Agama advisory bord
-
తిరుమల ఆలయంపై విమానం చక్కర్లు.. దాడుల వేళ అలర్ట్!
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టిన తీవ్ర కలకలం రేపింది. ఆగమశాస్ర్త నిబంధనలు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల చర్యల కారణంగా తిరుమలకు ముప్పు పొంచి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఆగమశాస్ర్త నిబంధనలు విరుద్దంగా తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఆలయంపై నుండి విమానం వెళ్లింది. విమానం వెళ్లడాన్ని చూసి తిరుమలలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరిన ఫలితం మాత్రం శూన్యం. కాగా.. నేడు విమానం చక్కర్లపై టీటీడీ భద్రత అధికారులు ఆరా తీస్తున్నారు.మరోవైపు.. దేశంలో ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో తిరుమలకు ప్రమాదం ముప్పు పొంచి ఉంది. అంతకుముందు, జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో దాడి తర్వాత తిరుమలలో హైఅలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తిరుమలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తుల వాహనాలను తనిఖీలు చేశారు. -
11 మందితో ఆగమ సలహా మండలి ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 మంది సభ్యులతో కూడిన ఆగమ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణ యజుర్వేదం చిర్రవూరి శ్రీరామ శర్మ ఆగమ సలహా మండలికి చైర్మన్‌గా నియమించారు. ఆయనతో పాటు విశ్వనాధ గోపాలకృష్ణ (రాజమండ్రి ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపల్), నల్లూరి రామచంద్ర భట్టాచార్య (మంగళగిరి లక్ష్మీ నర్సింహస్వామి ఉప ప్రధాన అర్చకులు), మోర్త సీతారామాచార్యులు (సింహాచలం వరహలక్ష్మి దేవాలయం రిటైర్డ్ అర్చకులు), ఎస్ఎంకె సదాశివ (కాళహస్తీశ్వర స్వామి ఆలయ రిటైర్డ్ అర్చకులు), రేవణ్ణ సిద్ధాంతి (కర్నూలు), జగన్నాధ శాస్త్రి (పశ్చిమ గోదావరి, వైదిక శాస్త్ర పరిషత్), చిలకపాటి తిరుమలాచారి (రిటైర్డ్ లెక్చరర్, తిరుపతి), రాజా ఎస్ గిరి ఆచార్య (మంత్రాలయం, కర్నూలు), రాఘవయ్య (అల్లూరు పోలేరమ్మ ఆలయ ఆర్చకులు), ఎల్.సుబ్రహ్మణ్య సిద్ధాంతి (కంచి కామకోటి పీఠం) లను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ సలహా మండలి ఐదేళ్లపాటు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.