తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రకృతి చెక్కిన సుందర జలపాతాలు
కుంటాల జలపాతం తెలంగాణ లోనే అతి ఎత్తయిన జలపాతం. ఇది ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల గ్రామ సమీపంలో కడెం నది పై ఉంది.
బొగత వాటర్‌ఫాల్స్ చీకులపల్లి ఫాల్స్ అనికూడా అంటారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో బొగత జలపాతం ఉంది.
ఎత్తిపోతల జలపాతం, నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న ఒక అందమైన జలపాతం.
మల్లెల తీర్థం జలపాతం నాగర్‌కర్నూల్‌లోని నల్లమల అడవిలో ఉంది.
పోచ్చెరా జలపాతం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
భీముని పాదం జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌లోని గూడూరు మండలం సీతానగరం గ్రామంలో ఉంది.
సప్త కుండ్ జలపాతం ఆదిలాబాద్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అంతరగంగ జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, కవాడిపల్లి గ్రామంలో ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్నందున, వీకెండ్ లో ట్రెక్కింగ్ మరియు జలపాతం అందాలను ఆస్వాదించడానికి ఇది ఒక మంచి ప్రదేశం.
బోడకొండ జలపాతం హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ వద్ద ఉంది.
బుగ్గ జలపాతం తెలంగాణలోని నల్గొండ జిల్లా, అజిలాపూర్ గ్రామంలో ఉంది.
ముత్యంధార జలపాతం తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, వెంకటాపురం మండలంలోని వీరభద్రారం గ్రామానికి సమీపంలో ఉంది.


