వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాహుల్ గాంధీ అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు.
అనంతపురం: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాహుల్ గాంధీ అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసమే వైఎస్ జగన్పై విమర్శలు చేశారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజనకు రాహుల్ గాంధీయే కారణమని మిథున్ రెడ్డి ఆరోపించారు. ఏపీపై రాహుల్కు నిజంగా ప్రేమ ఉన్నట్టయితే ప్రత్యేక హోదా అంశాన్ని విభజన బిల్లులో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరంపై రాజీ లేని పోరాటం చేస్తున్న ఘనత వైఎస్ జగన్దేనని చెప్పారు. అనంతపురం జిల్లా రైతు ఆత్మహత్యలను దేశం దృష్టికి తీసుకెళ్లింది వైఎస్ జగనేనని మిథున్ రెడ్డి అన్నారు. ఈ రోజు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. వైఎస్ జగన్పై విమర్శలు చేయడంతో మిథున్ రెడ్డి స్పందించారు.