breaking news
Asian Legends League
-
టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే?
ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 సీజన్లో భాగంగా సోమవారం ఇండియన్ రాయల్స్, శ్రీలంకన్ లయన్స్ జట్లు తలపడ్డాయి. అయితే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బ్యాటర్లు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా స్టార్ ఆల్‌రౌండర్ అసేల గుణరత్నే అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు.లోటస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. గుణరత్నే కేవలం 53 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 98 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ తిషారా పెరీరా(30 బంతుల్లో 67) విధ్వంసకర హాఫ్ సెంచరీతో మెరిశాడు. భారత బౌలర్లలో మన్‌ప్రీత్ గోనీ రెండు, ఈశ్వర్ పాండే, సుబోధ్ తలా వికెట్ సాధించారు. వీరు ముగ్గురు వికెట్లు సాధించినప్పటికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు.కాపాడిన వరుణుడుఅనంతరం 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే స్టార్ ఓపెనర్ అభిషేక్ జలోటా(0), కరణ్ గుప్తా(8) వికెట్లును భారత్ కోల్పోయింది. దీంతో ఇండియన్ రాయల్స్ జట్టు కేవలం 8 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ క్లిష్టసమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. భారీ వర్షం కురువడంతో ప్లేయర్లు డగౌట్స్కు పరిగెత్తారు. అయితే వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఒకవేళ మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా జరిగి ఉండంటే భారత జట్టు ఓడిపోయిండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా అంతకముందు మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత జట్టు ఘన విజయం సాధించింది. మొత్తంగా రెండు విజయాలతో ఇండియన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. -
రేపే భారత్, పాక్ మ్యాచ్.. ఫెవరెట్‌గా గబ్బర్ సేన!
మ్యాచ్ ఏదైనా భారత్, పాకిస్తాన్ మధ్య పోరు అంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడంటే ఎక్కువగా వన్‌సైడ్ ఫలితాలు వస్తున్నాయి కానీ దశాబ్దం కిందట టీమిండియా, పాకిస్తాన్‌లు తలపడుతున్నాయంటే ఎంతో థ్రిల్లింగ్ ఉండేది. ఆఖరి దాకా నువ్వా నేనా అన్నట్లుగా మ్యాచ్‌లు సాగేవి. తాజాగా భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అదేంటి.. ఇప్పుడు ఎలాంటి ఐసీసీ మేజర్ టోర్నీలు జరగడం లేదు కదా? చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ అంటారేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం (ఆగస్టు 2) భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఇండియన్ రాయల్స్, పాకిస్థాన్ పాంథర్స్ జట్ల మధ్య జరిగే ఈ ఆరో మ్యాచ్ జాంబియాలోని లుసాకా నగరంలో ఉన్న లోటస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ హై-వోల్టేజ్ పోరు సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇండియన్ రాయల్స్ జట్టును మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ నడిపించనుండగా.. దినేష్ కార్తీక్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, అంబటి రాయుడు, రిషి ధావన్, స్టువర్ట్ బిన్ని వంటి స్టార్ ఆటగాళ్లతో బలంగా కనిపిస్తోంది. ఇక తమ తొలి మ్యాచ్‌లో గబ్బర్ సేన బంగ్లాదేశ్ టైగర్స్ జట్టును 19 పరుగుల తేడాతో ఓడించి మంచి ఫామ్‌లో ఉంది. మరోవైపు.. మహమ్మద్ హఫీజ్ సారథ్యంలో ఉమర్ అక్మల్, షోయబ్ మాలిక్, వహాబ్ రియాజ్, సోహైల్ తన్వీర్, సయీద్ అజ్మల్ వంటి వెటరన్ ఆటగాళ్లతో కూడిన పాకిస్థాన్ పాంథర్స్ జట్టు తమ మొదటి మ్యాచ్‌లో ఏషియన్ స్టార్స్ చేతిలో 85 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. దీంతో మ్యాచ్‌లో భారత జట్టు ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఆసియా ఖండానికి చెందిన రిటైర్డ్ దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న ఎషియన్ లెజెండ్స్ లీగ్ సీజన్-2 జూలై 30న ప్రారంభమై ఆగస్టు 10న ముగియనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 19 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. గతేడాది జరిగిన తొలి సీజన్లో భారత్ ఫైనల్ చేరుకుని రన్నరప్ నిలిచింది. మొత్తంగా మ్యాచ్‌లు లేక జుట్టు పీక్కుంటున్న క్రికెట్ అభిమానులకు భారత్, పాక్ పోరు ఫుల్ మీల్స్ అందించనుంది.Read: మేరీ కోమ్ స్ఫూర్తి.. కామన్వెల్త్లో పాకిస్తాన్‌కు తొలి పతకం


