ఇండియాలో వాల్‌మార్ట్ మరో కొత్త కంపెనీ | Wal-Mart sets up new company in India | Sakshi
Sakshi News home page

ఇండియాలో వాల్‌మార్ట్ మరో కొత్త కంపెనీ

Jan 20 2014 1:57 AM | Updated on Sep 2 2017 2:47 AM

ఇండియాలో వాల్‌మార్ట్ మరో కొత్త కంపెనీ

ఇండియాలో వాల్‌మార్ట్ మరో కొత్త కంపెనీ

అత్యంత లాభదాయకమైన దేశీ రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు అంతర్జాతీయ దిగ్గజం వాల్‌మార్ట్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు వాల్‌మార్ట్ ఇండియా ప్రైవేట్ పేరుతో కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది.

న్యూఢిల్లీ: అత్యంత లాభదాయకమైన దేశీ రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు అంతర్జాతీయ దిగ్గజం వాల్‌మార్ట్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు వాల్‌మార్ట్ ఇండియా ప్రైవేట్ పేరుతో కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ వివరాల ప్రకారం వాల్‌మార్ట్ ఇండియాను ఈ నెల 15న రిజిస్టర్ చేసింది. రిటైల్ కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు ఇక కొత్త భాగస్వామితో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది.

కాగా, అమెరికాకు చెందిన ఈ దిగ్గజ సంస్థ క్యాష్ అండ్ క్యారీ(హోల్‌సేల్) విభాగంలో ఇప్పటికే దేశీయంగా భారతీ ఎంటర్‌ప్రైజెస్‌తో జటకట్టిన విషయం విదితమే. అయితే ఆరేళ్ల భాగస్వామ్యానికి తెరదించుతూ గత అక్టోబర్‌లో ఇవి విడిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement