రైలు పట్టాలపై పడిన పసిగుడ్డుకు తప్పిన ముప్పు | West Bengal: Miraculous escape for child born inside a train toilet | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై పడిన పసిగుడ్డుకు తప్పిన ముప్పు

Oct 23 2013 1:01 PM | Updated on Sep 1 2017 11:54 PM

కదులుతున్న రైల్లోంచి పట్టాలపై పడిన ఓ పసిగుడ్డు సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన ఆశ్చర్యకర సంఘటన పశ్చిమ బెంగాల్లో మంగళవారం చోటు చేసుకుంది.

కృష్ణానగర్: కదులుతున్న రైల్లోంచి పట్టాలపై పడిన ఓ పసిగుడ్డు సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన ఆశ్చర్యకర సంఘటన పశ్చిమ బెంగాల్లో మంగళవారం చోటు చేసుకుంది. జుమ్కా గ్రామానికి చెందిన రెహానా బీబీ అనే గర్భిణి ముర్షిషాబాద్ వద్ద లాల్గొలా ప్యాసింజర్ రైలు ఎక్కింది.

నదియా జిల్లాలోని పాలాషి రైల్వేస్టేషన్కు చేరుకున్న సమయంలో రెహానా బాత్రూమ్కు వెళ్లి బిడ్డను ప్రసవించింది. ఆమె తేరుకునేలోపు బిడ్డ మరుగుదొడ్డి కన్నం నుంచి జారిపోయి రైలు పట్టాలపై పడింది. విషయం తెలుసుకున్న తోటి ప్రయాణికులు రైలు ఆపి చిన్నారిని కాపాడారు. తల్లీబిడ్డను వెంటనే ఆస్పత్రికి  ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే చిన్నారికి చిన్న గాయం కూడా కాకపోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement