దాష్టీకం: 10 ఏళ్ల బాలికపై మూడు నెలలుగా గ్యాంగ్‌ రేప్‌

10-Year-Old Girl Gang Raped For 3 Months In Bhopal - Sakshi - Sakshi - Sakshi - Sakshi

స్వీట్స్‌ ఆశ చూపి అత్యాచారం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో భోపాల్‌ నగరం నడిబొడ్డున ఓ యువతిపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఓ 10 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు స్వీట్స్‌ ఆశగా చూపి గత మూడు నెలలుగా పలుమార్లు అత్యాచారం జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

పోలీసులు వివరాల ప్రకారం.. భోపాల్‌లోని జెహంగీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఐదో తరగతి చదువుతున్న బాలికపై అదే కాలనీలో వాచ్‌మన్‌గా ఉండే నన్హూలాల్‌(65), మరో ముగ్గురు వ్యక్తులు గోకుల్‌ పన్వాల్‌(45), గ్యానేంద్ర పండీట్‌(36), సుమన్‌పాండే(50)లు గత మూడు నెలలుగా పలుమార్లు అత్యాచారం జరిపారు.

చివరిసారిగా నవంబర్‌ 12న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అప్పటి నుంచి బాలిక ప్రవర్తనలో తేడా గమనించిన ఆమె తల్లి ఆరాదీయగా అసలు విషయం తెలిసింది. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఆ బాలిక ఇంటి పక్కనే ఉండే సుమన్‌ స్వీట్లను బాలికకు ఆశ చూపి ఈ ఘాతుకానికి ఒడి గట్టాడు. అంతే కాకుండా ఇతరులతో గ్యాంగ్‌ రేప్‌ చేయించాడు.

నలుగురి నిందితులని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీస్‌ అధికారి ప్రీతమ్‌ మీడియాకు వివరించారు. బాలిక నివసించే ప్రాంతంలోనే నన్హూలాల్‌ వాచ్‌మన్‌ కాగా.. గోకుల్‌ పాన్‌ షాప్‌ నిర్వహిస్తుండగా.. గ్యానేంద్ర డ్రైవర్‌గా .. థాకుర్‌ పని మనిషిగా పని చేస్తున్నారు. 15  రోజుల్లోనే భోపాల్‌లో వరుస గ్యాంగ్‌ రేప్‌ ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top