Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Andhra Pradesh Elections Exit Poll Result 2024
ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: ఏపీలో మళ్లీ ‘ఫ్యాన్‌’ ప్రభంజనమే

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించి మళ్లీ అధికారంలోకి రానుందని ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చాయి. వైఎస్సార్‌ సీపీ విజయ భేరి మోగించనుందని స్పష్టం చేశాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం జగన్‌ ప్రభుత్వానికే మరోసారి జనం జై కొట్టనున్నారని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. వైఎస్సార్‌సీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ఆరా సంస్థ తేల్చింది. 94 నుంచి 104 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలవబోతుందని ఆరా మస్తాన్‌ తెలిపారు. 13-15 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలవబోతుందని ఆరా అంచనా వేసింది. షర్మిలకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఆరా మస్తాన్‌ తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 98 నుంచి 116 వరకు.. టీడీపీ 59-77 వస్తాయని ఆత్మసాక్షి సంస్థ అంచనా వేసింది. వైఎస్సార్‌సీపీకి 117 నుంచి 120.. టీడీపీకి 48 నుంచి 50 సీట్లు దక్కవచ్చని రేస్‌ తెలిపింది.ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్‌:ఆత్మసాక్షి: వైఎస్సార్‌సీపీ: 98-116టీడీపీ 59-77రేస్‌:వైఎస్సార్‌సీపీ-117-120టీడీపీ-48-50పోల్‌ స్ట్రాటజీ గ్రూప్‌:వైఎస్సార్‌సీపీ- 115-125టీడీపీ- 50-60ఆపరేషన్‌ చాణక్య:వైఎస్సార్‌సీపీ: 95-102టీడీపీ: 64-68చాణక్య పార్థదాస్‌:వైఎస్సార్‌సీపీ: 110-120టీడీపీ: 55-65 పోల్ స్ట్రాటజీ గ్రూప్‌:వైఎస్సార్‌సీపీ: 115-125టీడీపీ: 50-60జన్‌మత్‌:వైఎస్సార్‌సీపీ: 95-103టీడీపీ: 67-75అగ్నివీర్‌:వైఎస్సార్‌సీపీ: 124-128టీడీపీ: 46-49పోల్ లాబొరేటరీ:వైఎస్సార్‌సీపీ: 108టీడీపీ: 67WRAP స్ట్రాటజీస్‌:వైఎస్సార్‌సీపీ: 158-171టీడీపీ-0-4ఏబీపీ- సీ ఓటర్‌:వైఎస్సార్‌సీపీ 97-108టీడీపీ 67-78ఏపీ లోక్‌సభ ఎగ్జిట్‌ పోల్స్‌:ఆరా మస్తాన్‌:వైఎస్సార్‌సీపీ: 13-15టీడీపీ:10-12ఆత్మసాక్షి:వైఎస్సార్‌సీపీ: 17టీడీపీ: 08రేస్‌:వైఎస్సార్‌సీపీ-19టీడీపీ- 06టైమ్స్‌ నౌ-ఈటీజీ:వైఎస్సార్‌సీపీ: 14టీడీపీ-11 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించి సత్తా చాటింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సీఎం జగన్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక 99 శాతం అమలు చేయడంతో పేదవర్గాల్లో అధికార వైఎస్సార్‌సీపీకి ఆదరణ మరింత పెరిగింది. దీంతో ఓటర్లు మరోసారి వైఎస్సార్‌సీపీకి అవకాశం కల్పించారని ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు చెబుతున్నాయి.

Sakshi Editorial On Exit polls 2024
విజయం సరే... విలువలు?

ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్‌ తత్త్వవేత్త హెగెల్‌ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్‌ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్‌ మార్క్స్‌ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్‌ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్‌ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్‌ ది స్టేట్‌’ (నేనే రాజ్యం) అనే కొటేషన్‌తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.హెగెల్‌ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్‌లో వేయగా వచ్చిన సింథసిస్‌నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్‌ సైన్స్‌తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్‌ హాబ్స్‌ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్‌ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్‌లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్‌ కీ బార్‌... చార్‌ సౌ పార్‌’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్‌ సౌ పార్‌’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్‌గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను ప్రమోట్‌ చేయలేదు. మార్టిన్‌ లూథర్‌ కింగ్, నెల్సన్‌ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్‌ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్‌ లూథర్‌ కింగ్, నెల్సన్‌ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అమెరికాలో ఆచరణలో పెట్టారు.గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్‌ వెల్లడించారు. పండిత్‌ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్‌ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.రిచర్డ్‌ అటెన్‌బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్‌స్టీన్‌ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్‌టైమ్‌ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్‌ రచయిత లియో టాల్‌స్టాయ్‌ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.విఐ లెనిన్, విన్‌స్టన్‌ చర్చిల్, ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్, మార్టిన్‌ లూథర్‌కింగ్, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్, అడాల్ఫ్‌ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్‌ మండేలా, పండిత్‌ నెహ్రూ, మదర్‌ థెరిసా, మార్గరెట్‌ థాచర్‌ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్‌ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్‌ శక్తులన్నీ కలిసి ప్రమోట్‌ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్‌ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్‌ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్‌ ట్రిలియన్‌ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్‌ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్‌ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్‌ సౌ పార్‌’ కోసమేనా?ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Sajjala Ramakrishna Reddy Key Comments On Exit Polls
వైఎస్సార్‌సీపీకి అదే కలిసొచ్చింది.. ఎగ్జిట్‌ పోల్స్‌పై సజ్జల కీలక వ్యాఖ్యలు

సాక్షి, తాడేపల్లి: ఎగ్జిట్‌ పోల్స్‌ ట్రెండ్‌ వైఎస్సార్‌సీకి అనుకూలంగా ఉందని.. మేం అంచనా వేసిందే ఎగ్జిట్‌ పోల్స్‌లో వచ్చాయని.. ఫలితాలు దీనికంటే మెరుగ్గా ఉంటాయని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌పై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మహిళలే కాదు కుటుంబం మొత్తం తమవైపే ఉందన్నారు. ‘‘మా పాలనలో మహిళలకు పెద్దపీట వేశాం.. వారి ఆత్మగౌరవాన్ని పెంచాం. సీఎం జగన్‌ ఉంటేనే మంచి జరుగుతుందని మహిళలు నమ్మారని సజ్జల అన్నారు. విపక్షాలు కూటమిగా వచ్చాయి. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం టీడీపీకి లేదు. వైఎస్సార్‌సీపీకి పాజిటివ్‌ అజెండా కలిసి వచ్చింది. ఈ ఐదేళ్లలో మార్పు వచ్చిందని ప్రజలు నమ్మారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘లంచాలు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. భారీస్థాయిలో మహిళలు వైఎస్సార్‌సీపీని మరోసారి ఆదరించారు. సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి’’ అని సజ్జల చెప్పారు.

Dinesh Karthik Announces Retirement From All Forms of Cricket
రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా స్టార్‌

టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు శనివారం ప్రకటించాడు. ఇటీవలే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన డీకే.. అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా తాజాగా వీడ్కోలు పలికాడు.తన 39వ పుట్టినరోజున దినేశ్‌ కార్తిక్‌ ఈ మేరకు ఇన్‌స్టా ఉద్వేగపూరిత పోస్ట్‌తో తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘‘గత కొన్ని రోజులుగా నాకు లభిస్తున్న మద్దతు, నాపై కురిపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలలో తడిసి ముద్దవుతున్నా. దీనకంతటికి కారణమైన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా. బాగా ఆలోచించిన తర్వాత రిప్రెజెంటేటివ్‌ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నా. అధికారికంగా నా రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నా.దీపికకు కూడా చాలా రుణపడి పోయాను!ఈ ప్రయాణంలో నాకు సహకరించిన కోచ్‌లు, కెప్టెన్లు, సెలక్టర్లు, సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు. జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం.నేను ఇక్కడిదాకా చేరుకోవడానికి నా తల్లిదండ్రులే కారణం. వారి ఆశీర్వాదాలు లేకుండా నేను ఇదంతా సాధించేవాడినే కాదు. దీపికకు కూడా చాలా రుణపడి పోయాను.తను స్వతహాగా ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ అయినప్పటికీ తన కెరీర్‌ కొనసాగిస్తూనే నాకూ అండగా నిలిచింది. ఇక అందరికంటే పెద్ద థాంక్స్‌ చెప్పాల్సింది నా అభిమానులకే! క్రికెట్ అయినా.. క్రికెటర్లు అయినా... మీ మద్దతు లేకుండా ఏదీ సాధ్యం కాదు’’ అని దినేశ్‌ కార్తిక్‌ సుదీర్ఘ నోట్‌ రాశాడు.2004లో అరంగేట్రంతమిళనాడు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది.. ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు.మొత్తంగా 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన డీకే 3463 పరుగులు చేశాడు. 172 డిస్మిసల్స్‌లో భాగమయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్‌! అరుదైన రికార్డులు.. దటీజ్‌ డీకే!

Lok Sabha Elections Exit Poll 2024 Live Updates:BJPVsINDIA
ఢిల్లీ పీఠం ఎవరిది..? ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం..

సాక్షి,న్యూఢిల్లీ: సుదీర్ఘంగా నలభై రోజులకుపైగా జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ శనివారం(జూన్‌1) సాయంత్రం 6 గంటలకు ముగిసింది.అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న2024 పార్లమెంట్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. తుది, ఏడవ విడత పోలింగ్‌ ముగిసిన వెంటనే టీవీ ఛానళ్లు, ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు రిలీజ్‌ చేశాయి. రిపబ్లిక్‌ టీవీ- మ్యాట్రిజ్‌ఎన్‌డీఏ-354ఇండియా-153ఇతరులు-30మొత్తం -543ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా ఇప్పటికి ప్రకటించినవి -463ఎన్‌డీఏ -294-329ఇండియా- 123-154ఇతరులు- 8-20మొత్తం సీట్లు-543ఎన్డీటీవీఎన్‌డీఏ-365ఇండియా-142ఇతరులు -36జన్‌కీ బాత్‌ ఎన్‌డీఏ-362-392ఇండియా-141-161ఇతరులు -10-20న్యూస్‌ నేషన్‌ ఎన్‌డీఏ-340-378ఇండియా-153-169ఇతరులు -21-23దైనిక్‌ భాస్కర్‌ఎన్‌డీఏ-281-350ఇండియా-145-201ఇతరులు -33-49

Telangana Lok Sabha Elections Exit Poll 2024 Live Updates
Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌: ఊహించని ఫలితాలు

తెలంగాణ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైంది. బీఆర్‌ఎస్‌ కు నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి. ఆరా మస్తాన్‌ సర్వేఆరా మస్తాన్‌ సర్వే ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటాపోటీగా సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం​.. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్‌ఎస్‌కు 0 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు స్పష్టం చేసింది.పోల్‌ లాబొరేటరీపోల్‌ లాబొరేటరీ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.. కాంగ్రెస్‌ 8-10, బీజేపీ 5-7 స్థానాలు గెలవబోతోంది. బీఆర్‌ఎస్‌ 0-1, ఎంఐఎం 1 స్థానం దక్కించుకోబోతున్నాయి.ఇండియా టుడేఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌కి 6-8, బీజేపీకి 8-10, బీఆర్‌ఎస్‌ 0-1, ఎంఐఎం 1 స్థానం వస్తాయని పేర్కొంది.పోల్‌ స్టార్ట్‌బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్‌ఎస్‌కు 0-1 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు పోల్‌ స్టార్ట్‌ స్పష్టం చేసింది.పార్థ చాణక్యపార్థ చాణక్య ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపింది. ఈ పార్టీ అత్యధికంగా 9-11 సీట్లు, బీజేపీ 5-7, బీఆర్‌ఎస్‌ 0, ఎంఐఎం 1 స్థానం సాధించబోతున్నట్లు పేర్కొంది.ఆపరేషన్‌ చాణక్య ఆపరేషన్‌ చాణక్య ప్రకారం.. కాం‍గ్రెస్‌ 7, బీజేపీ 8, బీఆర్‌ఎస్‌ 0, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నాయి.టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాటైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీకి అధిక స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ 7-10 సీట్లు, కాంగ్రెస్‌ 5-8, బీఆర్‌ఎస్‌ 2-5, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటాయని స్పష్టం చేసింది.ఏబీపీ సీ ఓటర్‌ఏబీపీ సీ ఓటర్‌ సర్వే అయితే కాంగ్రెస్‌, బీజేపీ సమానంగా సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 7-9, బీజేపీకి కూడా 7-9 సీట్లు వస్తాయని చెబుతోంది. బీఆర్‌ఎస్‌ ఖాతా తెరవదని, ఎంఐఎం ఒక గెలుచుకుంటుందని తెలిపింది.న్యూస్‌ 24న్యూస్‌ 24 ప్రకారం కాంగ్రెస్‌కు 5, బీజేపీకి 11, బీఆర్‌ఎస్‌కి 0, ఎంఐఎంకి 1 సీటు రాబోతున్నాయి.ఎక్కడా కనిపించని కారు జోరుతెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో కారు జోరు పెద్గగా కనబడలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులు భావించినా వారికి నిరాశే ఎదురైట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్ని బట్టి అర్థమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు ప్రజలు మొగ్గుచూపిట్లు తెలుస్తోంది.

Kcr Open Letter To Cm Revanth Reddy
దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ దూరం.. రేవంత్‌కు బహిరంగ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్‌ఎస్‌ పాల్గొనదని మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేసీఆర్‌..ప్రభుత్వం పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని మీరు నాకు ఆహ్వానం పంపారు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని అమరుల త్యాగాల పర్యావసానమని కాకుండా కాంగ్రెస్ దయాభిక్షంగా ప్రచారం చేస్తున్న మీ భావదారిద్య్రాన్ని నేను మొదట నిరసిస్తున్నానని లేఖల పేర్కొన్నారు.‘‘1969 నుంచి 5 దశాబ్దాలు భిన్న దశలలో భిన్న మార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది వాస్తవం ఇది సత్యం. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 369 మంది ఉక్కుపచ్చలారని యువకులు కాల్చి చంపిన కాంగ్రెస్ దమననీతికి సాక్ష్యమే గన్ పార్క్ అమరవీరుల స్థూపం. ఆ స్థూపాన్ని కూడా ఆ స్థూపాన్ని కూడా ఆవిష్కరించుకొని ఇవ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కషత్వం తెలంగాణ చరిత్ర పుటలలో నిలబడిపోతుంది. మలిదశ ఉద్యమంలో వందలాదిమంది యువకులు ప్రాణాలు బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీ దే’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వ్యక్తీకరణ నించింది తెలంగాణ వాదాన్ని తిరుగులేని రాజకీయం శక్తిగా మలిచింది. తెలంగాణ స్వరాష్ట్రం కోసం మా పదవులను సైతం త్రుణప్రాయంగా వదిలేశాం. మీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తీరోగమన దిశలో వెళ్తోంది’’ అని కేసీఆర్‌ లేఖలో మండిపడ్డారు.‘‘తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్దీజ్ఞ ఉత్తేజ కరమైన సందర్భమే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతున్న ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో నేను పాల్గొనడం సమంజసం కాదని టిఆర్ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు తెలంగాణ వాదుల అభిప్రాయంగా ఉంది. పైన పేర్కొన్న కారణాల విద్య ప్రజా జీవితాన్ని క్రమక్రమంగా కల్లోలం లోకి నెట్టుతున్న మీ పాలనను మిమ్మల్ని ప్రశ్నించేవాళ్లు అడుగడుగున అవమానిస్తూ దాడులు చేస్తున్న మీ వైఖరిని నిరసిస్తున్నాం. ఇందుచేత రేపటి దశాబ్ది ఉత్సవాలలో నేను పాల్గొనడం లేదు’’ అంటూ లేఖలో కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Directors and Producer Hit Combination Repeat in Tollywood
లెక్క కుదిరింది

కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ (డైరెక్టర్‌)కి, షిప్‌ ఓనర్‌ (ప్రోడ్యూసర్‌)కి మధ్య మంచి రిలేషన్‌ ఉండాలి. షిప్‌ (సినిమా)ని జాగ్రత్తగా హ్యాండిల్‌ చేసి, యజమాని నష్టపోకుండా కెప్టెన్‌ చూసుకుంటే.. ఇక అతనికి, యజమానికీ మధ్య మంచి అవగాహన కుదురుతుంది. మళ్లీ మళ్లీ కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు.అలా లెక్కలు కుదిరి కొన్ని కాంబినేషన్లు రిపీట్‌ అవుతున్నాయి. ఇలా ఓ దర్శకుడికి–నిర్మాతకి మధ్య స్నేహం కుదరడం, మళ్లీ కలిసి సినిమాలు చేయాలనుకోవడం ఓ ఆరోగ్యకరమైన వాతావరణం అని చెప్పాలి. రిపీట్‌ అవుతున్న ఆ దర్శక–నిర్మాతల కాంబినేషన్‌ గురించి తెలుసుకుందాం. ‘దిల్‌’ రాజు, అనిల్‌ రావిపూడిమూడోసారి ‘దిల్‌’ కలిసిందికుటుంబ నేపథ్యంలో సినిమాలు తీసి విజయాలు అందుకునే నిర్మాతగా ‘దిల్‌’ రాజుకి పేరుంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా సినిమా తెరకెక్కించగల దర్శకుడు అనిల్‌ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్‌లో సుప్రీమ్‌ (2016), ‘రాజా ది గ్రేట్‌’ (2017), ‘ఎఫ్‌ 2’ (2019), ‘సరిలేరు నీకెవ్వరు’ (2020), ‘ఎఫ్‌ 3’ (2022) వంటి హిట్‌ సినిమాలు వచ్చాయి. తాజాగా అనిల్‌–‘దిల్‌’ రాజు కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇందులో వెంకటేశ్‌ హీరో. హిట్‌ చిత్రాలు ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ తర్వాత వెంకటేశ్‌–అనిల్‌ రావిపూడి–‘దిల్‌’ రాజు కాంబినేషన్‌లో రూపొందనున్న మూడో చిత్రమిది. ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్‌ అనుకుంటున్నారట. రవిశంకర్, నవీన్, సుకుమార్‌గురు–శిష్యులతో మైత్రీడైరెక్టర్‌ సుకుమార్‌–మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2018). రామ్‌చరణ్, సమంత జోడీగా నటించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుకుమార్‌–మైత్రీ కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’ (2021). అల్లు అర్జున్, రష్మికా మందన్న జోడీగా నటించిన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా సుకుమార్‌–నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప 2: ది రూల్‌’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనూ అల్లు అర్జున్, రష్మికానే జోడీగా నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.∙సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సనాని దర్శకునిగా పరిచయం చేస్తూ వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి జంటగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘ఉప్పెన’ (2021) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన రెండో చిత్రాన్ని కూడా మైత్రీలోనే చేస్తున్నారు బుచ్చిబాబు. రామ్‌చరణ్‌ హీరోగా నవీన్, రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. సునీల్, రామ్మోహన్‌ రావు, శేఖర్‌ కమ్ములశేఖర్‌తో మరో సినిమాప్రేమకథలే కాదు.. కుటుంబ కథలనూ తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఆయన ప్రస్తుతం ధనుష్, నాగార్జున హీరోలుగా ‘కుబేర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ (ఏషియన్‌ గ్రూప్‌), అమిగోస్‌ క్రియేషన్స్ పై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. కాగా శేఖర్, సునీల్‌ నారంగ్, రామ్మోహన్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న రెండో చిత్రం ఇది. ఈ కాంబినేషన్‌లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన ‘లవ్‌ స్టోరీ’ (2021) సూపర్‌ హిట్టయింది. నాగ్‌ అశ్విన్, ప్రియాంక, అశ్వినీదత్, స్వప్నహోమ్‌ బేనర్‌లో నాగ్‌ అశ్విన్‌ఇంట్లోనే ఒక పెద్ద బేనర్‌ ఉంటే బయట బేనర్ల అవసరం అంతగా ఉండదు. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌కి రెండు హోమ్‌ బేనర్లు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్‌ ఉన్నాయి. అశ్వినీదత్‌ రెండో కుమార్తె ప్రియాంక, నాగ్‌ అశ్విన్‌ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌పై అశ్వినీదత్, స్వప్న సినిమాస్‌పై ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బేనర్లలో ‘ఎవడే సుబ్రమణ్యం’ (2015), ‘మహా నటి’ (2018) సినిమాలకు దర్శకత్వం వహించారు నాగ్‌ అశ్విన్‌. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ నిర్మించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్‌ హీరోగా సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ నెల 27న రిలీజ్‌ కానుంది. నాగవంశీ, వెంకీసార్‌తో ఆరంభమై లక్కీతో మళ్లీ...డైరెక్టర్‌ వెంకీ అట్లూరి, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘సార్‌’ (తమిళంలో వాత్తి). ధనుష్, సంయుక్తా మీనన్‌ జంటగా సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ దర్శక–నిర్మాతల కాంబినేషన్‌లో తాజాగా ‘లక్కీ భాస్కర్‌’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్ , మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబరు 27న రిలీజ్‌ కానుంది. శ్రీకాంత్‌ చెరుకూరి, శ్రీకాంత్‌ ఓదెలహీరో కూడా రిపీట్‌శ్రీకాంత్‌ ఓదెల దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘దసరా’ (2023). తొలి చిత్రంతోనే నానీని దర్శకత్వం వహించే చక్కని అవకాశం అందుకుని సద్వినియోగం చేసుకున్నారు. నాని, కీర్తీ సురేష్‌ జోడీగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ‘దసరా’ కాంబినేషన్‌లోనే మరో సినిమా రానుంది. నాని కెరీర్‌లో ఇది 33వ చిత్రం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తారు. టీజీ విశ్వప్రసాద్, కార్తీక్‌ రెండోసారి రెండు భాగాలతో... ‘ఈగల్‌’ చిత్రం తర్వాత డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని–పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో ‘మిరాయ్‌’ సినిమా రూపొందుతోంది. రవితేజ, అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్‌ హీరో, హీరోయిన్లుగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ‘ఈగల్‌’ ఈ ఏడాది విడుదలైంది. ప్రస్తుతం కార్తీక్‌–విశ్వప్రసాద్‌ కాంబినేషన్‌లో ‘మిరాయ్‌’ చిత్రం రూపొందుతోంది. తేజ సజ్జా, రితికా నాయక్‌ జంటగా నటిస్తున్న ‘మిరాయ్‌’లో మంచు మనోజ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి భాగం 2025 ఏప్రిల్‌ 18న రిలీజ్‌ కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2డీ, 3డీ వెర్షన్లలోనూ రిలీజ్‌ కానుంది. ప్రశాంత్‌ వర్మ, నిరంజన్‌ రెడ్డిఈసారి ‘జై హనుమాన్‌’తో...సంక్రాంతి అంటే స్టార్‌ హీరోల చిత్రాల పోటీ ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి స్టార్‌ హీరోల సినిమాలతో పోటీ పడి, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ అయిన చిత్రం ‘హనుమాన్‌’. తేజ సజ్జా హీరోగా ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించారు. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ అయింది. ఇక ‘హనుమాన్‌’కి సీక్వెల్‌గా ప్రశాంత్‌ వర్మ–చైతన్య–నిరంజన్‌ రెడ్డి కాంబినేషన్‌లో ‘జై హనుమాన్‌’ రూపొందుతోంది. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది.వీరే కాదు.. మరికొందరు దర్శక–నిర్మాతల కాంబినేషన్స్‌ కూడా రిపీట్‌ అవుతున్నాయి.

Buzz: Sukumar Plan To Change Pushpa 2 Movie Climax
సుకుమార్‌ షాకింగ్‌ నిర్ణయం.. షాక్‌లో బన్నీ ఫ్యాన్స్‌!

ఆగస్ట్‌ 15.. బన్నీ ఫ్యాన్స్‌కి నిజంగా పండగ రోజే. అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ మూవీ అదే రోజు రిలీజ్‌ కాబోతుంది. ‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఇండియన్‌ బాక్సాఫీస్‌ షేక్‌ చేసిన ‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా రాబోతుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్‌ ఈ మూవీపై మరింత ఆసక్తిని పెంచేలా చేశాయి. అయితే విడుదల తేది దగ్గర పడినా.. ఇంకా షూటింగ్‌ పూర్తికాకపోవడం బన్నీ అభిమానుల్ని కలవరపెడుతోంది. ముందు చెప్పినట్లుగా ఆగస్ట్‌ 15న బొమ్మ పడుతుందా లేదా వాయిదా పడుతుందా అనే అనుమానాలు తల్లెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో డైరెక్టర్‌ సుకుమార్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్‌ని మార్చాలని భావిస్తున్నాడట.సాధారణంగా సుకుమార్‌ తన ప్రతి సినిమాకు రెండు క్లైమాక్స్‌లు ప్లాన్‌ చేస్తాడట. అలా పుష్ప 2 కోసం కూడా ఇప్పటికే రెండు క్లైమాక్స్‌లు సిద్ధం చేసుకున్నాడట. రెండింటిలో ఒకటి యాడ్‌ చేయాలని భావించాడట. అయితే ముందుగా అనుకున్న క్లైమాక్స్‌లు కాకుండా వేరేది యాడ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 కి కొనసాగింపుగా పుష్ప 3 కూడా చేయాలనే ఆలోచన రావడంతో..క్లైమాక్స్‌ కూడా పార్ట్‌ 3కి సెట్‌ అయ్యేలా ప్లాన్‌ చేయబోతున్నాడట. ఒకవేళ అదే నిజమైతే సుకుమార్‌ మళ్లీ రీషూట్‌కి వెళ్తాడా? లేదా ఇప్పటికే ఫిక్స్‌ అయిన వాటి నుంచి బెస్ట్‌ క్లైమాక్స్‌ని యాడ్‌ చేస్తారా? అనేది తెలియాక ఫ్యాన్స్‌ టెన్షపడుతున్నారట. ఒకవేళ రీషూట్‌కి వెళ్తే మాత్రం పుష్ప 2 ఆగస్ట్‌ 15కి రిలీజ్‌ కావడం కష్టమే అని సినీ పండితులు చెబుతున్నారు. ఇప్పటికి కెవలం రెండు పాటలను మాత్రమే విడుదల చేశారు. ఇంకా నాలుగు పాటలను రిలీజ్‌ చేయాల్సి ఉంది. ఒక స్పెషల్‌ సాంగ్‌ షూటింగ్‌ కూడా చేయాలి. ఇలా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో క్లైమాక్స్‌ చేంజ్‌ అని వార్తలు వినిపించడం బన్నీ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కి జోడిగా రష్మిక నటించగా.. ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు.

Ksr Comments On Telangana And Andhra Pradesh Joint Capital Hyderabad
ఏపీకి హైదరాబాద్‌ అసలు ఎంత దూరం?

ఏపీ, తెలంగాణల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇక కొనసాగే అవకాశం లేనట్లేనా! బై బై చెప్పిసినట్లేనా! పంజాబ్, హర్యానాలకు చండీఘడ్ దశాబ్దాల తరబడి ఉమ్మడి రాజధానిగా ఉంటోంది. కానీ హైదరాబాద్‌ను మాత్రం ఏపీ ప్రజలు పదేళ్లకే వదలుకోకతప్పదన్న అభిప్రాయం కలుగుతోంది. ఏపీ మాత్రం మరో పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరుకుంటోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు సిద్ధపడడం లేదు. ఇప్పటికీ హైదరాబాద్‌లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీకి ఇంతవరకు కేటాయించిన లేక్ వ్యూ అతిథి గృహం వంటి భవనాలను తెలంగాణ తీసేసుకుంటుందన్నమాట.అలాగే తెలంగాణలోని వైద్య కాలేజీలలో ఉన్న అన్ రిజర్వుడ్ కోటా సీట్లను ఇకపై కేవలం తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదే రూల్ ఏపీకి కూడా వర్తిస్తుంది. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల కోసం పదిహేను శాతం సీట్లను ఉంచారు. వాటికి ఎవరైనా పోటీపడవచ్చు. ఏపీ విద్యార్థులకు దక్కకుండా అన్నీ సీట్లను తెలంగాణకే ఇవ్వాలని ఆయన అంటున్నారు. నిజానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ సాంకేతికంగా కొనసాగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక విభజన అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. దీనిపై చొరవ చూపవలసిన కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా సమావేశాలు జరుపుతూ కాలయాపన చేసింది తప్ప, చిత్తశుద్ధితో నిర్ణయాలు చేయలేకపోయింది. దానికి కారణం రాజకీయాలే అని చెప్పాలి.తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రెండిటికి రాజకీయ ప్రయోజనాలున్నాయి. ఇక్కడ మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌తో పాటు ఈ రెండు పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. అందువల్ల తెలంగాణ యాంగిల్‌లోనే వీరు ఆలోచిస్తున్నారు తప్ప ఏపీని పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. పొరపాటున తెలంగాణ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని ఏపీతో తగాదా లేకుండా చేసుకుంది అనుకోండి.. వెంటనే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తెలంగాణకు అన్యాయం జరిగిందని రాజకీయం చేస్తున్నాయి. ఉదాహరణకు కృష్ణా నది జలాలపై ఎంత రగడ చేశారో చూడండి. రాయలసీమకు వరద జలాలను తరలించినా, తెలంగాణకు నష్టం జరుగుతున్నట్లుగా వివిధ పార్టీలు విమర్శలు చేశాయి. చివరికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద సీఆర్‌పీఎఫ్‌తో కాపలా పెట్టవలసి వస్తోంది. ఆరు నెలల క్రితం ఏపీ ప్రభుత్వం బలవంతంగా తనకు రావల్సిన నీటి కోటాను తీసుకువెళ్లింది కనుక సరిపోయిందికానీ, లేకుంటే ఏపీకి నీళ్లు రావడమే కష్టం అయ్యేదేమో! నదీజలాల యాజమాన్య బోర్డులున్నా.. వాటికున్న అధికారాలు అంతంతమాత్రమేనని చెప్పాలి. ఈ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి ఏపీ సిద్ధపడినా, తెలంగాణ వెనుకడుగు వేస్తోంది. దానికి కారణం రాజకీయ విమర్శలు వస్తాయన్న భయంతోనే. పైగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలు మొత్తం తమకే కేటాయించాలన్నంతగా డిమాండ్ పెట్టింది. ట్రిబ్యునల్ నదిలో 811 టీఎమ్‌సీల నీరు పారుతుందని అంచనా వేస్తే, తెలంగాణ ప్రభుత్వం 798 టీఎమ్‌సీల నీరు తమకే అవసరం అని చెబుతోంది. ఒకపక్క నదిలో వరదలు తగ్గుతున్నాయి. ఇంకో పక్క రెండు రాష్ట్రాలు తమ వాస్తవ అవసరాల ప్రాతిపదికన కాకుండా రాజకీయాల దృష్టితో బేసిస్ నీటి వాటాను కోరుతున్నాయి. ఉమ్మడి ఏపీ విభజన సమయంలో ఏపీకి రాజధాని లేదు కనుక హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా వాడుకోవచ్చని నిర్ణయించారు. ఆ టైమ్‌లో కొందరు ఎంపీలు చండీఘడ్ మాదిరి సుదీర్ఘకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. 2014 లో విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా అదే తీరులో హైదరాబాద్‌లో ఉన్నారు. సచివాలయ భవనాలకు వందల కోట్లు వెచ్చించారు. ఎవరైనా అడిగితే హైదరాబాద్ రాజధానిగా చాలాకాలం ఉంటుందని అనేవారు. కానీ ఆయన ఓటుకు నోటు కేసులో పట్టుబడడంతో టీఆర్ఎస్‌తో రాజీలో భాగంగా హైదరాబాద్‌ను వదలి ఏపీకి వెళ్లిపోయారు. దాంతో మొత్తం పరిస్థితి తలకిందులైంది.ఏపీ ప్రజలు దీనివల్ల బాగా నష్టపోయారు. ఆ కేసు సమయంలో చంద్రబాబు ఏకంగా హైదరాబాద్‌లో కేసులు పెట్టే అధికారం తమకు కూడా ఉంటుందన్నంతవరకు వివాదాస్పదంగా మాట్లాడారు. ఆయన రాత్రికి రాత్రే పెట్టె, బెడ సర్దుకుని వెళ్లడంతో సచివాలయ భవనాలన్నీ వృధా అయిపోయాయి. ఆ బిల్డింగ్‌లు పాడైపోతున్నందున తమకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరితే ప్రస్తుత ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ వాడుతున్న ఇతర భవనాలను స్వాధీనం చేయాలని కోరుతోంది. దీనివల్ల హైదరాబాద్‌లో ఏపీకి స్టేక్ లేకుండా పోతుంది. హైదరాబాద్ ఉమ్మడి ఏపీ ప్రజలు అంతా కలిసి అభివృద్ది చేసుకున్న నగరం. కానీ ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం అవడం వల్ల ఏపీ ప్రజలకు నష్టం జరగవచ్చు. విభజన సమయంలో మాబోటి వాళ్లం ఏపీకి హైదరాబాద్‌లో విద్య, ఉపాధి, నివాస అవకాశాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా చట్టం ఉండాలని సూచించినా, రాజకీయ పార్టీలు పట్టించుకోలేదు. దాని ఫలితంగా విద్యపరంగాకానీ, ఉపాధి అవకాశాలలో కానీ మున్ముందు ఏపీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణకు నష్టం చేయాలని, ఇక్కడ ప్రజలకు అన్యాయం జరగాలని ఎవరూ కోరడం లేదు. కానీ ఏపీకి న్యాయం జరగాలన్నదే అందరి అభిప్రాయం. హైదరాబాద్‌లో కానీ, ఇతరత్రా కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ఉదాహరణకు ఆర్టీసీ ఆస్తులు రెండురాష్ట్రాలకు వర్తిస్తాయి. ఆ ఆస్తుల విభజన ఇంకా జరగలేదు. అలాగే ఇతర సంస్థల ఆస్తులు కూడా పెండింగులోనే ఉన్నాయి. బ్యాంకులలో కూడా ఉమ్మడి ఖాతాలలో డబ్బు ఉంది. దానిపై వివాదం వస్తే ఏపీ తెలుగు అకాడమీ సుప్రింకోర్టువరకు వెళ్లి తన వాటాను సాధించుకుంది.అలాగే ఇతర సంస్థల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను పంచవలసి ఉంటుంది. మొత్తం సుమారు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఏపీకి రావాలన్నది ఒక అంచనా. అది తేలలేదు. ప్రభుత్వరంగ సంస్థల విషయం పరిష్కారం కాలేదు. ఉద్యోగుల విభజనపై విద్యుత్ బోర్డు వంటి సంస్థలలో ఏళ్ల తరబడి కోర్టులలో కేసులు సాగాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగకపోతే, ఏపీకి హైదరాబాద్ పూర్తిగా పరాయిదైపోతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుందా అనే సందేహం ఉంది. దానికి కారణం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని నిర్ణయిస్తే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు పెద్ద దుమారం లేవదీస్తాయి. దానివల్ల బీజేపీకి తెలంగాణలో నష్టం జరుగుతుందన్న భయం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా ఈ విషయంలో నోరు మెదపకపోవచ్చు. ఎందుకంటే వారికి తెలంగాణలో అధికారం ఉంది. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా రావడం లేదు కనుక. పైగా ఈ రెండు పార్టీలకు ఏపీలో ఉన్న ఓట్లు ఒకశాతం లోపే. ఏపీ లోని పార్టీలు దీనిపై ఎంతవరకు డిమాండ్ చేస్తాయో చూడాలి.అధికార వైఎస్సార్‌సీపీ దీనిపై కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసిందని సమాచారం. ప్రతిపక్ష టీడీపీ దీనిపై నోరు మెదిపే అవకాశం తక్కువే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని బతిమలాడుకుని మళ్లీ టీడీపీ ఎన్‌డీఏలో చేరింది. అందువల్ల బీజేపీకి అసంతృప్తి కలిగించే ప్రత్యేక హోదాతో సహా ఏ డిమాండ్లు ఏవీ టీడీపీ పెట్టదు. కాంగ్రెస్, బీజేపీల ఏపీ శాఖలు కూడా దీనిపై నోరెత్తకపోవచ్చు. ఈ పరిస్థితి తెలంగాణకు అడ్వాంటేజ్‌గా మారుతుంది. ఏపీకి నష్టం కలిగినా ఏమి చేయలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని చెప్పకతప్పదు. కానీ ధర్మంగా అయితే మరో పదేళ్లు లేదా విభజన సమస్యలు పరిష్కారం అయ్యేవరకైనా ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం అవశ్యం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement