కదులుతున్న బస్సులో గ్యాంగ్ రేప్ | Woman gangraped in moving bus in Bhopal | Sakshi
Sakshi News home page

కదులుతున్న బస్సులో గ్యాంగ్ రేప్

Sep 17 2015 4:21 PM | Updated on Sep 3 2017 9:34 AM

పోలీసుల అదుపులో నిందితులు

పోలీసుల అదుపులో నిందితులు

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో గురువారం ఉదయం 'నిర్భయ' తరహా దారుణ ఘటన చోటుచేసుకుంది.

భోపాల్: మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో గురువారం ఉదయం 'నిర్భయ' తరహా దారుణ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో మహిళపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంపీ నగర్ ప్రాంతంలో ఈ దారుణోదంతం జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్  చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఆగస్టు 5న వీఐపీ రోడ్డులో కదులుతున్న కారులో 24 ఏళ్ల మహిళపై నలుగురు కామాంధులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన మరువకముందే మరొకటి జరగడం భోపాల్ వాసులను భయాందోళనకు గురిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement