'జైలు నుంచి వచ్చిన రేవంత్ బెదిరిస్తున్నారు' | TS additional advocate general comments on Cash For Vote Case | Sakshi
Sakshi News home page

'జైలు నుంచి వచ్చిన రేవంత్ బెదిరిస్తున్నారు'

Jul 2 2015 1:28 PM | Updated on Sep 3 2017 4:45 AM

'జైలు నుంచి వచ్చిన రేవంత్ బెదిరిస్తున్నారు'

'జైలు నుంచి వచ్చిన రేవంత్ బెదిరిస్తున్నారు'

'ఓటుకు కోట్లు' కేసులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఏసీబీ వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశముందని తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు.

న్యూఢిల్లీ: 'ఓటుకు కోట్లు' కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఏసీబీ వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశముందని తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన రేవంత్ సీఎం అంతుచూస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సాక్షులను ఆయన బెదిరించే అవకాశముందన్నారు.

'ఓటుకు కోట్లు' కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహారం దాగుందని ఆరోపించారు. స్టీఫెన్ సన్ కు ఇవ్వచూపిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఈ దశలో రేవంత్ బయట ఉండడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement