విశాఖలో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం ఓకే | Union Cabinet clears setting up of six new IIMs | Sakshi
Sakshi News home page

విశాఖలో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం ఓకే

Published Wed, Jun 24 2015 4:15 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

విశాఖలో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం ఓకే - Sakshi

విశాఖలో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం ఓకే

విశాఖపట్నం సహా ఆరు ప్రాంతాల్లో కొత్తగా ఆరు ఐఐఎంల ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది.

న్యూఢిల్లీ: విశాఖపట్నం సహా ఆరు ప్రాంతాల్లో కొత్తగా ఆరు ఐఐఎంల ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరులకు తెలిపారు.

సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ స్మారకార్థం బీహార్ లో స్థూపం నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.81,459 కోట్లతో చేపట్టనున్న ఈస్ట్-వెస్ట్ కారిడార్ కు ఆమోద్రముద్ర వేసింది. ఈ ఏడాది నుంచి జపాన్, దక్షిణ కొరియా దేశాలకు మేలు రకం ముడిఇనుము ఎగుమతి చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కొత్తగా ఐఐఎంలు వచ్చేది ఇక్కడే
1. విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్)
2. బుద్ధగయా(బీహార్)
3. సిర్మౌర్(హిమచలప్రదేశ్)
4. నాగపూర్(మహారాష్ట్ర)
5. సంబల్పూర్(ఒడాశా)
6. అమృతసర్(పంజాబ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement