రికార్డు స్థాయిలో ఎఫ్డీఐలు | With $36 billion in nine months, FDI may deliver a record | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో ఎఫ్డీఐలు

Feb 18 2017 11:37 AM | Updated on Oct 4 2018 5:15 PM

పెద్ద నోట్ల రద్దు, మందగించిన వృద్ధి విదేశీ పెట్టుబడులకు దెబ్బకొట్టలేదు. ఈ ఏడాది భారీ ఎత్తున్న ఎఫ్డీఐ దేశంలోకి వస్తూ రికార్డు స్థాయిలు సృష్టిస్తున్నాయి.

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు, మందగించిన వృద్ధి విదేశీ పెట్టుబడులకు దెబ్బకొట్టలేదు. ఈ ఏడాది భారీ ఎత్తున్న ఎఫ్డీఐ దేశంలోకి వస్తూ రికార్డు స్థాయిలు సృష్టిస్తున్నాయి.  ఆర్థికసంవత్సరం చివరి మార్చి వరకు విదేశీ పెట్టుబడులు ఇంకా భారీగా పెరుగుతాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఏప్రిల్-డిసెంబర్ కాలంలో భారత్ లో ఎఫ్‌డీఐలు 22 శాతం పైకి ఎగిసి 35.8 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.2,41,454 కోట్లకు) చేరుకున్నాయని తెలిసింది.
 
మరో నెలలో ఆర్థిక సంవత్సరం ముగియబోతుంది. ఈ నేపథ్యంలో ఆర్థికసంవత్సరం చివరి వరకి 40 బిలియన్ డాలర్ల(రూ.2,68,283) ఎఫ్‌డీఐలు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనావేస్తోంది. 18 శాతం ఎఫ్‌డీఐలతో సర్వీసు రంగం టాప్లో ఉండగా.. టెలికాం, నిర్మాణ అభివృద్ధి, కంప్యూటర్ హార్డ్ వేర్, ఆటోమొబైల్స్ రంగంలోకి ఎ‍క్కువగా ఎఫ్డీఐలు వచ్చాయి. అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా మాత్రం గతేడాది విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు 13 శాతం పడిపోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement