సాయుధ బలగాల చట్టం ఉపసంహరణ: సర్కార్ | tripura to peel off afspa, says manik sarkar | Sakshi
Sakshi News home page

సాయుధ బలగాల చట్టం ఉపసంహరణ: సర్కార్

May 27 2015 8:26 PM | Updated on Mar 28 2019 6:13 PM

సాయుధ బలగాల చట్టం ఉపసంహరణ: సర్కార్ - Sakshi

సాయుధ బలగాల చట్టం ఉపసంహరణ: సర్కార్

ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని సమస్యాత్మక రాష్ట్రాల్లో అత్యంత వివాదాస్పదంగా ఉన్న సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తమ రాష్ట్రంలో ఉపసంహరించాలని త్రిపుర సర్కారు నిర్ణయించింది.

ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని సమస్యాత్మక రాష్ట్రాల్లో అత్యంత వివాదాస్పదంగా ఉన్న సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తమ రాష్ట్రంలో ఉపసంహరించాలని త్రిపుర సర్కారు నిర్ణయించింది. ఉగ్రవాదుల చొరబాటును నిరోధించేందుకు గత 18 ఏళ్లుగా ఈ చట్టం ఆ రాష్ట్రంలో అమలవుతోంది. రాష్ట్రంలో హోం శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్.. బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల పరిస్థితిని తాము సమీక్షించామని, రాష్ట్ర పోలీసులు, భద్రతా దళాలతో కూడా ఈ అంశంపై చర్చించామని మాణిక్ సర్కార్ చెప్పారు. ఇక ఇప్పుడు ఈ చట్టంతో అవసరం లేదనే అందరూ భావించారని ఆయన అన్నారు. దాంతో.. వివాదాస్పదంగా ఉన్న ఆ చట్టాన్ని ఎత్తేయాలని నిర్ణయించామని, త్వరలోనే దీనిపై గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పారు. 1997 ఫిబ్రవరి 16 నుంచి త్రిపురలో ఈ చట్టం అమలవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement