న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు.. బీహార్ లో రెండో దశ పోలింగ్..
న్యాయమూర్తుల నియామకాలు ఎలా?: వివాదాస్పదంగా మారిన ఎన్జేఏసీ (నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్) ఏర్పాటుకు సంబంధించి నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువర్చనుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు తదితర న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు ఇన్నాళ్లూ అనుసరించిన కొలీజియం విధానం స్థానే మోదీ సర్కారు ఎన్జేఏసీ విధానాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే.
రెండో దశ: నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ జరగనుంది. ఆరు జిల్లాల్లోని మొత్తం 32 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తిచేసింది. మొదటి దశలో 10 జిల్లాల్లోని 49 నియోజకవర్గాల్లో ఈ నెల 12న పోలింగ్ జరిగిన సంగతి విదితమే. మూడో దశ 28న, నాలుగో దశ నవంబర్ 1న, ఐదో దశ నవంబర్ 5న పోలింగ్ జరగనుంది.
వెల్ కం చైనా: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విషయమై పలువురు చైనా ప్రతినిధులతో నేడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కీలక సమావేశం జరపనున్నారు.