
ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అద్నాన్ షైక్ నిఖా చేసుకున్నాడు.

ప్రియురాలు సనా మక్బుల్‌ను పెళ్లాడాడు.

సెప్టెంబర్ 25న జరిగిన ఈ వివాహానికి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, బుల్లితెర సెలబ్రిటీలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు హాజరై సందడి చేశారు.

తన పెళ్లి, రిసెప్షన్ ఫోటోలను షేర్ చేసిన అద్నాన్ తన భార్య ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు.

చాలామటుకు ఫోటోల్లో ఆమె మాస్క్ ధరించే ఉండగా.. ఓ ఫోటోలో అయితే ఆమె ముఖం కనిపించకుండా హార్ట్ సింబల్ జత చేశాడు.

దీంతో ఫ్యాన్స్.. అదేంటి, వదినను చూపించొచ్చుగా, ఇంకా సస్పెన్స్‌లో ఉంచడం దేనికి? అని కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే అద్నాన్ షైక్ హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్లో పాల్గొన్నాడు.













