breaking news
attacks on Parliament
-
ఉగ్ర శిబిరంపై దాడికి వాజ్‌పేయి ఆదేశం!
2001, డిసెంబర్ 13న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పార్లమెంటుపై చేసిన దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ సైన్యం నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరంపై దాడి చేయాలని అప్పటి ప్రధాని వాజ్‌పేయి నిర్ణయించారు. పాక్ తన శిబిరాన్ని వేరే చోటుకు మార్చడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. అమెరికాపై అల్ ఖాయిదా దాడి(9/11) నేపథ్యంలో ఆఫ్ఘన్‌పై యుద్ధానికి దిగిన అమెరికాకు మద్దతివ్వాలని అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ అన్నారు. దానివల్ల క కలిగే నష్టాలను గుర్తించిన వాజ్‌పేయి దౌత్యనీతిని ఉపయోగించి నిర్ణయాన్ని దాటవేశారు. ‘ఏ ప్రైమ్ మినిస్టర్ టు రిమెంబర్: మెమరీస్ ఆఫ్ ఏ మిలటరీ చీఫ్(గుర్తుంచుకోదగిన ప్రధాని:సైన్యాధిపతి జ్ఙాపకాలు) పేరుతో అప్పటి నౌకాదళాధిపతి సుశీల్ కుమార్ రాసిన పుస్తకంలో ఈ విషయాలు పేర్కొన్నారు. ఆ పుస్తకం శుక్రవారం విడుదలయింది. పార్లమెంటుపై దాడి జరగ్గానే త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, భద్రతా సలహాదారు బ్రజేశ్ మిశ్రాలతో సమావేశమయ్యారు. పీవోకేలో ఉన్న ఉగ్ర శిక్షణా శిబిరంపై దాడికి అన్ని నిర్ణయించాం. అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే, పాకిస్తాన్ ఆ శిబిరాన్ని ఒక స్కూలు, హాస్పటల్ మధ్యకి మార్చినట్టు చివరి నిముషంలో తెలిసింది. శిబిరంపై దాడి చేస్తే జననష్టం జరుగుతుందన్న భావంతో ప్రధాని వాజ్‌పేయి దాడి చేయవద్దన్నారు. అని సుశీల్ తన 135 పేజీల పుస్తకంలో పేర్కొన్నారు. -
కేంద్ర మాజీ హోంమంత్రిపై కేసు నమోదు
లక్నో: పార్లమెంటు దాడుల ఘటనపై అఫ్జల్ గురు ఉరితీతకు ముందు విచారణ సరిగా జరపలేదన్న ఆరోపణలతో కాంగ్రెస్ సీనియర్ నేత, అప్పటి కేంద్ర హోంమంత్రి పి.చిదంబరంపై కేసు నమోదు అయింది. లాయర్ వినయ్ కుమార్ అప్పటి ఘటనపై ఫిర్యాదుచేశారు. యూపీ లోని మహారాజ్ గంజ్ కోర్టు ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టింది. ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరితీయ విషయంలో అంతకుముందు జరిగిన దర్యాప్తులలో విచారణలో లోపాలు తలెత్తాయని ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ రాజద్రోహానికి పాల్పడలేదని, జాతి వ్యతిరేక నినాదాలు చేయలేదని చెప్పిన చిదంబరం, వారు స్టుపిడ్ పని చేశారంటూ చెప్పిన వ్యాఖ్యలు చాలు కేంద్ర మాజీ హోంమంత్రిపై చర్యలు తీసుకోవడానికి అని పేర్కొన్నారు. మహారాజ్ గంజ్ కోర్టు ఏప్రిల్ 11న తదుపరి విచారణ జరుగుతుందని వెల్లడించింది. 2001 పార్లమెంట్ దాడుల కేసులో మాస్టర్ మైండ్ అఫ్జల్ గురును 2013 ఫిబ్రవరి9న ఢిల్లీలోని తీహార్ సెంట్రల్ జైలులో ఉరితీసిన విషయం తెలిసిందే.