పియరర్ మొబిలిటీ యాజమాన్యంలోని కేటీఎం వరుసగా 12 సంవత్సరాల నుంచి రికార్డు వృద్ధిని నమోదు చేసింది.
ప్రస్తుతం మార్కెట్‌లో భారీగా పోటీ నెలకొంది. దాంతో కంపెనీ నష్టాల్లోకి జారుకుంటోంది.
కేటీఎం ఇటీవల తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేయడంతోపాటు 300 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
కంపెనీ ఉత్పత్తుల ఇన్వెంటరీ పెరుగుతున్నట్లు తెలిపింది.
కేటీఎం కాస్ట్ కటింగ్ చర్యలకు పూనుకుంది. అందులో భాగంగా తన ఉత్పత్తుల తయారీని భారత్, చైనాలోని అనుబంధ కంపెనీల్లో చేపట్టబోతున్నట్లు తెలిపింది.


