breaking news
Adil aphroj
-
ఇక్కడ ఆదిల్... అక్కడ బాబాజాన్!
అఫ్రోజ్‌పై అహ్మదాబాద్‌లో కుట్ర కేసు గత నెలలో సౌదీ నుంచి డిపోర్టేషన్ గుజరాత్‌కు తరలించిన డీసీబీ అధికారులు సిటీబ్యూరో: సౌదీ అరేబియా నుంచి డిపోర్టేషన్‌పై వచ్చిన నగరవాసి మహ్మద్ ఆదిల్ అఫ్రోజ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నమోదైన కేసులోనూ వాంటెడ్‌గా ఉన్నాడు. బాబాజాన్ పేరుతో అక్కడి యువతకు పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిక్షణ ఇప్పించాడనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే అఫ్రోజ్‌ను అహ్మదాబాద్ డీసీబీ అధికారులు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై తీసుకువెళ్లారు. న్యాయస్థానం అనుమతి మేరకు తదుపరి విచారణ నిమిత్తం గురువారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. నగరంలోని సైదాబాద్ ప్రాంతానికి చెందిన ఆదిల్ అఫ్రోజ్ సీసీఎస్ ఆధీనంలోని సిట్‌లో 2003లో నమోదైన కేసులో వాంటెడ్‌గా ఉండి దాదాపు 13 ఏళ్లు పాటు సౌదీ అరేబియాలో తలదాచుకుంటున్నాడు. సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత ఇతడి ఆచూకీ కనిపెట్టిన నిఘా వర్గాలు సంబంధిత ఏజెన్సీలకు ఆధారాలను సమర్పించడం ద్వారా గత నెల 22న డిపోర్టేషన్‌పై తీసుకువచ్చాయి. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్‌పాండ్య 2003 మార్చ్‌లోహత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తు చేసిన డీసీబీ అధికారులు గుజరాత్లో పేలుళ్లకు పన్నిన ఓ కుట్రను ఛేదించారు. గుజరాత్, తెలంగాణలకు చెందిన వ్యక్తులు పథకం ప్రకారం కొంత మందిని పాకిస్థాన్‌కు పంపించి ఉగ్రవాద శిక్షణ ఇప్పించారని, భారీ విధ్వంసానికి కుట్ర పన్నారన్న ఆరోపణలతో డీసీబీ అధికారులు ఇప్పటి వరకు 62 మందిని అరెస్టు చేయగా... 22 మంది దోషులుగా తేలారు. మరో 22 మందిని అహ్మదాబాద్‌లోని పోటా న్యాయస్థానం సరైన ఆధారాలు లేనికారణంగా నిర్దోషులుగా విడిచిపెట్టింది. 2003లోనే నమోదైన ఈ కేసులో ఆదిల్ వాంటెడ్‌గా ఉన్నాడు. అహ్మదాబాద్ యువతను బాబాజాన్ పేరుతో ఆకర్షించి పాకిస్థాన్‌కు పంపి ఉగ్రవాద శిక్షణ ఇప్పించాడని డీసీబీ అధికారులు ఆరోపించారు. అఫ్రోజ్‌ను డిపోర్ట్ చేసిన విషయం తెలుసుకున్న అహ్మదాబాద్ పోలీసులు గత వారం పీటీ వారెంట్‌పై గుజరాత్ తీసుకువెళ్లారు. పోటా కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించడంతో తదుపరి విచారణ నిమిత్తం గురువారం సబర్మతి జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. -
ఉగ్రవాద అనుమానితుడు ఆదిల్ అఫ్రోజ్ డిపోర్ట్
♦ సౌదీ నుంచి రప్పించి నగరంలో అరెస్టు ♦ సిట్‌లో నమోదైన ఓ కేసులో మోస్ట్ వాంటెడ్ ♦ రిమాండ్‌కు తరలించిన నగర సిట్ అధికారులు సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద అనుమానితుడు ఆదిల్ అఫ్రోజ్ చిక్కాడు. సుదీర్ఘకాలంగా పరారీలో ఉన్న ఇతడిని సోమవారం దుబాయ్ నుంచి డిపోర్టేషన్‌పై(బలవంతంగా తిప్పిపంపడం) హైదరాబాద్‌కు రప్పించారు. సీసీఎస్ అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయడానికి ‘సిట్’ సన్నాహాలు చేస్తోంది. నగరంలోని సైదాబాద్ ప్రాంతానికి చెందిన ఆదిల్ అఫ్రోజ్ దాదాపు 13 ఏళ్లుగా సౌదీ అరేబియాలో తలదాచుకుంటున్నాడు. సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత ఇతడి ఆచూకీ కనిపెట్టిన నిఘా వర్గాలు సంబంధిత ఏజెన్సీలకు ఆధారాలను సమర్పించడం ద్వారా డిపోర్టేషన్ చేయించగలిగాయి. పాస్‌పోర్ట్ ఏజెంట్ అరెస్టుతో... నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2003 ఏప్రిల్ 19 కూర్మగూడ ప్రాంతంలో పాస్‌పోర్ట్ ఏజెంట్ జుబేర్ షరీఫ్‌ను అరెస్టు చేశారు. నకిలీ పాస్‌పోర్ట్‌ల తయారీకి సంబంధించిన ఈ కేసు దర్యాప్తులోనే ఉగ్రవాద కోణం వెలుగులోకి వచ్చింది. చంచల్‌గూడకు చెందిన ఎజాజ్ అలి యాస్ మాము ప్రోద్బలంతో ఇతడు ఉగ్రవాద బాటపట్టాడు. 2002 అక్టోబర్ 6న జుబేర్, ఎజాజ్ తదితరులతో పాటు ఆదిల్ అఫ్రోజ్ సైతం పాకిస్థాన్‌కు పయనమయ్యాడు. కోల్‌కతా వరకు రైల్లో వెళ్లిన ఈ బృందం అక్కడ నుంచి అక్రమ మార్గంలో బ్యాంకాక్ చేరుకుంది. అక్కడ ఇక్బాల్ వీరిని రిసీవ్ చేసుకుని ఓ హోటల్‌కు తీసుకువెళ్లాడు. రెచ్చగొట్టే దృశ్యాలున్న సీడీలు చూపించడం ద్వారా వీరిలో విద్వేషాన్ని పెంచాడు. తరువాత ఇస్లామాబాద్‌కు వెళ్లిన ఈ బృందం అటవీ ప్రాంతం లో ఉగ్రవాద శిక్షణ తీసుకుని.. హైదరాబాద్ వచ్చి ‘కార్యాచరణ ప్రణాళిక’ సిద్ధం చేసుకుంది. కాలిఖబర్లో కీలక సమావేశం... విద్రోహ కార్యకలాపాలు చేపట్టాలని పథక రచన చేసిన ఎజాజ్, అస్లం, ఆదిల్ తదితరులు నగరంలోని కాలిఖబర్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్లో కలిశారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2003 అక్టోబర్ 8న ఎజాజ్‌తో సహా నలుగురు నిందితుల్ని అరెస్టు చేసింది. విషయం తెలుసుకున్న అస్లం ఖాన్, ఆదిల్ తదితరులు నగరం నుంచి పరారయ్యారు. ఆదిల్ కొన్ని రోజుల తర్వాత సింగపూర్ మీదగా సౌదీ అరేబియా పారిపోయాడు. అప్పటి నుంచి అనేక ప్రయత్నాలు చేసిన నిఘా వర్గాలు ఎట్టకేలకు ఆదిల్ అఫ్రోజ్‌ను సోమవారం డిపోర్టేషన్‌పై తీసుకురావడంతో సఫలీకృతులయ్యారు. సిట్‌లో నమోదై ఉన్న కేసులో (ఎఫ్ఐఆర్ నెం.169/2003) ఆదిల్‌ను అరెస్టు చేశారు.