breaking news
akbaruddin ovaisi
-
మళ్లీ సెంటిమెంట్ వైపు తెలంగాణ రాజకీయాలు
తెలంగాణలో రాజకీయాలు మళ్లీ సెంటిమెంట్ వైపు నడుస్తున్నట్లున్నాయి. శాసనసభలో కృష్ణా జలాల వాటాకు సంబంధించి, ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించే అంశంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య జరిగిన వాగ్యుద్దం చూస్తే గాలిలో కత్తులు తిప్పుతున్నట్లుగా కనిపించింది. ఇరుపక్షాలు ఒకదానిపై మరొకటి అప్పర్ హ్యండ్ అవడానికి గట్టి ప్రయత్నమే చేశాయి. వీరిద్దరు కాకుండా భారతీయ జనతా పార్టీ, ఎమ్ఐఎమ్లు కొంత ప్రాక్టికల్‌గా మాట్లాడారు. సీపీఐ మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు మద్దతుగా బీఆర్ఎస్ పై పరోక్ష విమర్శలు చేశారు. ఈ క్రమంలో రాయలసీమకు నీటిని పెద్ద ఎత్తున తీసుకువెళ్లడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషిని ఏపీలోని ప్రతిపక్ష తెలుగుదేశం గుర్తించకపోయినా, తెలంగాణ రాజకీయ పక్షాలు అకనాలెడ్జ్ చేసినట్లు అనిపిస్తుంది. వాస్తవం ఏమిటంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి వృధాగా పోతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే ఏపీకి రావాల్సిన నీటి వాటాను పూర్తి స్థాయిలో తీసుకోవడానికి గాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను తలపెట్టారు. కాని కొందరు ఎన్జీటీకి వెళ్లి నిలుపుదల చేయించారు. ఇందులో ఏపీలో విపక్ష తెలుగుదేశం పరోక్ష పాత్ర ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ అంశాన్ని పక్కనబెడితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, సాగర్ తదితర ప్రాజెక్టులను రివర్ బోర్డుకు అప్పగించడానికి అంగీకరించిందంటూ బీఆర్ఎస్ వివాదం చేసింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆద్వర్యంలో నల్గొండలో సభ జరపతల పెట్టిన నేపధ్యంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ చేపట్టి శాసనసభలో ఏభై శాతం నీటి వాటా ఇచ్చేవరకు ప్రాజెక్టులను అప్పగించబోమంటూ ఒక తీర్మానాన్ని పెట్టింది. ఆ తీర్మానానికి బీఆర్ఎస్తో సహా వివిధ పార్టీలు ఆమోదం తెలిపాయి. బీఆర్ఎస్ మాత్రం ఆ తీర్మానంలో తమ గత ప్రభుత్వంపై చేసిన విమర్శలను తొలగించాలని డిమాండ్ చేసింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎమ్బీ) కు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, దానికి ముందు తెలంగాణకు కూడా కృష్ణా జలాలలో ఏభై శాతం ఇవ్వాలని తెలంగాణ రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ట్రిబ్యునల్ నిర్ణయం ప్రకారం ఉమ్మడి ఏపీకి 811 టీఎమ్సీల నీటిని కేటాయించారు. రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా, ఇతర ప్రాధాన్యాల ఆధారంగా తెలంగాణకు 299 టీఎమ్సీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎమ్సీలు నీటిని వాడుకునే అవకాశం కల్పించారు. రాష్ట్ర విభజన సమయంలో దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. దానికి కారణం ఏమిటంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధన ముఖ్యం అంతా భావించారు. నీళ్లు, నియామకాలు, నిధులు అంశాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం వచ్చిందని భావిస్తారు. ఇప్పుడు అదే నీటి అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి కాంగ్రెస్, బీఆర్ఎస్లు రాజకీయ లబ్ది పొందడానికి యత్నించాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఈ సెంటిమెంటును వాడుకోవడానికి ఈ రెండు పార్టీలు ఇప్పటినుంచే కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంటే, ఆ మొత్తం తప్పంతా బీఆర్ఎస్ దేనని కాంగ్రెస్ బుట్ట బోర్లవేస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తూ ఎప్పుడెప్పుడూ ఏమి జరిగింది? చెప్పే యత్నం చేశారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆధ్వర్యంలో ఎఫెక్స్ కమిటీ సమావేశంలో కృష్ణా జలాలలో తెలంగాణకు 299 టీఎమ్సీలు వాటానీటికి, ఏపీకి 511 టీఎమ్సీలు నీరు ఇవ్వడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని ఉత్తమ్ తెలిపారు. కొద్ది నెలల క్రితం కేసీఆర్ వద్ద పనిచేసిన ప్రభుత్వ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రాజక్టులను అప్పగించడానికి అంగీకరిస్తూ లేఖ రాశారని, దానిని ఆమోదించడం లేదని, ఏభై శాతం నీటి వాటాకు ఒప్పుకుంటేనే బోర్డుకు అప్పగిస్తామని ఉత్తమ్ చెప్పారు. ఈ క్రమంలో నీటి పారుదల శాఖను కేసీఆర్ నాశనం చేశారని, వేల కోట్లు దుర్వినియోగం చేశారని ఉత్తమ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో మొత్తం తప్పు బీఆర్ఎస్దే తప్పు అని రుజువు చేయడానికి మంత్రి వాదన వినిపించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఉన్న స్నేహం కారణంగానే పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ సామర్ధాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 92 వేల క్యూసెక్కులకు పెంచుకోగలిగారని, అలాగే రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 8 టీఎమ్సీలు తీసుకువెళ్లే స్కీమ్‌ను చేపట్టారని ఆయన అన్నారు. కాగా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటూ ప్రతిపక్షనేత కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదని ప్రశ్నించారు. ఆయన వచ్చి ఇంతటి ముఖ్యమైన విషయంపై మాట్లాడాలి కదా అని అన్నారు. ఈ చర్చలో పాల్గొంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు తమ పార్టీపై నెపం వేయడానికి మంత్రి వక్రీకరణ చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ప్రాజెక్టులను కేఆర్ఎమ్బీకి అప్పగించడానికి అంగీకరిస్తూ అధికారులు లేఖ రాశారని ఇటీవలవరకు ఉన్న ఈఎన్సీ మురళీదర్ బోర్డు సమావేశం తర్వాత చేసిన వ్యాఖ్యల వీడియోను హరీష్ ప్రదర్శించారు. దానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి జోక్యం చేసుకుంటూ ఆయన బీఆర్ఎస్ ఏజెంట్ అని అందుకే తీసివేశామని, మరికొందరు ఏజెంట్లు ఉన్నారని, వారిపై కూడా చర్య తీసుకుంటామని అన్నారు. హరీష్ రావు, మరో నేత కడియం శ్రీహరిలు 299 టీఎమ్సీల కేటాయింపు తమకు సంబంధం లేనిదని, గతంలో ట్రిబ్యునల్ చేసిందని వివరించే యత్నం చేశారు. మంత్రి ఉత్తమ్ ఆ విషయాన్ని దాటవేస్తూ మాట్లాడడం విశేషం. అలాగే కేసీఆర్ సభకు రాని అంశాన్ని హరీష్‌రావు సమాదానం చెప్పకుండా దాటవేశారు. నిజానికి తెలంగాణకు కేటాయించిన 299 టీఎమ్సీల నీటిని పూర్తిగా వాడుకోగలిగితే ముప్పై లక్షల ఎకరాలు సాగు చేయవచ్చు. కాని ఇంకా ఆ పరిస్తితి రాలేదు. అంతేకాక కృష్ణానదికి నీరురావడం ఆరంభం అయిన వెంటనే కల్వకుర్తి వంటి లిఫ్ట్ స్కీమును ఆపరేట్ చేసి నీటిని తీసుకోవచ్చు. వీటన్నిటినీ విస్మరించి, కేఆర్ఎమ్బీ ప్రాజెక్టులు అప్పగించడం వల్ల ఏదో నష్టం జరుగుతుందన్న చందంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు చర్చను జరిపారయి. ఇది పరస్పరం విమర్శలకే ఉపయోగపడుతుంది. కేసీఆర్ కూడా ఎన్నికలలో పరాజయం తర్వాత తొలిసారి నల్గొండలో కృష్ణా జలాలకు సంబంధించిన సమస్యపైనే భారీ సభలో మాట్లాడబోతున్నారు. అంటే తెలంగాణ సెంటిమెంట్ తమతోటే ఉండేలా వారుప్లాన్ చేసుకుంటున్నారని అనుకోవాలి. దీనిని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వారిన వైనం, అవినీతిపై ఫోకస్ పెట్టింది. కాగా బీజీపీ సభ్యుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు ఘర్షణ పడే పరిస్తితి ఉన్నప్పుడు కేఆర్ఎమ్బీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తప్పేముందని అభిప్రాయపడ్డారు. బోర్డుకు ప్రాజెక్టులకు అప్పగించడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? లాభం ఏమిటన్న దానిపై ఆలోచించాలని సూచించారు. కాంగ్రస్, బీఆర్ఎస్లు ఈ కోణంలో కాకుండా పరస్పరం నిందలు మోపుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఎమ్ఐఎమ్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ విభజన చట్టం చేసినప్పుడే తాము ఈ సమస్యలు వస్తాయని చెప్పామని గుర్తు చేశారు. కానీ అప్పట్లో ఏ రాజకీయ పార్టీ దీని గురించి పట్టించుకోలేదని అన్నారు. వాస్తవానికి తెలంగాణలో ఉన్న నీటి ప్రాజెక్టులకు ఎంత నీరు అవసరమో, అంతమేర నీటిని పొందడానికి యత్నించడం తప్పు కాదు. కానీ ఆ పాయింట్లో ఈ నేతలు ఎవరూ మాట్లాడలేదు. కేవలం ఏభై శాతం కృష్ణానది జలాలలో వాటా ఇవ్వాలన్న డిమాండ్‌కే పరిమితం అయ్యారు. ఎందుకంటే వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఆయా పార్టీలు దీనిని ఒక నినాదంగా తీసుకోవాలని చూస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పటికే సభలు, ఉద్యమాలకు పిలుపు ఇచ్చింది. దానిని తిప్పి కొట్టడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ప్లాన్ చేశారు. కర్నాటక రాష్ట్రం తుంగభద్ర నదిపై కడుతున్న కొత్త ప్రాజెక్టు, వర్షాభావ పరిస్థితిలో కృష్ణానదికి నీటి కొరత ఏర్పడుతున్న విషయాన్ని కూడా ఆయా సభ్యులు ప్రస్తావించారు. ఇంకో సంగతి చెప్పాలి. కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు గతంలో భేటీ అయిన సందర్భాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అప్పట్లో గోదావరి నుంచి కృష్ణానదికి నీటిని మళ్లించే ఒక స్కీమును కేసీఆర్ ప్రతిపాదించారు. దానికి తొలుత వైఎస్ జగన్మోహన్రెడ్డి సముఖత వ్యక్తం చేశారు. అప్పుడు ఏపీ శాసనసభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశంసించారని అంటూ ఉత్తంకుమార్ రెడ్డి ఒక వీడియోని ప్రదర్శించారు. నిజానికి అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా దానిని చూపారు. ఆ తర్వాత రోజులలో ఏపీ ప్రభుత్వం ఆ స్కీముపై వెనక్కి తగ్గింది. నిజానికి దానివల్ల తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం.దానిని గుర్తించే ఏపీ వెనక్కి తగ్గింది. కానీ ఉత్తమ్ మాత్రం అదేదో ఏపీకి కేసీఆర్ మేలు చేసేసినట్లు పిక్చర్ ఇచ్చారు. అలాగే ఒకసారి కుటుంబంతో సహా కంచి వెళుతూ కేసీఆర్ మధ్యలో నగరిలో ప్రస్తుత మంత్రి రోజా ఇంటి వద్ద ఆగి భోజనం చేశారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ గోదావరి జలాలు పెద్ద ఎత్తున సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని రాయలసీమకు తరలించగలిగితే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని అన్నారు. దానిని వక్రీకరిస్తూ కేసీఆర్ ఏదో రాయలసీమకు నీళ్లు ఇస్తానని అన్నట్లు ఉత్తమ్, తదితర కాంగ్రెస్ సభ్యులు చెప్పడం విశేషం. తెలంగాణతో పోల్చితే ఏపీలో విస్తీర్ణం ఎక్కువ సాగు భూమి ఎక్కువ. జనాభా ఎక్కువ. నది దిగువ ప్రాంతం కావడంతో వరదలు వచ్చినా భరించేది ఆ రాష్ట్రమే. అలాగే మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు వాడుకున్న తర్వాత మిగిలిన నీటినే ఏపీ వాడుకోవల్సిన పరిస్థితి పలుమార్లు వస్తోంది. శ్రీశైలంలో నీటి కొరత ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని కిందికి వదలివేస్తుంటుంది. తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ చెప్పినట్లు కృష్ణాపై పది అనుమతి లేని ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాటికి శ్రీశైలంలో తక్కువ నీటి మట్టం ఉన్నా లిప్ట్ ద్వారా నీటిని తీసుకువెళతారు. అదే ఏపీ వైపు నీటి మట్టం 854 ఉంటేనే అది కూడా వరద నీటినే తరలించుకోగలుగుతారు. కొన్నిసార్లు తన వాటా నీటిని కూడా వాడుకోలేకపోతున్నామని ఏపీ వాదన. ఈ నేపధ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోత స్కీమ్‌ను చేపట్టింది. అయితే ఈ విషయాలతో సంబంధం లేకుండా తెలంగాణ ఎమ్మెల్యేలు ఏపీతో సమానంగా నీటి వాటాను డిమాండ్ చేస్తూ చర్చలు జరిపారు. చివరికి దీనిని ఎంత సెంటిమెంటుగా మార్చుతారో తెలియదు కానీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు మాత్రం గాలిలో కత్తులతో పోరాటం చేసినట్లే అనిపించింది. – కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
మౌనంగా ఉండటమా.. లేక బరిలో దిగడమా.. ముంతాజ్ ఖాన్ దారెటు?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు మజ్లిస్ (ఎంఐఎం) పార్టీ ప్రకటించింది. నగరంలోని పాత బస్తీలోని ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో సైతం బరిలో దిగనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం దారుస్సలాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తొలి జాబితాలో ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. చాంద్రాయణగుట్ట స్థానానికి అక్బరుద్దీన్ ఒవైసీ, మలక్‌పేట స్థానానికి అహ్మద్ బలాల, కార్వాన్కు కౌసర్ మోహియుద్దీన్, నాంపల్లికి మాజీద్ హుస్సేన్, చార్మినార్‌కు జుల్ఫీకర్, యాకుత్‌పురాకు జాఫర్ హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. త్వరలో బహదూర్‌పురా, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ అభ్యర్థులను ప్రకటిస్తామని అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. మజ్లిస్ పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తామన్నారు. ఉద్దండులకు మొండిచేయి.. రాజకీయ ఉద్దండులు, ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు మజ్లిస్ పార్టీ మొండిచేయి చూపించింది. చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్, యాకుత్‌పురా సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీలకు సీటు కేటాయించ లేదు. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వం యాకుత్‌పురా స్థానానికి మారింది. ఈసారి కొత్తగా ఇద్దరు మాజీ మేయర్లకు అవకాశశం లభించింది. నాంపల్లి సిట్టింగ్ స్థానానికి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్‌కు, చార్మినార్ సిట్టింగ్ స్థానాన్ని జుల్ఫీకర్లకు కేటాయించారు. 2018 ఎన్నికల తర్వాత తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు ఎన్నికల బరి నుంచి తప్పించి పార్టీలో వారి సేవలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పార్టీ అధినేత అసదుద్దీన్ ప్రకటించారు. కొత్తగా జూబ్లీహిల్‌లో.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్షాన భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బరిలో దిగుతుండగా.. ఏఐఎంఐఎం కూడా పోటీ చేస్తామని ప్రకటించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. ఈసారి పోటీ నిర్ణయం వెనుక మతలబు అర్థం కాని పరిస్థితి నెలకొంది. అత్యంత సంపన్నలున్న ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మజ్లిస్ గతంలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. 2014 ఎన్నికల్లో మజ్లిస్ తరఫున రంగంలో దిగిన నవీన్ యాదవ్ టీడీపీ అభ్యర్థి మాగంటికి ఢీ అంటే ఢీ అనేంతలా పోటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో మజ్లిస్ పోటీకి దూరం పాటించి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటికి మద్దతు ఇచ్చింది. అయినప్పటికీ నవీన్ యాదవ్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగి గట్టి పోటీ ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు. ఈసారి తిరిగి మిత్ర పక్షమైన బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో పోటీకి దిగడం ఆసక్తి రేపుతోంది. డబుల్ హ్యాట్రిక్.. 'ఓటమి ఎరగని నేతగా యాకుత్‌పురా నుంచి ఐదుసార్లు, చార్మినార్ నుంచి ఒకసారి వరుసగా విజయంసాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన అనంతరం ముంతాజ్ ఖాన్‌కు టికెట్ దక్కకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థంగా మారింది. పార్టీ అధిష్టానం ప్రతిపాదన మేరకు రిటైర్మెంట్కు సిద్ధమంటూనే తన కొడుకుకు టికెట్ ఇవ్వాలని మెలికపెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఏకంగా టికెట్ ఇవ్వకున్నా బరిలో దిగుతానని అల్టిమేటం ఇవ్వడంతో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ రంగంలో దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్, ఎంబీటీలు సంప్రదింపులు చేస్తూ పార్టీ పక్షాన రెండు సీట్ల బంపర్ ఆఫర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా చార్మినార్ అసెంబ్లీ స్థానానికి మాజీ మేయర్ జుల్ఫీకర్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పార్టీ నిర్ణయం మేరకు మౌనంగా ఉండటమా? లేక బరిలో దిగడమా? ముంతాజ్ ఖాన్ ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ తిరుగుబాటు బావుటా ఎగరవేస్తే మాత్రం పాతబస్తీ రాజకీయాల్లో సంచలన మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చార్మినార్ అసెంబ్లీ స్థానంపై దృష్టి సారించింది. ఇంకా అభ్యర్థి ప్రకటించలేదు. ఇవి చదవండి: అందోల్ కోటలో గెలుపెవరిది..? తీవ్రంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు! -
అడ్డుకున్నందుకే అంతమొందించాలనుకున్నారు
- పహిల్వాన్ గ్యాంగ్ ప్రభుత్వ భూముల ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు చేశా - హత్యాయత్నానికి 17 రోజుల ముందే చంపుతామని బెదిరించారు - కోర్టులో వాంగ్మూలమిచ్చిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సాక్షి, హైదరాబాద్: తన నియోజకవర్గంలోని ప్రభుత్వ స్థలాలను పహిల్వాన్ గ్యాంగ్ ఆక్రమించిందని వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకే తనను అంతమొందించాలని వారు ప్రయత్నించారనీ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. తనపై జరిగిన హత్యాయత్నం కేసులో అక్బరుద్దీన్ బుధవారం రెండోసారి నాంపల్లి కోర్టుకు హాజరై వాంగ్మూలమిచ్చారు. ఆ వివరాలు ఇలా... 2009 ఎన్నికల్లో నా ప్రత్యర్థికి మద్దతిచ్చారు ‘2009 ఎన్నికల్లో మహ్మద్ పహిల్వాన్ నా ప్రత్యర్థి ఎంబీటీ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. అప్పటి నుంచే నామీద కక్ష పెంచుకొని చంపుతామని బెదిరించారు. పహిల్వాన్, మునావర్ ఇక్బాల్‌లు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నట్లుగా స్థానికులు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులకు వినతిపత్రం ఇచ్చాను. దీనిపై హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ స్పందించి ఆక్రమించిన స్థలాలను పరిశీలించి అక్కడ నిర్మాణాలు ప్రారంభమైనట్లు గుర్తించారు. 2011 ఏప్రిల్ 13న గుర్రంచెరువు కట్ట ప్రాంతంలో స్థానిక ఆర్ఐతో కలిసి అక్రమ నిర్మాణాలను పరిశీలించి వస్తుండగా యూనుస్ బిన్ ఓమర్ యాఫై ఆయన కుమారుడు ఈసా బిన్ యూనుస్ యాఫైలు నా వాహనాన్ని ఆపారు. నాతో వాగ్వాదానికి దిగి చంపుతామని బెదిరించారు. పహిల్వాన్ గ్యాంగ్ అక్రమాలను అడ్డుకుంటున్నాననే కక్షతోనే నన్ను చంపి అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 30, 2011న కత్తులు, తుపాకులు, క్రికెట్ బ్యాట్‌తో నాపై దాడి చేశారు. ఈ దాడిలో అనేకచోట్ల కత్తులతో పొడిచారు. బుల్లెట్ గాయాలయ్యాయి’’ అని అక్బరుద్దీన్ వివరించారు. ఈ సందర్భంగా తనను చంపుతామని బెదిరించిన మునావర్ ఇక్బాల్, యూనుస్ బిన్ ఓమర్ యాఫైలను అక్బరుద్దీన్ గుర్తించారు. కేర్ ఆసుపత్రిలో 20 రోజులు చికిత్స పొందా ‘‘దాడి తర్వాత అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాను. ముందుగా నన్ను ఓవైసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిసింది. కేర్ ఆసుపత్రిలో 20 రోజులపాటు చికిత్స పొందాను. కేర్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మూడు శస్త్రచికిత్సలు జరిగాయి. జూలైలో గ్లోబల్ ఆసుపత్రిలో కడుపు భాగంలో, సెప్టెంబర్‌లో ఎడమ చేయి ఎముకను సరిచేసేందుకు శస్త్రచికిత్సలు జరిగాయి. దాడి సమయంలో మూత్రపిండం, పెద్దపేగు దెబ్బతిన్నాయి. మూత్రపిండం ఐరన్‌ను తీసుకునే పరిస్థితి లేకపోవడంతో 2012 జనవరిలో స్టంట్ వేశారు’’ అని అక్బరుద్దీన్ వివరించారు. ఇదిలా ఉండగా పహిల్వాన్ సహా ఇతర నిందితుల తరఫు న్యాయవాదులు గురువారం అక్బరుద్దీన్‌ను క్రాస్ఎగ్జామినేషన్ చేయనున్నారు. -
ఈసీ రూల్స్ కాగితాలకే పరిమితమా?- నిరంజన్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సభ్యులపై నిషేధం విధించాలని పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఎన్నికల నియామలికి విరుద్దంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నా... ఎన్నికల పరిశీలకులకు వినపడటం లేదా అని అడిగారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాత నగరంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్లి వారి ఆదరాభిమానాలు పొందుతుంటంతో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పిచ్చికుక్కలా మెరుగుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ఈ సందర్భంగా అసిఫ్‌నగర్‌లో అక్బరుద్దీన్ చేసిన ప్రసంగ వీడియోను ప్రదర్శించారు. కొంత కాలంగా ఎంఐఎం నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నా ఈసీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమా? అని అడిగారు. ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకునే ధైర్యం ఈసీకి లేకపోతే అదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని వారే చూసుకుంటారన్నారు. ఎన్నికల నియామావలి 243-కె, 243 జెడ్ఏ ప్రకారం ఎంఐఎం నేతలను ఎన్నికల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఐఎం సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లను పాతబస్తీ నుంచి తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుందన్నారు.