
మనిషికి హాయినిచ్చేవి కబుర్లు.. హాని చేసేవి కవర్లు.. అర్థం కాకపోతే క్షమించండి.. అసలు అర్థమే లేదనుకుంటే మన్నించండి(ఫోటో: రూబెన్, విజయవాడ)

సెల్ఫీ విత్ నవదీప్(ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్)

అందమైన చిత్రం.. అందులో దాగుంది వి‘చిత్రం’ (ఫోటో: కె.రమేశ్ బాబు, హైదరాబాద్)

ఓ యువతి.. నీ పరుగులు గమ్యం వైపా?.. ప్రమాదం వైపా?(ఫోటో: రవిందర్, హైదరాబాద్)

పేదోడి మట్టికుండ.. దీంట్లో నీళ్లు తాగినోడి కడుపు సల్లగుండ..(ఫోటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్)

కృష్టమ్మ ఒడిలో పొద్దుపొడుపు.. ఆకలి వేటకు మేలుకొలుపు.. (ఫోటో:విజయ్ క్రిష్ణ, అమరావతి)

యాత్ర.. జననేత అడుగుల వెంట అభిమానయాత్ర.. జనయాత్ర.. ఇది చరిత్రలో చెరిగిపోని యాత్ర(ఫోటో: బాషా, అనంతపురం)

ఈ క్షణం నాదంటూ ముందుకు దూకు.. అడుగుల దూరంలో ఆగిపోకు.. ఓటమి ఒప్పుకోకు.. ప్రయత్నించు.. సాధించు( ఫోటో: వీరేశ్, అనంతపురం)

ప్రతి గింజమీద తినే వాడి పేరు రాసుంటుందంటారు.. నీ చేతుల్లోకి వచ్చి చెత్తగా మారింది మన గింజయితే.. మనం ఆకలితో అలమటించే కాలం దగ్గరవతుందని అర్థం(ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు)

ఉసూరు మనే వయస్సులోనైనా.. ఉరకలెత్తే మనసుంటే.. (ఫోటో: రామ్ గోపాల్ రెడ్డి, గుంటూరు)

అదిరేటి డ్రస్సుకు ఐకాన్స్.. అందాల బ్యూటీ క్వీన్స్(ఫోటో: ఎస్‌ఎస్ ఠాకూర్, హైదరాబాద్)

అందని ద్రాక్ష పళ్ల కథ అవ్వ చెప్పింది... అందే ద్రాక్ష పళ్ల కథ అమ్మచెబుతుంది(ఫోటో: సురేశ్ కుమార్, హైదరాబాద్)

నిలువెత్తు శ్రమకు రూపం ఓ మహిళ.. కుటుంబాన్ని నిలిపే పునాది ఓ మహిళ (ఫోటో: థశరధ్ రాజ్వా, ఖమ్మం)

లేడీ కుంబ్లే దెబ్బ.. వికేట్లు అనవా అబ్బా!(ఫోటో: రాజు రాధారపు, ఖమ్మం)

పరుగాపకు.. ఓటమికి చిక్కకు(ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

జపం.. జపం.. జపం.. కొంగ జపం.. (ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)

అంతుచిక్కని పిరమిడ్ రహస్కాలు ఏన్నో.. ఆడవాళ్లలో దాగున్న అద్భుత శక్తులు అన్ని.. ‘‘షీ కాన్ డూ ఎనీథింగ్’’(ఫోటో:భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

ప్రమాదం అంచున శ్రమ జీవుల జీవితాలు (ఫోటో: నరసయ్య, మంచిర్యాల)

సిక్స్ ప్యాక్... కమింగ్ సూన్(ఫోటో: సుధాకర్, నాగర్ కర్నూల్)

ఓ తండ్రి సరదా.. కూతురికి మహారాణి హోదా!(ఫోటో:రాజ్ కుమార్, నిజామాబాద్)

సార్! ఇక్కడెక్కడో రోడ్డు భద్రతావారోత్సవాలు జరుగుతున్నాయని తెలిసివచ్చాం!... ఎక్కడో కొంచెం చెప్పగలరా?(ఫోటో: సతీశ్‌కుమార్ ఎమ్, పెద్దపల్లి)

చెత్తను పనికిరాదంటూ.. ఛీదరించే వాళ్లు.. ఆ చెత్తలోనే ఆశల్ని వెతుక్కునే వాళ్లు.. చిత్రం ఈ మానవ జీవితం(ఫోటో: సతీష్ కే, సిద్దిపేట)

చిరునవ్వులతో ఈ చెలిమిని.. సెల్ఫీతో మన జ్ఞాపకాల్ని పదిలంగా ఉంచుకుందాం!(ఫోటో: సతీష్ కే, సిద్దిపేట)

రోజూ ఓ గుడ్డు తినండి! ఆరోగ్యంగా ఉండండి(ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)

కొత్తగా సామాన్లొచ్చాయి.. కోటి ఆశలు చిగురిస్తాయి.. (ఫోటో: యాకయ్య, సిద్దిపేట)

మంచులో నాలుగు చక్రాల బండి చూపు మందగించింది.. ఎద్దుల చూపుతో బండి ముందుకు నడిచింది(ఫోటో: యాకయ్య, సిద్దిపేట)

చివరన వెలుగుల సూరీడు.. జెండాలో ప్రజల ఆశల సూర్యుడు..(ఫోటో: మహ్మద్ రఫి, తిరుపతి)

గాల్లో తేలినట్లుందే.. ఒళ్లు లాగినట్లుందే.. పర్లేదు! నన్ను మా ఇంటిదాక తీసుకెళ్లండి.. ప్లీజ్!(ఫోటో: భగవాన్, విజయవాడ)

పిల్లలు ఆడుకోవటానికి ఖాళీ గ్రౌండు అక్కర్లేదు.. చంద్రన్న మీటింగ్‌లకు వెళితే చాలు.. ఇలా కుర్చీల్తో ఎంచక్కా ఆడుకోవచ్చు(ఫోటో: చక్రపాణి, విజయవాడ)

మనం ట్రాఫిక్‌లో తిరుగుతుంటామని అందరూ అనుకుంటాం.. వాస్తవానికి ట్రాఫిక్కే మన చుట్టూ తిరుగుతుంటుంది..(ఫోటో: చక్రపాణి, విజయవాడ)

ఆడపడుచు అణువు, అణువులో భక్తి.. వేసిన ముగ్గు.. చుక్క, చుక్కలోనూ భక్తి(ఫోటో: కిషోర్, విజయవాడ)

శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు యాదాద్రికే అందాన్ని తెచ్చినారు..(ఫోటో: శివ కొల్లజు, యాదాద్రి)

రంగులు విరబోసిన తీరంలో.. పుణ్యాల స్నానం.. (ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)