం మెరుగుపడాలని ఆయన ప్రార్థన చేశారు. సంజీవులను పరామర్శించిన వారిలో మలక్‌పేట ఎమ్మెల్యే బలాల, సినీహీరో రాజా, తెలంగాణ క్రిస్టియన్స్ సంఘాల సంయుక్త ప్రధానకార్యదర్శి జెరూసలేం ముత్తయ్య, రంగారెడ్డి,హైదరాబాద్ వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నాయకుడు రవి, విరాజీ, సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.