కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది.
. దర్శకుడు హరి హారన్.వి తన ప్రత్యేక కథన శైలితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.గాయత్రీ ప్రొడక్షన్స్, రచ్చమల్ల బ్రదర్స్ బ్యానర్లపై కె.ఎన్. రావు, డా. రచ్చమల్ల శ్రీనివాస రావు నిర్మించిన ఈ చిత్రానికి పి.ఆర్. సంగీతం అందించారు.
ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ ప్రధాన పాత్రలో నటించగా, రితిక, పూజ కిరణ్, భవ్యశ్రీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
టీజర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు సాయి రాజేష్ హాజరయ్యారు.


