రోడ్డు ప్రమాదంలో ట్రైనీ ఐఏఎస్ దుర్మరణం | Trainee IAS officer dies in road mishap | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ట్రైనీ ఐఏఎస్ దుర్మరణం

Nov 6 2013 1:40 PM | Updated on Sep 2 2017 12:20 AM

పంజాబ్లోని మొగ - బర్నాల రహదారిపై ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రైనీ ఐఏఎస్ నిశాంత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు.

పంజాబ్లోని మొగ - బర్నాల రహదారిపై ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రైనీ ఐఏఎస్ నిశాంత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ఘటనలో మరో ముగ్గురు ట్రైనీ ఐఏఎస్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ట్రైనీ ఐఏఎస్లు ప్రయాణిస్తున్న కారు దల గ్రామ సమీపంలో రహదారి పక్కనున్న చెట్టును ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు.

 

అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించిన తమకు సమాచారం అందించారని చెప్పారు. దాంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నామని చెప్పారు. గాయపడిన ట్రైనీ ఐఏఎస్లు పి. మల్లిక్, అజిత్ సింగ్, హర్ష కుమార్లుగా గుర్తించినట్లు చెప్పారు. అలాగే డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు. తక్కతాపురా నుంచి వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement