కాన్పూర్ ఐఐటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్ | Two IIT Kanpur students get Rs 1.20 crore package | Sakshi
Sakshi News home page

కాన్పూర్ ఐఐటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్

Dec 4 2013 12:49 AM | Updated on Sep 2 2017 1:13 AM

కాన్పూర్ ఐఐటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్

కాన్పూర్ ఐఐటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్

కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఇద్దరు విద్యార్థులకు బంపర్ ఆఫర్ లభించింది.

కాన్పూర్: కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఇద్దరు విద్యార్థులకు బంపర్ ఆఫర్ లభించింది. ఐటీ దిగ్గజం ఒరాకిల్ కంపెనీ వీరిని ఏడాదికి రూ.1.2 కోట్ల భారీ వేతన ప్యాకేజీతో ఉద్యోగాల్లోకి తీసుకుంది. కాన్పూర్ ఐఐటీలో సాగుతున్న క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో సోమవారం వీరికి కొలువులు ఇచ్చింది.

మరో 76 మందికి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ తదితర కంపెనీలు ఏడాదికి రూ.8 లక్షల నుంచి రూ.24 లక్షల వేతనం గల ఉద్యోగాలు ఇచ్చాయి. ఈ రోజు వరకు 180 మంది ఆఫర్ లెటర్లు అందుకున్నారు. 1,100 మంది బీటెక్, ఎమ్ టెక్, ఎంబీఏ, ఎమ్మెస్సీ విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్లేస్ మెంట్ సెల్ లో పేర్లు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement