
రాష్ట్రపతిని కలిసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను కేంద్రంలోని పెద్దలకు వివరించేందుకు గురువారం ఢిల్లీకి బయల్దేరిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.
న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను కేంద్రంలోని పెద్దలకు వివరించేందుకు గురువారం ఢిల్లీకి బయల్దేరిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆయనతోపాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కూడా రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ రోజు రాత్రి 7.30 ని.లకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో జగన్ సమావేశం కానునన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ చైర్మన్ల, మండలపరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు, ప్రభుత్వ అధికార దుర్వినియోగం వంటి అంశాలను ఆయన రాజ్ నాథ్ కు వివరించనున్నారు.
చంద్రబాబు నాయుడు సర్కారు ఏర్పడిన నెలరోజుల్లోనే 17 మంది వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను హతమార్చడం, 110 మందిని తీవ్రంగా గాయపర్చిన ఉదంతాలను వివరించనున్నారు. శుక్రవారం కూడా ఢిల్లీలోనే ఉండనున్న జగన్ .. ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది.