
'రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదు'
తాను రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్తున్నారన్న వార్తలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు.
నాగ్ పూర్: రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్తున్నారన్న వార్తలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు.ఆ వార్తలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి సంబంధించి రాష్ట్రంలో అనుభవం ఉన్న నాయకులు చాలామందే ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన గడ్కరీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని ఆధిక్యంతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసలు తనకు రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్లడానికి ఆస్తక్తి లేదన్నారు.
ఆ పదవికి చాలామంది అర్హత కల్గిన నాయకులు బీజేపీలో ఉన్నారన్నారు. మహారాష్ట్రలో తమ పార్టీ గెలుచుకుని సీట్లు150 నుంచి 160 మధ్య ఉండవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. విదర్భ పరిధిలో 40 -45 నుంచి సీట్లను బీజేపీ చేజిక్కించుకుంటుందన్నారు.