యువ నిర్మాత అరెస్ట్.. ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి | Tamil Producer Mohammad Ali Arrest | Sakshi
Sakshi News home page

నిర్మాత దారుణమైన పని.. తన ఆఫీసులో పనిచేస్తున్న అమ్మాయిని ఏకంగా!

Published Mon, Jun 3 2024 6:01 PM | Last Updated on Mon, Jun 3 2024 6:48 PM

Tamil Producer Mohammad Ali Arrest

తమిళ యువ నిర్మాత మహమ్మద్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన దగ్గర పనిచేస్తున్న అమ్మాయిని మాటమాటలు చెప్పి మోసం చేయడమే దీనికి కారణం. అయితే అమ్మాయితో ఈ నిర్మాత చాలా దారుణంగా ప్రవర్తించాడు. సినిమాలు తీసే ఇతడు నిజ జీవితంలో విలన్‌గా ప్రవర్తించడం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.

(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరోయిన్‌కి చేదు అనుభవం.. ఊపిరాడనివ్వలేదు!)

యువ నిర్మాత మహమ్మద్ అలీ.. కిల్ అయనంబాక్కంలో నిర్మాణ సంస్థ నడుపుతున్నాడు. కొరటూరు ప్రాంతానికి చెందిన ఓ యువతి.. గతేడాది సెప్టెంబరులో మహమ్మద్ అలీ కార్యాలయంలో పనికి చేరింది. అయితే గత నెల 13న అదే యువతి.. అంబత్తూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో సదరు నిర్మాతపై ఫిర్యాదు చేసింది. పెళ్లయిందనే విషయాన్ని దాచిపెట్టి, తనని ప్రేమిస్తున్నానని, పెళఅలి చేసుకోవాలనుకుంటున్నాని చెప్పి మోసం చేసినట్లు పేర్కొంది.

యువతి ఫిర్యాదు ప్రకారం.. 'నాకు తెలియకుండానే సాఫ్ట్ డ్రింక్స్‌లో మత్తు మందు కలిపిచ్చి, నాపై అత్యాచారం చేశాడు. దాన్ని వీడియోగా రికార్డ్ చేశాడు. నాకు ప్రెగ్నెన్సీ రావడంతో.. పౌష్టికాహార మాత్రాలని చెప్పి అబార్షన్ టాబ్లెట్స్ ఇచ్చాడు. దీని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు' అని చెప్పుకొచ్చింది. తనని ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన పోలీసులు.. మహమ్మద్ అలీపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచి జైలుకు కూడా తరలించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement