ప్రవాస బాలలకు తెలుగు విశ్వవిద్యాలయ పరీక్షలు | SiliconAndhra conducts manabadi exams in america | Sakshi
Sakshi News home page

ప్రవాస బాలలకు తెలుగు విశ్వవిద్యాలయ పరీక్షలు

May 15 2017 8:48 PM | Updated on Sep 2 2018 4:12 PM

గత పది సంవత్సరాలుగా 27వేలమందికి పైగా ప్రవాస తెలుగు బాలలకు తెలుగు భాష నేర్పుతున్న సిలికానాంధ్ర మనబడి 2016-17 విద్యాసంవత్సరం వార్షిక పరీక్షలు శనివారం జరిగాయి.

గత పది సంవత్సరాలుగా 27వేలమందికి పైగా ప్రవాస తెలుగు బాలలకు తెలుగు భాష నేర్పుతున్న సిలికానాంధ్ర మనబడి 2016-17  విద్యాసంవత్సరం వార్షిక పరీక్షలు  శనివారం  జరిగాయి. అమెరికాలోని 50 కి పైగా ప్రాంతాలలో 1062 జూనియర్ సర్టిఫికేట్ (ప్రకాశం), 372 మంది సీనియర్ సర్టిఫికేట్(ప్రభాసం)కోసం విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయం అధికారులు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సత్తిరెడ్డి, పరీక్షా నిర్వహణ సంచాలకులు డా. రెడ్డి శ్యామల, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అధ్యక్షులు డా. మునిరత్నం నాయుడుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వార్షిక పరీక్షలు జరిగాయి.

ఈ పరీక్షా పత్రాలను  అధికారుల సమక్షంలో అమెరికాలోనే మూల్యాంకణం చేశారు. ఉత్తీర్ణులైన వారికి మే 21, 2017న  జరిగే  మనబడి స్నాతకోత్సవ కార్యక్రమంలో, తెలుగు విశ్వవిద్యాలయం అందించే పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ, వాస్క్ అధికారులు డా. జింజర్ హావనిక్ తదితరులు హాజరు కానున్నారు. అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షలను శ్రీదేవి గంటి సమన్వయ పరచగా.. కిరణ్ దుడ్డగి సాంకేతిక సహకారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement