వారిని బహిరంగంగా ఉరితీయండి...

Bhopal gang-rape: Victim says, 'Hang culprits to death in public' - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఓ యువతిని నలుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బాధితురాలు తీవ్రంగా స్పందించింది. ఈ దారుణమైన నేరానికి పాల్పడినందుకు గాను నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్‌ చేసింది. ఈ మొత్తం సంఘటనపై పోలీసులు కూడా చేత కాని వారులాగా ప్రదర్శించారని తెలిపింది. '' నిందితులకు శిక్ష కఠినంగా ఉండాలి. ఇలాంటి నేరాలకు పాల్పడానికి ఇతరులు బయటపడేలా వీరికి శిక్ష ఉండాలి. వీరికి మరణశిక్షనే ఉండాలి. వీధుల్లో వీరిని ఉరితీయాలి. దీంతో మిగతా వాళ్లు ఇలాంటి నేరాలకు పాల్పడానికి సాహసించరు'' అని బాధితురాలు పూజ(పేరు మార్పు) డిమాండ్‌ చేసింది. ఈ సంఘటన అనంతరం ఆమె తొలిసారి మీడియా ముందుకు వచ్చింది. ఈ కేసుపై పోలీసులు ప్రవర్తన చాలా దారుణంగా ఉందని తెలిపింది. ఒక పోలీసు స్టేషన్‌ నుంచి మరో పోలీసు స్టేషన్‌కు తనకు బలవంతంగా పంపించారని తెలిపింది. ఒక పోలీస్‌ దంపతుల కుమార్తె అయిన తనకే ఈ పరిస్థితి వస్తే, ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. 

మంగళవారం రాత్రి పూజపై దుండగులు ఈ పాశవిక ఘటనకు పాల్పడ్డారు. చివరికి దుండగుల నుంచి తప్పించుకున్న బాధితురాలు హబీబ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా 'నువ్వు చెప్పేది సినిమా కథలా ఉంది' అని హేళన చేశారు. హబీబ్‌గంజ్‌ లోకల్, ఎంపీ నగర్, హబీబ్‌గంజ్‌ జీఆర్పీ స్టేషన్లలోని పోలీసులు ఈ కేసు మా పరిధిలోకి రాదంటూ బాధితురాలిని 24 గంటలు తిప్పించారు. దీంతో చివరికి బాధితురాలు తన తల్లిదండ్రులతో కలసి ఇద్దరు నిందితుల్ని పట్టుకుని స్టేషన్‌కు తీసుకురావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో హబీబ్‌గంజ్, ఎంపీ నగర్, జీఆర్పీ పోలీస్‌స్టేషన్లకు చెందిన ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్‌ అయ్యారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top