Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Exit Polls 2024: Rewind 2019 Exit Polls Details
ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: అంచనాలకు మించి ఆనాడు..

జూన్‌ 4వ తేదీనాటి ప్రజాతీర్పు కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల ఫలితాల హ్యాష్‌ ట్యాగులు ఎక్స్‌(పూర్వపు ట్విటర్‌)లో ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం వెలువడబోయే ఎగ్జిట్‌ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చా నడుస్తోంది. ఇక.. 2019 ఏపీ సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల నాటి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు.. 2019 మే 23వ తేదీ వెలువడ్డ ఫలితాలతో పోలిస్తే.. ఆ అంచనాలు ఎంత వరకు ఫలించాయో పరిశీల్తిస్తే.. 2019 మే 19 సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో ఎక్కువ సర్వే సంస్థలు లోక్‌సభ, అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపించాయి. ఒకటి రెండు సర్వే సంస్థలు తప్పించి.. లోక్‌సభ స్థానాల్లో 20కి దగ్గర్లో వస్తాయని ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పింది. వాటిల్లో.. 👉లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది. టీడీపీ​కి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలిపింది.👉 ఆరా మస్తాన్‌ సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీకి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని తెలిపింది. టీడీపీకి 1 నుంచి 5 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.👉 టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల ప్రకారం వైఎస్సార్‌సీపీకి 18 సీట్లు టీడీపీకి 7 సీట్లు రావొచ్చని అంచనా.👉 న్యూస్‌ 18- ఐపీఎస్‌ఓఎస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైఎస్సార్‌సీపీకి 13 నుంచి 14 సీట్లు వస్తాయి. టీడీపీ 10 నుంచి 12 సీట్లు దక్కించుకుంటుంది.లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనా.. అంతకు మించే ఫలించింది. 25 స్థానాలకుగానూ 22 పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకుని విజయ దుందుభి మోగించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని, అలాగే ఏపీ ఎన్నికల్లో తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి. ఇక పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. 👉 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 133 నుంచి 135 వరకు సీట్లు వస్తాయని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌(సీపీఎస్‌) అంచనా వేసింది. టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు దక్కే అవకాశముందని పేర్కొంది. జనసేన పార్టీకి ఒక స్థానం రావొచ్చని తెలిపింది.👉 వైఎస్సార్‌సీపీకి 112, టీడీపీ 59, జనసేనకు 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పీపుల్స్‌ పల్స్‌ సర్వే వెల్లడించింది. వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 21 లోక్‌సభ స్థానాలు గెల్చుకునే అవకాశముందని తెలిపింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు దక్కనున్నాయని అంచనా కట్టింది. జనసేనకు ఒక స్థానం రావొచ్చని తేల్చింది.👉 ఆరా మస్తాన్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీకి 126 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 47, జనసేన పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది.👉 వీడీపీ అసోసియేట్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైఎస్సార్‌సీపీకి 111 నుంచి 121 సీట్లు వస్తాయి. టీడీపీకి 54 నుంచి 64 స్థానాలు దక్కుతాయి. జనసేనకు 4 సీట్లు వచ్చే అవకాశముంది.👉 ఐపల్స్‌ సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీకి 110 - 120, టీడీపీకి 56 - 62, జనసేన పార్టీ 0 - 3 స్థానాలలో విజయం సాధిస్తాయి.👉 కేకే సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీ 130 - 135, టీడీపీ 30 - 35, జనసేన పార్టీ 10 - 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి👉 మిషన్‌ చాణక్య సర్వే ప్రకారం వైఎస్సార్‌సీపీ 98 స్థానాల్లో, టీడీపీ 58 స్థానాల్లో, జనసేన పార్టీ 7 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధిస్తారని అంచనా వేశారు. ఇక్కడా ఆ అంచనాలు మించాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ 151 సీట్లు సాధించి.. చరిత్ర సృష్టిస్తూ సీఎం జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ అధికారాన్ని కైవసరం చేసుకుంది. మరి ఈసారి ప్రతిపక్షం కూటమిగా పోటీ చేసింది. వైఎస్సార్‌సీపీ సంక్షేమ పాలన నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. చూద్దాం.. సాయంత్రం రాబోయే ఎగ్జిట్‌ ఫలితాలు ఎలా ఉంటాయో!.

Lok Sabha Elections 2024 Phase 7 Voting Live Updates
లోక్‌సభ ఎన్నికల తుది దశలో కొనసాగుతున్న పోలింగ్‌

Lok Sabha Election 2024 Phase 7 Updates..👉ఎన్నికల్లో ఓటు వేసిన బీహార్‌ సీఎం నితిశ్‌ కుమార్‌. భక్తియార్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆయన వేశారు.#WATCH | Bihar CM Nitish Kumar leaves after casting his vote at a polling booth in Bakhtiyarpur. #LokSabhaElections2024 pic.twitter.com/2qogPy72zU— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన జమ్మూ కశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా. యూపీలోని గాజీపూర్‌లో వేశారు. #WATCH | Uttar Pradesh | Jammu and Kashmir Lieutenant Governor Manoj Sinha casts his vote for #LokSabhaElections2024 in Mohanpura village, Ghazipur. pic.twitter.com/LV5N4AoNjU— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన శిరోమణి అకాళీదల్‌ ప్రెసిడెంట్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, ఎస్‌ఏడీ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌. ఫిరోజ్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో వీరు ఓటు వేశారు. #WATCH | Sri Muktsar Sahib, Punjab: Shiromani Akali Dal (SAD) leader Harsimrat Kaur Badal casts her vote at a polling booth in Badal village under the Firozpur Lok Sabha constituency SAD has fielded Nardev Singh Bobby Mann from this seat. BJP has fielded Gurmit Singh Sodhi,… https://t.co/BhwLlKUElF pic.twitter.com/FGxN45jioQ— ANI (@ANI) June 1, 2024 👉పోలింగ్‌ వేళ బెంగాల్‌లో ఉద్రిక్తతలు..సౌత్‌ పరగాణా-24లో పోలింగ్‌ బూత్‌ వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌ను మురికి కాల్వలో పడేసిన దుండగులు. VIDEO | Lok Sabha Elections 2024: EVM and VVPAT machine were reportedly thrown in water by a mob at booth number 40, 41 in Kultai, South 24 Parganas, #WestBengal. (Source: Third Party)#LSPolls2024WithPTI #LokSabhaElections2024 pic.twitter.com/saFiNcG3e4— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు వేసిన పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌. VIDEO | Lok Sabha Elections 2024: Punjab CM Bhagwant Mann interacts with media after casting vote.#LSPolls2024WithPTI #LokSabhaElections2024(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/1YxNaPwBQ5— Press Trust of India (@PTI_News) June 1, 2024 VIDEO | Lok Sabha Elections 2024: "I hope there will be record voting. I am confident that the excitement in the seventh phase will be more that what we have witnessed in the last six phases of elections. There will be bumper voting and then later bumper victory," says Anurag… pic.twitter.com/RbDCOPjfY4— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న కంగనా రనౌత్‌. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.VIDEO | Lok Sabha Election 2024: "I want to appeal to everyone to exercise their Constitutional rights and participate in this festival of democracy," says actor and BJP candidate from Himachal Pradesh's Mandi seat Kangana Ranaut (@KanganaTeam) after casting vote.… pic.twitter.com/7womwYt3xV— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు వేసిన బీజేపీ నేత తరుణ్‌చుగ్‌. పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. VIDEO | Lok Sabha Elections 2024: "We have been given the right by the Constitution to choose who will rule for the next five years and who will decide the country's strategies. We should all exercise this right. I am feeling very proud and happy that I have come here along with… pic.twitter.com/zSElxK3PEd— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 తొమ్మిది గంటల వరకు 11.31 శాతం పోలింగ్‌ నమోదు.. ఢిల్లీ:చివరి విడతలో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 9 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 11.31బీహార్(8)-10.58ఛండీఘడ్(1)-11.64హిమాచల్ ప్రదేశ్(4)-14.35జార్ఖండ్(3)-12.15ఒడిస్సా(6)- 7.69పంజాబ్(13)-9.64ఉత్తరప్రదేశ్ (13)- 12.94పశ్చిమ బెంగాల్( 9)- 12.63 👉 ఓటు హక్కు వినియోగించుకున్న హిమాచల్‌ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా. గోరఖ్‌పూర్‌లో ఓటు వేసిన శుక్లా. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. #WATCH | Uttar Pradesh: After casting his vote in Gorakhpur, Himachal Pradesh Governor Shiv Pratap Shukla says, "I have cast my vote today. All the voters should cast their votes today and vote for a government that can carry forward development work..."#LokSabhaElections2024 pic.twitter.com/WFVlID9xh3— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన లాలూ ఫ్యామిలీ. సరన్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీదేవీ, ఆర్జేజీ అభ్యర్థి రోహిణీ ఆచార్య. #WATCH | Bihar: RJD chief Lalu Prasad Yadav, Rabri Devi and their daughter & party candidate from Saran Lok Sabha seat Rohini Acharya leave from a polling booth in Patna after casting their vote. #LokSabhaElections2024 pic.twitter.com/LTmGnXM4BH— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన సిక్కిం గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య. యూపీలో వారణాసిలోని రామ్‌నగర్‌లో ఆచార్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Uttar Pradesh | Sikkim Governor Lakshman Prasad Acharya says, "I am happy to take part in this festival of democracy. I think that voting is a duty along with being a constitutional right and everyone should perform their duty and exercise their right..." https://t.co/qwNLm28hP9 pic.twitter.com/V2EMlKNxMu— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ క్రికెటర్‌, ఆప్‌ ఎంపీ హర్బజన్‌ సింగ్‌. జలంధర్‌లోని పోలింగ్‌ బూత్‌ ఓటు వేసిన బజ్జీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఓటు వేయడం మన బాధ్యత అని కామెంట్స్‌ చేశారు. #WATCH | Punjab: Former Indian cricketer and AAP Rajya Sabha MP Harbhajan Singh casts his vote at a polling booth in Jalandhar#LokSabhaElections2024 pic.twitter.com/Ph55BxqFbp— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రవి కిషన్‌. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌ వేసిన రవి కిషన్‌, ఆయన కుటుంబ సభ్యులు. #WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Gorakhpur, Ravi Kishan & his wife Preeti Kishan cast their votes at a polling booth in the constituency. The Gorakhpur seat sees a contest amid BJP's Ravi Kishan, SP's Kajal Nishad and BSP's Javed Ashraf.#LokSabhaElections2024 pic.twitter.com/bTC51NMa3E— ANI (@ANI) June 1, 2024 👉ఓటు హక్కు వినియోగించుకున్న యూపీ సీఎం యోగి ఆద్యితనాథ్‌. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన యోగి. గోరఖ్‌పూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో రవి కిషన్‌. #WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath casts his vote at a polling booth in Gorakhnath, Gorakhpur.The Gorakhpur seat sees a contest amid BJP's Ravi Kishan, SP's Kajal Nishad and BSP's Javed Ashraf. #LokSabhaElections2024 pic.twitter.com/2Ao7uC7slU— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా #WATCH | BJP national president JP Nadda cast his vote at a polling booth in Bilaspur, Himachal Pradesh. His wife Mallika Nadda also cast her vote here. #LokSabhaElections2024 pic.twitter.com/7XZC3pU2zw— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా..👉 ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన రాఘవ్‌ చద్దా.. #WATCH | After casting his vote for the seventh phase of #LokSabhaElections2024, AAP MP Raghav Chadha says, "Today is the grand festival of India...Every vote by the citizen will decide the direction & condition of the country...I request everyone to exercise their right to… pic.twitter.com/tBqPTEdBci— ANI (@ANI) June 1, 2024 👉 చివరి దశలో 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. Voting for the seventh - the last - phase of #LokSabhaElections2024 begins. Polling being held in 57 constituencies across 8 states and Union Territories (UTs) today.Simultaneous polling being held in 42 Assembly constituencies in Odisha. pic.twitter.com/BkcIZxkmYC— ANI (@ANI) June 1, 2024 👉 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్‌ ప్రారంభమైంది. 👉 కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌పాటు బీహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. 👉 వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్‌ కొనసాగుతోంది. అంతేకాకుండా బీహార్‌లో ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి, బెంగాల్‌లో ఒకటి, హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నిక జరుగుతోంది.👉 చివరి విడతలోని 57 లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. అంటే సగానికి పైగా ఎన్డీయే సిట్టింగ్‌ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా మొత్తం ఏడు దశల్లోని 543 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ జూన్‌ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ జూన్‌ 2న ప్రారంభమవుతుంది.

Do not Run Away: Amit Shah Mocks Congress Over Exit Poll Boycott
ఓడిపోతామని తెలిసి పారిపోతున్నారు: కాంగ్రెస్‌పై అమిత్‌ షా సెటైర్లు

న్యూఢిల్లీ: శనివారంతో ఏడు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియ‌నుంది. నేటి సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడనున​న్నాయి. ఈ క్రమంలో ఎగ్జిట్‌ పోల్స్‌ చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్‌ నిర్ణయంపై అధికార బీజేపీ సెటైర్లు వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతున్నామని కాంగ్రెస్‌ పార్టీకి ముందే తెలిసిందని విమర్శలు గుప్పించింది. అందుకే మీడియాకు, ప్రజలకు ముఖం చూపించలేక పారిపోతున్నారని మండిపడింది. ఎగ్జిట్ పోల్ డిబేట్‌లకు దూరంగా ఉండబోతున్నామంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ప్రకటనపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆ పార్టీ ప్రధాన వ్యూహకర్త, కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.ఈ మేరకు అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా .. ‘భారీ ఓటమి ఎదురవ్వబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీకి తెలుసు. మీడియా, ప్రజలకు ఏం ముఖం చూపిస్తారు? అందుకే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్‌కు దూరంగా పారిపోతోంది. కాంగ్రెస్ పార్టీ పారిపోవద్దు. ఓటమిని ఎదుర్కొని ఆత్మపరిశీలన చేసుకోవాలని నేను చెప్పదలచుకున్నాను’’ అని పేర్కొన్నారు.దేశంలో పురాతన పార్టీగా ఉన్న కాంగ్రెస్ చిన్న పిల్లల్లా ప్రవర్తించడం తగదని జేపీ నడ్డా విమర్శించారు, . తాను ఆడుకునే బొమ్మను ఎవరో లాగేసుకున్న తీరుగా హస్తం పార్టీ ధోరణి ఉందని, ప్రతిపక్షాల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ నుంచి ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వతను ఆశిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తాయనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్‌కు దూరంగా జరుగుతోందని ఆయన అన్నారు.

Pune Porsche Case: Mother of Accused Teen Arrested By Police
పుణే ఘటనలో అదిరిపోయే ట్విస్ట్‌

ముంబై: మహారాష్ట్ర పుణెలో ఓ టీనేజర్ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి ఇద్దరి మృతికి కారణమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ.. రోజుకొక అరెస్ట్‌తో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా టీనేజర్‌ను తప్పించేందుకు అతని కుటుంబం చేసిన ప్రయత్నాలు విస్తుగొల్పుతున్నాయి. తాజాగా ఈ కేసులో టీనేజర్‌ తల్లిని కూడా అరెస్ట్‌ చేశారు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు. విచారణ కోసం పిలిచిన ఆమెను.. శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు పోలీసులు. బ్లడ్ టెస్ట్ సమయంలో నిందితుడి రక్త నమూనాలు బదులుగా తనవి ఇచ్చినందుకే ఆమెను అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించారు. ప్రమాదం సమయంలో తన కుమారుడు తాగలేదని నిరూపించేందుకు ఆమె తన రక్తనమూనాలు ఇచ్చినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి డాక్టర్‌ తావ్‌డే, నిందితుడి తండ్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారని.. నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు భారీ నగదుతో డీల్‌ కుదిరిందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ క్రమంలోనే టీనేజర్ తల్లి శాంపిళ్లను బ్లడ్‌ టెస్ట్‌కు ఇచ్చినట్లు తేలింది. రక్త నమూనాలు ఇచ్చిన తర్వాత ఆమె ఆచూకీ లేకుండా పోయారు. అలాగే కొద్దిరోజుల క్రితం ఒక వీడియో సందేశం విడుదల చేసిన ఆమె.. తన కుమారుడిని రక్షించాలంటూ కన్నీరుపెట్టుకోవడం గమనార్హం. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు, శాంపిల్స్‌ను మార్చిన ఆరోపణలపై ఈ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు కోర్టుముందు ప్రవేశపెట్టనున్నారు. పుణే పోర్షే కారు కేసులో ఇప్పటికే నిందితుడి తండ్రి, తాత కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసును తనమీద వేసుకోమని తమ డ్రైవర్‌ను ఒప్పించేందుకు యత్నించారని, అతడు అంగీకరించకపోవడంతో కిడ్నాప్‌ చేసి ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలు వారిద్దరి అరెస్టుకు కారణమయ్యాయి. నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆ కుటుంబం పలువురు అధికారుల్ని ప్రలోభపెట్టేందుకు యత్నించడమూ దర్యాప్తులో వెలుగు చూసింది.

Democrats are amazed at ECs detached attitude
కవ్వించి.. కలబడాలి!

సాక్షి, అమరావతి: పోలింగ్‌ రోజు రాష్ట్రవ్యాప్తంగా సృష్టించిన విధ్వంస కుట్రలకు చంద్రబాబు మరింత పదును పెడుతున్నారు! అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను హైజాక్‌ చేసేందుకు పక్కా పన్నాగం పన్నుతున్నారు. ఓట్లు లెక్కించే జూన్‌ 4వతేదీన దాడులు, దౌర్జన్యాలు, హింసాకాండకు తెగబడేందుకు టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారు.ప్రధానంగా కౌంటింగ్‌ కేంద్రాల్లో కవ్వింపులకు దిగి ఘర్షణలతో ఉద్రిక్తత రేకెత్తించేందుకు పథకం రూపొందించారు. వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను కవ్వించి కౌంటింగ్‌ కేంద్రాల నుంచి బయటకు వెళ్లగొట్టడమే టీడీపీ దుష్ట పన్నాగం. అందరినీ ఏమార్చి ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడాలన్నదే చంద్రబాబు కుతంత్రం. పోస్టల్‌ బ్యాలెట్ల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు వరకు ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తూ పచ్చ ముఠాలు బరితెగించడం ఆందోళనకరంగా మారింది. ఈసీని ప్రభావితం చేసి తమ చెప్పుచేతల్లో నడుచుకునేలా నియమించుకున్న పోలీసు అధికారుల ద్వారా ఈ కుట్రలను అమలు చేసేందుకు చంద్రబాబు ఉద్యుక్తమైనట్లు స్పష్టమవుతోంది.ఎంతకైనా తెగించేందుకు వెనుకాడొద్దు..కౌంటింగ్‌ సందర్భంగా ఏదో ఒక సాంకేతిక అంశాన్ని సాకుగా చూపించి అధికారులతో వాగ్వాదంతోపాటు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లతో ఘర్షణకు దిగాలని టీడీపీ ఏజెంట్లకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. మొదట లెక్కించే పోస్టల్‌ బ్యాలెట్ల నుంచే ఈ వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించడం ద్వారా ఎంత పకడ్బందీగా కుట్ర పన్నారో స్పష్టమవుతోంది.మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈమేరకు చంద్రబాబు ఉపదేశించారు. ఇక సాధారణ కౌంటింగ్‌ ఏజంట్లతో శనివారం నిర్వహించే సమావేశంలోనూ ఇవే అంశాలు పునరుద్ఘాటించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఎంత తీవ్రస్థాయిలో ఘర్షణకు అయినా సిద్ధం కావాలని అందుకోసం ఎంతకైనా తెగించాలని కౌంటింగ్‌ ఏజెంట్లను పురిగొల్పడం ద్వారా చంద్రబాబు తన కుతంత్రాన్ని బహిర్గతం చేశారు.పోలింగ్‌ రోజు మోడల్‌ అమలుపోలింగ్‌ సందర్భంగా పాల్పడిన కుట్రలనే కౌంటింగ్‌ రోజు కూడా పునరావృతం చేయాలని చంద్రబాబు స్కెచ్‌ వేశారు. ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ద్వారా తాము నియమించుకున్న పోలీసు యంత్రాంగం ఇందుకు పూర్తిగా సహకరిస్తుందనే ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలో పోలింగ్‌ నిర్వహించిన ఈ నెల 13వతేదీన టీడీపీ రౌడీమూకలు దాడులతో భయానక వాతావరణం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రధానంగా పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల్లో అల్లరి మూకలు యథేచ్ఛగా దౌర్జన్యకాండకు పాల్పడ్డాయి. టీడీపీ రౌడీ మూకలు పోలింగ్‌ కేంద్రాలతోపాటు నడి వీధుల్లో స్వైర విహారం చేస్తున్నా పోలీసు యంత్రాంగం చోద్యం చూసింది. అదే అదనుగా మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వర్గాలను ఓటింగ్‌కు దూరం చేయడమే లక్ష్యంగా పచ్చ ముఠాలు కత్తులు, కర్రలు, రాడ్లు చేతబట్టుకుని బీభత్సం సృష్టించాయి.బాంబు దాడులతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అదే విధ్వంసకాండ మోడల్‌ను ఓట్ల లెక్కింపు రోజు కూడా అమలు చేయాలని చంద్రబాబు పథకం వేశారు. కౌంటింగ్‌ కేంద్రాల బయట దాడులతో దృష్టి మళ్లించి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తమ ఏజెంట్లతో కవ్వింపు చర్యలకు దిగాలని కుట్ర పన్నారు.వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను వెళ్లగొట్టండి...!వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లే లక్ష్యంగా కౌంటింగ్‌ కేంద్రాల్లో కవ్వింపు చర్యలతో ఘర్షణలకు దిగాలని, దాడులకూ వెనకాడొద్దని చంద్రబాబు ఆదేశించారు. అదే అదనుగా తమకు అనుకూలంగా వ్యవహరించే కొందరు పోలీసు అధికారులను రంగ ప్రవేశం చేయించి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కౌంటింగ్‌ కేంద్రాల నుంచి బలవంతంగా బయటకు పంపేలా చంద్రబాబు ఇప్పటికే కీలక అధికారులతో మంతనాలు జరిపారు. ఆ తరువాత ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడాలన్నది ఆయన లక్ష్యం. ఈమేరకు పోస్టల్‌ బ్యాలెట్ల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు వరకూ ప్రతి దశలోనూ కౌంటింగ్‌ కేంద్రాల్లో వాగ్వాదం, ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిడితో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ఈసీ, కొందరు పోలీసు అధికారులు కౌంటింగ్‌ ప్రక్రియలోనూ అదే రీతిలో వ్యవహరించే అవకాశాలున్నాయని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాల్సిన ఈసీ, అధికార యంత్రాంగం ఉదాశీనంగా, నిస్తేజంగా వ్యవహరించడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.

T20 World Cup 2024: Rohit Sharma Needs 3 More Sixes To Complete 600 Sixes In International Cricket
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న రోహిత్‌.. దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు..!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024 హిట్‌మ్యాన్‌ మరో మూడు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు.2007 నుంచి ఇప్పటివరకు 472 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ 498 ఇన్నింగ్స్‌ల్లో 597 సిక్సర్లు బాదాడు. అన్ని సవ్యంగా సాగితే టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లోనే హిట్‌మ్యాన్‌ 600 సిక్సర్ల మార్కును తాకుతాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 330 సిక్సర్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆతర్వాత వార్నర్‌ 312 సిక్సర్లతో 11వ స్థానంలో.. 294 సిక్సర్లతో విరాట్‌ కోహ్లి 12వ స్థానంలో నిలిచారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో భారత ప్రస్తానం జూన్‌ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. దీనికి ముందు భారత్‌ ఇవాళ (జూన్‌ 1) బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. మెగా టోర్నీలో భారత్‌ రెండో మ్యాచ్‌ జూన్‌ 9న ఆడుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో రోహిత్‌ సేన చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో తలపడనుంది.మరో రికార్డుపై కూడా కన్నేసిన రోహిత్‌జూన్‌ 5న ఐర్లాండ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ మరో రికార్డుపై కూడా కన్నేశాడు. ఆ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ మరో 26 పరుగులు చేస్తే.. విరాట్‌, బాబర్‌ తర్వాత 4000 టీ20 పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్‌ 151 టీ20 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీల సాయంతో 3974 పరుగులు చేశాడు. విరాట్‌ 117 మ్యాచ్‌ల్లో 4037 పరుగులు.. బాబర్‌ 119 మ్యాచ్‌ల్లో 4023 పరుగులు చేసి రోహిత్‌ కంటే ముందున్నారు.

Lok Sabha Elections 2024 Results Live Streaming In Movie Theaters
జూన్ 4న సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాలు

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్‌ శనివారం జరుగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌తో పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌ జరగనుంది. ఇక అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే ఉంది.జూన్ 4న ఓట్ల లెక్కింపుపై అందరి దృష్టి ఉంది. ఈ క్రమంలో జూన్‌ 1న సాయంత్రం పలు న్యూస్ చానెళ్లు కూడా ఎగ్జిట్ పోల్స్ పేరుతో గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఈ తతంగం ముగిసిన తర్వాత జూన్‌ 4న ఫలితాలు కోసం యావత్‌ దేశం టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతుంది. అయితే, ఎన్నికల ఫలితాలు లైవ్‌లోనే బిగ్‌ స్క్రీన్‌పై ప్రసారమైతే..? ఆ అనుభూతి ఎలా ఉంటుంది..? ఇప్పుడు మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఈ ప్లాన్‌నే అమలు చేయబోతున్నాయి. ముంబైలో ఎస్ఎం 5 కళ్యాణ్, సియాన్,నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్‌ ఎటర్నిటీ, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్‌, థానేలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్,పుణెలోని మూవీమ్యాక్స్‌, మీరా రోడ్ ప్రాంతంలోని మూవీమాక్స్ చైన్ ఆఫ్ థియేటర్లు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రదర్శిస్తాయి. ఇందుకోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు కూడా జరిగిపోయాయి. ఉదయం 9గంటల నుంచి ఆ థియేటర్‌లలోకి అనుమతిస్తారు. సుమారు 6గంటల పాటు థియేటర్‌లో ఎన్నికల ఫలితాలను ప్రదర్శిస్తారు. టికెట్‌ ధర రూ. 99 నుంచి రూ. 300 వరకు ఉంటుంది. బిగ్‌ స్క్రీన్‌పై ఎన్నికల ఫలితాలు చూడాలని ఆశించేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో చాలా థియేటర్‌లు హౌస్‌ఫుల్‌ అయిపోయాయి.

Heavy To Very Heavy Rainfall In Andhra Pradesh
AP Rains: చల్లటి కబురు.. పలుచోట్ల భారీ వర్షం

సాక్షి, విశాఖపట్నం: ముందస్తు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచే విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది.కాగా, ఏపీలో వాతావరణం చల్లబడింది. పలుచోట్ల ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. మెరుపులు, ఈదురు గాలుల ధాటికి చెట్లు, విద్యుత్‌ స్థంభాలు కూలిపోయాయి. దీంతో, పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.1st June 6:11 am : Heavy to very heavy rainfall ahead for Ambedkar Konaseema district as the storms from #Kakinada is coming down. During next 2 hours, Amalapuram - Razolu - Ramachandrapuram belt will see heavy rains with strong lightning bolts. ⚠️⚠️— Andhra Pradesh Weatherman (@praneethweather) June 1, 2024 Early Morning heavy rains triggered along #Visakhapatnam city :Gajuwaka - 60 mmBheemili - 57 mmGopalapatnam - 50 mmSimhachalam - 42 mmPendurthi - 41 mmMaharanipeta - 36 mmArilova - 36 mmSeethammadhara - 35 mmMore rains to happen today and tomorrow in and around Vizag…— Andhra Pradesh Weatherman (@praneethweather) June 1, 2024

CM Jagan Arrived From Foreign Tour Grand Welcome From YSRCP
ముగిసిన సీఎం జగన్‌ విదేశీ పర్యటన

కృష్ణా, సాక్షి: ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ దగ్గర సీఎం జగన్‌కు ఘన స్వాగతం లభించింది. ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. పార్టీ కేడర్‌ పెద్ద ఎత్తున తరలివచ్చింది. అక్కడి నుంచి నేరుగా ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. Jagan anna ki ఘనస్వాగతం 🤗 pic.twitter.com/jVKG50mO0Y— YS JAGAN 2024 🇸🇱 (@ysrcpfrance) June 1, 2024ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన సీఎం జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్, స్విట్జర్లాండ్‌ దేశాల్లో కుటుంబసమేతంగా ఆయన పర్యటించారు. పదిహేను రోజుల తర్వాత తిరిగి ఇవాళ స్వదేశానికి విచ్చేశారు. జూన్‌ 4వ తేదీన ఏపీకి జడ్జిమెంట్‌ డే. ఈ నేపథ్యంలో నేడో, రేపో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

Daily Horoscope: Rasi Phalalu 01-06-2024 In Telugu
ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు, లక్ష్యాలు సాధిస్తారు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.నవమి ఉ.6.21 వరకు, తదుపరి దశమి తె.3.50 వరకు(తెల్లవారితే ఆదివారం), నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.2.28 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ప.1.04 నుండి 2.33 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.35 నుండి 7.12 వరకు, అమృతఘడియలు: రా.10.01 నుండి 11.31 వరకు; రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం : 5.28, సూర్యాస్తమయం : 6.27. మేషం: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. రాబడికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.వృషభం: అనుకున్న పనుల్లో పురోగతి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు.మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కార్యజయం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.కర్కాటకం: ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.సింహం: దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు పనిభారం.కన్య: విద్యార్థులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.తుల: అనుకున్న పనుల్లో విజయం. శుభవార్తలు. ధన, వస్తులాభాలు. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.వృశ్చికం: ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ధనుస్సు: దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.మకరం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.కుంభం: రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.మీనం: యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. బంధువులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement